Susheel Kumar
-
Olympics: ఒకరు పాతాళానికి.. మరొకరు అత్యున్నత శిఖరానికి
సాక్షి, వెబ్‌డెస్క్: బ్యాడ్మింటన్ స్టార్.. తెలుగుతేజం పీవీ సింధు.. రెజ్లర్ సుశీల్ కుమార్.. ఇద్దరు పేరున్నవారే. ఈ ఇద్దరు ఒలింపిక్స్‌లో రెండేసీసార్లు పతకాలు అందుకున్నవారే. ఇద్దరికి తమ క్రీడాంశాల్లో ఘనమైన చరిత్రే ఉంది. కానీ కాలచక్రంలో రెజ్లర్ సుశీల్ కుమార్ పేరు పాతాళానికి పడిపోతే.. పీవీ సింధు పేరు భారత చరిత్రలో అత్యున్నత స్థాయికి చేరుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు.. ఐదేళ్ల తర్వాత టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచి దేశం గర్వపడేలా చేసింది. సరిగ్గా ఇలాంటి ఫీట్‌నే రెజ్లర్ సుశీల్ కుమార్ నమోదు చేశాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం ఒడిపిపట్టిన సుశీల్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించి చరిత్ర సృష్టించాడు. స్వాతంత్యం తర్వాత భారత్ నుంచి వ్యక్తిగత విభాగంలో వరుసగా రెండుసార్లు పతకం సాధించిన వ్యక్తి సుశీల్‌కుమార్ మాత్రమే. ఇప్పడు ఆ ఘనతను పీవీ సింధు కూడా సాధించింది. ఇక ఈ ఇద్దరి జీవితాలు ఒకసారి పరిశీలించి చూడగా.. సింధు తన ప్రతిభతో మరింత పేరు సంపాదించగా.. 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత సుశీల్ స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ రజతం నెగ్గిన తర్వాత దేశంలో అతను ఎందరికో ఆదర్శమయ్యాడు. భారత రెజ్లింగ్‌లో ఒక్క వెలుగు వెలిగిన సుశీల్ ఇప్పుడు వివాదాల నీడలో ఉన్నాడు. అతని అహం, మిగతా రెజర్ల పట్ల చిన్నచూపు ఇలా పలు అంశాలు అతన్ని కిందికి తొక్కేశాయి. విచిత్రంగా సింధు టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ముద్దాడిన మరుసటిరోజే సుశీల్‌కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చార్జీషీటులోకి ఎక్కాడు. ఇక పీవీ సింధు విషయానికి వస్తే.. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఆమె క్రేజ్ మరింత రెట్టింపైంది. ఎంతలా అంటే భారత్‌లో క్రికెటర్లకు ఉన్నంత క్రేజ్ సింధు సాధించడం విశేషం. ప్రపంచచాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా క్రీడలు ఇలా ఏ టోర్నీ చూసుకున్నా ఆమె సాధించని పతకాలు లేవు. 2004 నుంచి బ్యాడ్మింటన్‌లో కఠోర సాధన చేస్తున్న సింధు 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తర్వాత ఇంకా సాధించాల్సి ఏముందని అనుకొని ఉంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది. కానీ సింధు అలా అనుకోలేదు. ఈ ఐదేళ్లలో ఆమె మరింత రాటుదేలింది. ఎంతలా అంటే 2019లో ఏకంగా మహిళల బాడ్మింటన్ విభాగంలో ప్రపంచచాంపియన్‌గా నిలిచింది. ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన సింధుకూ ఒకటి మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. అదే ఆల్ ఇంగ్లండ్ బ్మాడ్మింటన్ చాంపియన్‌షిప్ టోర్నీ. ఇటీవలే ముగిసిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు సెమీఫైనల్లో ఓడిపోయింది. ఇక త్వరలో జరగబోయే ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పీవీ సింధు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఏదైతేనేం... విశ్వక్రీడల్లో ఈ ఇద్దరు క్రీడాకారులు దేశం కోసం కష్టపడ్డారు.. పతకం కోసం శ్రమించారు.. దేశం కీర్తిని రెపరెపలాడించారు. కానీ ఒకరి తప్పిదం తన క్రీడా జీవితాన్ని నాశనం చేస్తే.. ఒకరి పట్టుదల యావత్ దేశ కీర్తిని మరింత ఇనుమడింప చేసింది.- -
రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
-
తీహర్ జైల్లో రెజ్లర్ సుశీల్‌కు టీవీ కేటాయింపు
న్యూఢిల్లీ: అన్నీ కలిసొస్తే ఈపాటికి టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్ క్రీడా పోటీల్లో రెజ్లర్ సుశీల్‌కుమార్ ఉండేవాడు. కానీ ఓ హత్య కేసు విషయంలో అరెస్టయి ప్రస్తుతం తిహార్ జైలులో కాలం వెళ్లదీస్తున్నాడు. రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ తాను ఒలంపిక్స్ క్రీడలు చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారుడు చేసిన విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అతడికి టీవీ కేటాయించారు. మే 23వ తేదీన ఓ వివాదం విషయంలో యువ రెజ్లర్ సాగర్ రాణాను హత్య చేసిన కేసులో సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. కొన్నాళ్లు పరారీలో ఉన్న సుశీల్‌ను అనంతరం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం
వేదిక రెజ్లింగ్ స్టేడియమే కావచ్చు... కానీ అది రెజ్లర్ల మధ్య గొడవ మాత్రమే కాదు... దాని వెనక బయటకు కనిపించని అనేక చీకటి కథలున్నాయి... దేశంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో రెండు ఒలింపిక్ మెడల్స్‌ను సాధించిన దిగ్గజం తనది కాని బాటలో వెళ్లి తప్పుడు మనిషిగా తేలిన వైనమిది... ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి సాధించిన కీర్తి ప్రతిష్టలను పణంగా పెడుతూ సాధారణ గల్లీ గూండాలతో చేసిన స్నేహం, ఆపై శత్రుత్వం సుశీల్ కుమార్‌ను పతకాలు సాధించే స్థాయి నుంచి పతనం వైపు నడిపించింది. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 4న ఈ ఘటన జరిగిన రోజున వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే... ఛత్రశాల్ స్టేడియంలో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసే కొందరి మధ్య వాదోపవాదాల తర్వాత క్షణికావేశంలో జరిగిన ఉదంతంలా కనిపించింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్తి, భూ తగాదాలు ప్రాథమిక కారణం కావడంతో పాటు రౌడీల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. నిజానికి 18 రోజులపాటు సుశీల్ తప్పించుకు తిరిగింది పోలీసుల భయం వల్ల కాదని... గ్యాంగ్స్టర్లు తనను చంపేస్తారనే భయంతోనే అతను ఆ పని చేసినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ... ఢిల్లీలోని మోడల్ హౌస్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ఒక ఫ్లాట్ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. తన భార్య పేరిట ఉన్న ఈ ఫ్లాట్‌ను సందీప్ అలియాస్ కాలా జఠేడి అనే వ్యక్తి భాగస్వామ్యంతో కలిసి సుశీల్ కొన్నాడు. సుశీల్ స్నేహం చేసిన ఈ కాలా జఠేడి న్యూఢిల్లీలో గ్యాంగ్స్టర్లలో ఒకడు. అతనిపైన పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయి. ఢిల్లీ పరిసరాల్లో భూ కబ్జాల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా మంది రెజ్లర్లతో పాటు క్రిమినల్స్ కూడా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇందులో కొన్నాళ్లుగా జఠేడి మేనల్లుడి వరుస, అత్యంత ఆత్మీయుడైన రెజ్లర్ సోనూ మహల్, మరో రెజ్లర్ సాగర్ రాణా ఉంటున్నారు. రెజ్లర్ సోనూపై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమభాగస్వామ్యం ఉన్న ఈ ఫ్లాట్‌ను జఠేడి అమ్మాలని భావించగా, అందుకు సుశీల్ అంగీకరించలేదు. దానిని అమ్మి తన డబ్బులు ఇవ్వాలంటూ సుశీల్‌పై జఠేడి ఒత్తిడి పెంచగా... ఫ్లాట్‌లో ఉంటున్న సోనూ, సాగర్ ఖాళీ చేయాలంటూ సుశీల్ మరోవైపు చెబుతూ వచ్చాడు. గుణపాఠం చెప్పాలని... సుశీల్ గత కొంత కాలంగా జఠేడి ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా, నవీన్ బాలిలతో స్నేహం పెంచుకోవడం కూడా జఠేడి ఆగ్రహానికి కారణమైంది. ఫ్లాట్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సుశీల్‌పై సోనూ తదితరులు బహిరంగంగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దాంతో వారికి గుణపాఠం చెప్పాలని సుశీల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 4న స్టేడియం ముందు వీరంతా ఎదురెదురుగా తలపడ్డారు. అప్పటికే నీరజ్‌కు సంబంధించిన గూండాలను సుశీల్ తన కోసం పిలిపించుకున్నాడు. జఠేడి భయంతో సుశీల్ తనను ఏమీ చేయడని సోనూ భావించినా... నీరజ్ గూండాలు వారిని చితకబాదారు. ఆవేశపరుడైన సుశీల్ కూడా తాను ఓ చేయి వేశాడు. పైగా తనేంటో అందరికీ తెలియాలని, వారిలో భయం ఉండాలంటూ ఈ ఘటనను వీడియో షూట్ చేయమని తనవారికి సూచించాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ తర్వాతి రోజు ఆసుపత్రిలో మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వేర్వేరు చోట్ల నుంచి తప్పించుకుంటూ... తన మేనల్లుడు సోనూపై దాడి సహజంగానే జఠేడికి కోపం తెప్పించింది. దాంతో సుశీల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. అనూహ్య ఘటన తర్వాత బెదిరిన సుశీల్ ఆ రోజు నుంచి ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో కూడా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మొదలు పెట్టి యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో దాక్కున్నాడు. తనను క్షమించమంటూ చివరకు జఠేడిని ఫోన్లో కోరేందుకు కూడా సుశీల్ ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత కూడా అతను హత్య కేసుకంటే కూడా తనకు రౌడీల నుంచి రక్షణ కల్పించమంటూ అతను కోరాడని తెలిసింది. సస్పెండ్ చేయనున్న రైల్వేస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నార్తర్న్ రైల్వేలో సుశీల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ హోదాలో ఉన్నాడు. అయితే ప్రాథమిక స్థాయిలో క్రీడలను తీర్చిదిద్దే బాధ్యతలతో 2015 నుంచి అతను ఢిల్లీ ప్రభుత్వం వద్ద డిప్యుటేషన్ మీద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ హోదాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా కొనసాగింపు కోరినా ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడంతో రైల్వేస్‌కు వెళ్లిపోయాడు. నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా నేరాల్లో నిందితుడిగా ఉంటే దర్యాప్తు ముగిసేవరకు సస్పెండ్ చేస్తామని, సుశీల్ విషయంలో కూడా అదే జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మరోవైపు సుశీల్‌పై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. ప్రస్తుతం అతనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని... చట్ట పరంగా విచారణ తర్వాత ముగిసి తీర్పు వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతామని స్పష్టం చేసింది. -
Wrestler Sushil Kumar: సుశీల్ చిక్కాడు...
న్యూఢిల్లీ: పోలీసులు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసినా... కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించినా... యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో 19 రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులోని ముండ్కా ప్రాంతంలో సుశీల్ కుమార్, అతడి అనుచరుడు అజయ్ కుమార్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సుశీల్, అజయ్‌లను కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు లోపల సుశీల్‌ను 30 నిమిషాలపాటు ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు మరిన్ని వివరాల రాబట్టేందుకు 12 రోజులపాటు తమ కస్డడీకి అప్పగించాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాను కోరగా.... ఆరు రోజులపాటు సుశీల్, అజయ్‌లను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చారు. ఏం జరిగిందంటే... ఈ నెల నాలుగో తేదీన అర్ధరాత్రి ఛత్రశాల్ స్టేడియంలో జాతీయ గ్రీకో రోమన్ రెజ్లింగ్ చాంపియన్ సాగర్ రాణా, అతని మిత్రులు సోనూ, అమిత్ కుమార్‌లతో సుశీల్ కుమార్, అతని అనుచరులు గొడవ పడ్డారు. ఈ గొడవలో సాగర్, సోనూ, అమిత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 23 ఏళ్ల సాగర్ రాణా మృతి చెందాడు. తమపై సుశీల్, అతని అనుచరులు దాడి చేశారని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో సోనూ, అమిత్ పేర్కొన్నారు. దాంతో సుశీల్, అతని అనుచరులపై ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 (హత్య)తోపాటు మరో 10 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జరిగిన తర్వాతి రోజు (మే 5) నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సుశీల్ హరియాణా, చండీగఢ్, పంజాబ్, గయా, గురుగ్రామ్ ఇలా ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో గడిపినట్లు సమాచారం. ఫోన్ ద్వారా తన ఆచూకీ దొరకకూడదనే ఉద్దేశంతో సుశీల్ 14 వేర్వేరు సిమ్ కార్డులు వాడినట్లు తెలిసింది. సుశీల్ ఆచూకీ తెలిపితే రూ. లక్ష రివార్డు కూడా ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఆఖరికి ఆదివారం ఉదయం ఢిల్లీ శివారులో తన అనుచరుడు అజయ్‌తో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు సుశీల్ చిక్కాడు. ఖేల్ ఖతమ్! అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించిన 37 ఏళ్ల సుశీల్ కుమార్ పరువు, ప్రతిష్ట తాజా ఉదంతంతో మసకబారిపోయింది. ఈ హత్యతో తనకు సంబంధంలేదని సుశీల్ వివరణ ఇస్తున్నాడు. అయితే అతనికి వ్యతిరేకంగా పోలీసుల వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు సమాచారం. నార్నర్త్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్ అయిన సుశీల్ ఐదేళ్లుగా ఛత్రశాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కొనసాగుతున్నాడు. అయితే సుశీల్ సమక్షంలోనే గొడవ జరగడం... సాక్ష్యాలూ ధ్వంసం కావడం... ఎఫ్ఐఆర్లో అతని పేరు ఉండటం.. తాజాగా అరెస్టు కూడా కావడంతో సుశీల్ ఉద్యోగం ఊడే అవకాశముంది. ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన సుశీల్... తాజా సంఘటనతో భవిష్యత్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడిందనే చెప్పాలి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ లో చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన సుశీల్ 20వ స్థానంలో నిలిచాడు. సుశీల్ ఘనతలు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం. 2010 ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం. 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో, 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాలు 2006 దోహా ఆసియా క్రీడల్లో కాంస్యం. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం (2010), రజతం (2007), రెండు కాంస్యాలు (2003, 2008). కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో (2003, 2005, 2007, 2009, 2017) ఐదు స్వర్ణాలు, ఒక కాంస్యం (2005). 1998, 1999 ప్రపంచ క్యాడెట్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు. అవార్డులు అర్జున అవార్డు: 2005; రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న: 2009; పద్మశ్రీ: 2011 -
సుశీల్ కుమార్ ఎక్కడ?
న్యూఢిల్లీ: రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ పరారీ వ్యవహారం సీరియస్‌గా మారింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యోదంతానికి సంబంధించి సుశీల్‌పై ఢిల్లీ పోలీసులు ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. గత మంగళవారం ఘటన జరిగిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేని సుశీల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ‘లుక్ అవుట్’ నోటీసు ఇచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. పోలీసు ఎఫ్ఐఆర్లో సుశీల్ పేరు ఉండటంతో అతడిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యామని వారు చెప్పారు. ఢిల్లీ–ఎన్సీఆర్తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సుశీల్ కోసం వెతికామని వెల్లడించారు. ఈ ఘటనలో బాధితుల స్టేట్మెంట్ను పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు. ఛత్రశాల్ స్టేడియం పార్కింగ్ వద్ద ఇరు వర్గాలు కొట్టుకున్న ఘటనలో 23 ఏళ్ల జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. ఆ సమయంలో సుశీల్ అక్కడే ఉన్నాడని సాక్షులు చెప్పారు. తన గురించి బహిరంగంగా చెడుగా మాట్లాడుతున్న రాణాకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతని ఇంటినుంచి లాక్కొని వచ్చి మరీ సుశీల్, అతని అనుచరులు కొట్టారని కూడా మరికొందరు సాక్ష్యమిచ్చారు. రెజ్లింగ్ పరువు పోయింది: డబ్ల్యూఎఫ్ఐ రెండు ఒలింపిక్ పతకాలతో పాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ ఇప్పుడు హత్య కేసులో పరారీలో ఉండటం దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ అన్నారు. ఒకప్పుడు ఒంటి చేత్తో భారత రెజ్లింగ్ స్థాయిని పెంచి ఎందరితో ఆదర్శంగా నిలిచిన సుశీల్ ఇలా కావడం బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా ఘటన సుశీల్‌కు వ్యక్తిగతంగానే కాకుండా భారత రెజ్లింగ్ మొత్తానికి చెడ్డ పేరు తెచ్చిందని తోమర్ అభిప్రాయ పడ్డారు. రెజ్లర్లు అంటే గూండాలనే భావన మళ్లీ నెలకొంటుందని తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఏషియాఢంకా
భారీ సంఖ్యలో క్రీడాకారులు... దిగ్గజాలనదగ్గ దేశాలు... పెద్దఎత్తున బృందాలు... అందుకు తగ్గట్లు రికార్డులు... బరిలో హేమాహేమీలు... రసవత్తర సమరాలు... పతకాల వేటలో... పతాకస్థాయి పోరాటాలు... ... నేటి నుంచే ఏషియాడ్ సంరంభం ... పదహారు రోజుల పాటు సంగ్రామం సాక్షి క్రీడా విభాగం ఆసియా అతిపెద్ద క్రీడా సమరానికి నేడే శంఖారావం. ఇండోనేసియా వేదికగా... జకార్తా–పాలెంబాంగ్ నగరాల్లో శనివారం నుంచే 18వ ఏషియాడ్ ఆరంభం. 11 వేల మంది అథ్లెట్లు... 45 దేశాల ప్రాతినిధ్యంతో సెప్టెంబర్ 2 వరకు క్రీడలు. పతకాల వేటలో మేటైన చైనా... దీటైన జపాన్... దమ్మున్న దక్షిణ కొరియా... వీటిని తట్టుకుంటూ భారత్! మరి... ఈసారైనా మన భాగ్యరేఖ మెరుగవుతుందా? కామన్వెల్త్ జోరును ఇక్కడా కొనసాగిస్తుందా? పట్టికలో ప్రస్థానం పైకెళ్తుందా? బలాలేమిటి...? బలహీనతలేమిటి? అంశాల వారీగా ఓసారి సమీక్షిస్తే...! నవ యువత... అనుభవజ్ఞులు ఏషియాడ్ భారత బృందంలో పదహారేళ్ల పాఠశాల బాలిక నుంచి ఒలింపిక్ పతకాలు గెలిచిన ఉద్ధండులున్నారు. నాలుగు నెలల క్రితం కామన్వెల్త్ క్రీడల్లో దాదాపు ఇదే బృందం అద్భుత ప్రదర్శనతో అనూహ్యంగా మూడో స్థానం సాధించి సగర్వంగా దేశానికి తిరిగొచ్చింది. అయితే, ఆ పోటీల్లో చైనా, జపాన్, దక్షిణ కొరియాకు ప్రాతినిధ్యం లేదు. ఏషియాడ్‌లో మాత్రం ఈ దేశాల నుంచి ప్రతి అంశంలో పోటీ తప్పదు. వీటితోపాటు బృందం ఎంపిక, పరిమితిపై వివాదాలతో ముందే కొంత చర్చ రేగింది. ఈ నేపథ్యంలో ఏకాగ్రత చెదరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతమే స్ఫూర్తి... కొన్నేళ్లుగా మెరుగుపడుతున్న భారత క్రీడా వ్యవస్థకు నిదర్శనంగా 2014 ఏషియాడ్‌లో మన క్రీడాకారులు విశేషంగా రాణించారు. 11 స్వర్ణాలు సహా మొత్తం 57 పతకాలు నెగ్గి ఈ క్రీడల చరిత్రలో తమ రెండో అత్యుత్తమ ప్రదర్శనను పునరావృతం చేశారు. సుశీల్ కుమార్, నీరజ్ చోప్రా, మనూ భాకర్‌లకు తోడు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజం పీవీ సింధు ఫామ్‌ను బట్టి చూస్తే ప్రస్తుతం ఈ సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మరో చరిత్ర సృష్టించినట్లవుతుంది. సింధు, శ్రీకాంత్‌లపై దృష్టి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన పీవీ సింధు అద్భుత ఫామ్‌లో ఉంది. ఆఖరి పోరాటాల్లో ఓడుతున్నా... ఏ దశలోనైనా పుంజుకోగల సత్తా సింధు సొంతం. చైనా, థాయ్‌లాండ్, జపాన్ షట్లర్ల నుంచి తీవ్ర పోటీ ఉన్నా... వాటిని అధిగమించడం ఈ తెలుగమ్మాయికి కష్టమేం కాదు. పూర్వ ఫామ్‌ను అందుకుంటే పురుషుల విభాగంలో కిడాంబి శ్రీకాంత్ నుంచి కూడా పతకం ఆశించవచ్చు. హెచ్ఎస్ ప్రణయ్పైనా ఆశలున్నాయి. హిమాదాస్ మెరిసేనా... అసోంకు చెందిన హిమాదాస్‌పై ఈ ఏషియాడ్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా అండర్–20 ప్రపంచ చాంపియన్‌షిప్ 400 మీటర్ల పరుగు పందెంలో హిమాస్వర్ణం నెగ్గడమే దీనికి కారణం. జకార్తాలోనూ ఈమెను ఫేవరెట్‌గా భావిస్తున్నారు. పతకం సాధిస్తుందని ఆశిస్తున్నారు. వీరేం చేస్తారో... రెజ్లింగ్‌లో ఒలింపిక్ పతక విజేతలైన సుశీల్ కుమార్, సాక్షి మలిక్లు ఏమేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది. తమ గురించి కొత్తగా చాటేందుకు ఏమీ లేకున్నా... కొంతకాలంగా వీరు ఫామ్‌లో లేరు. సుశీల్ ఇటీవల టిబిలిసి గ్రాండ్‌ప్రిలో బౌట్ ఓడిపోయాడు. నాలుగేళ్లలో అతడికిదే తొలి పరాజయం కావడం గమనార్హం. టర్కీలో జరిగిన యాసర్ డొగు టోర్నీలో సాక్షి పతకం అందుకోలేకపోయింది. వీరి ప్రతిష్ఠకు ఈ ఏషియాడ్ ఓ సవాలే. స్వర్ణం తప్ప మరేది గెలిచినా వారి స్థాయికి తక్కువే అన్నట్లవుతుంది. ఒలింపిక్స్ టికెట్ కొట్టేస్తారా..? పురుషుల హాకీ జట్టు పూర్వ వైభవం దిశగా అడుగులేస్తోంది. చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచింది. గత ఏషియాడ్‌లో స్వర్ణంతో మెరిసింది. ఈసారి దానిని నిలబెట్టుకుంటే 2020 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందుతుంది. పరిస్థితి చూస్తే మళ్లీ స్వర్ణం నెగ్గేలా కనిపిస్తున్నా... పాకిస్తాన్, దక్షిణ కొరియాలను ఎలా ఎదుర్కొంటుందనేదీ కీలకమే. రాణి రాంపాల్ ఆధ్వర్యంలోని మహిళల హాకీ జట్టు సంచలనాలు సృష్టించ గలదు. గత క్రీడల్లో గెలిచిన కాంస్యాన్ని మించి రాణించేందుకు ప్రయత్నించాల్సి ఉంది. ‘కిక్’ ఇస్తారా? బాక్సింగ్‌లో భారత్‌కు ఎక్కువ అవకాశాలే కనిపిస్తున్నాయి. అందుకు కారణం... వికాస్ కృషన్, శివ థాపాలతో పాటు వర్థమాన తార గౌరవ్ సోలంకి. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్ రజతం విజేత సర్జుబాలా దేవి భారత్ ఖాతాలో పతకం చేర్చగలదు. కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా స్వర్ణం ఒడిసిపట్టింది. ఇప్పుడు కనీసం ఒక పతకమైనా తెస్తుందని భావిస్తున్నారు. కొంతకాలంగా సంచలన ప్రదర్శనలతో అదరగొట్టి వార్తల్లో నిలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ గాయం కారణంగా ఇబ్బంది పడింది. దాన్నుంచి కోలుకున్న ఆమె బరిలో దిగనుండటం ఆశలు రేపుతోంది. ► బ్రిడ్జ్ క్రీడలో బరిలో దిగనున్న 81 ఏళ్ల లీహంగ్ ఫాంగ్... ఆసియా క్రీడల చరిత్రలోనే అతిపెద్ద వయస్కుడు. 11 ఏళ్ల ఇయాన్ నుర్మెన్ అమ్రి (స్కేట్‌బోర్డర్) అతి చిన్నవయస్కుడు. వీరిద్దరూ మలేసియాకు చెందినవారే కావడం విశేషం. ప్రారంభ వేడుకలు సోనీ టెన్–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం మనోళ్లు 17 మంది... ► ఆర్చరీ– జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్). ► బ్యాడ్మింటన్– కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, చుక్కా సాయి ఉత్తేజిత రావు, సాత్విక్ సాయిరాజ్ (ఆంధ్రప్రదేశ్), సైనా నెహ్వాల్, సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి, సాయిప్రణీత్, పుల్లెల గాయత్రి (తెలంగాణ) ► బాక్సింగ్– హుసాముద్దీన్ (తెలంగాణ) ► జిమ్నాస్టిక్స్– అరుణా రెడ్డి (తెలంగాణ) ► మహిళల హాకీ– రజని (ఆంధ్రప్రదేశ్) ► పురుషుల కబడ్డీ– మల్లేశ్ (తెలంగాణ) ► సెపక్తక్రా– తరంగిణి (తెలంగాణ) ► షూటింగ్–రష్మీ రాథోడ్ (తెలంగాణ) ► టెన్నిస్–యడ్లపల్లి ప్రాంజల (తెలంగాణ) -
బీదర్‌లో సుశీల్‌కుమార్ అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/న్యాల్కల్(జహీరాబాద్) : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారం ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతి చెందిన బీదర్‌వాసి, గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ బి.సుశీల్‌కుమార్ (33) అంత్యక్రియలు శనివారం బీదర్ పట్టణంలో నిర్వహించారు. భద్రాద్రి నుంచి ఆయన మృతదేహాన్ని శనివారం తెల్లవారుజామున ప్రత్యేక వాహనంలో బీదర్‌కు తీసుకొచ్చారు. సుశీల్ మృతదేహం ఇంటికి రాగానే కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. పట్టణంలోని నయాకమాన్, అఫ్జల్‌గంజ్ మీదుగా మంగల్‌పేట్‌లోని మె«థడిస్టు చర్చి వరకు అంతిమయాత్ర కొనసాగింది. అనంతరం మంగల్‌పేట్‌లోని శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. నివాళులర్పించిన డీజీపీ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కర్ణాటకలోని బీదర్‌లో ఉన్న సుశీల్‌కుమార్ ఇంటికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. అలాగే అంత్యక్రియలకు నిఘా విభాగం అధిపతి నవీన్‌చంద్, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, బీదర్ కలెక్టర్ మహాదేవు, ఎస్పీ దేవరాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
సుశీల్ పసిడి ‘పట్టు’
న్యూఢిల్లీ: మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. 74 కేజీల విభాగం ఫైనల్లో ఆకాశ్ ఖుల్లర్ (న్యూజిలాండ్)ను సుశీల్ చిత్తుగా ఓడించాడు. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ 62 కేజీల విభాగం ఫైనల్లో 13–2తో తైలా తుహినే (న్యూజిలాండ్)ను ఓడించి స్వర్ణం దక్కించుకుంది. -
'భావప్రకటన స్వేచ్ఛ వారికేనా..'
ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలకు వెళ్లి నిజాలను బయటపెడతానని హెచ్‌సీయూ ఏబీవీపీ నేత సుశీల్ కుమార్ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. అంబేడ్కర్ యూనియన్ ఆగడాలను ప్రశ్నిస్తే తనను దారుణంగా కొట్టారని తెలిపారు. భావప్రకటన స్వేచ్ఛ కేవలం వారికేనా మాకు లేదా అని సుశీల్ కుమార్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌లు యాకుబ్ మెమన్‌కు మద్దతిస్తున్నారా అని ప్రశ్నించిన సుశీల్ కుమార్.. ఇది దేశభక్తులకు ప్రత్యర్థులతో జరుగుతున్న పోరాటంగా తెలిపారు. ఒక్క రోహిత్ ఆత్మహత్య గురించే కాకుండా యూనివర్సిటీలో జరిగిన అన్ని ఆత్మహత్యలపై విచారణ జరపాలన్నారు. -
విద్యార్థుల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల సస్పెన్షన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ను ఇప్పటికే ఎత్తివేశామని హెచ్‌సీయూ వర్గాలు హైకోర్టుకు తెలిపాయి. అయితే ఈ విషయంలో మరింత సమాచారం తెలుసుకున్న అనంతరం కౌటర్ దాఖలు చేస్తామని హోంశాఖ న్యాయవాది హై కోర్టుకు తెలిపారు. కాగా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సుశీల్ కుమార్ తల్లి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. -
'ఆ గొడవలకు కులాల రంగు పూయడం సరికాదు'
హైదరాబాద్: యూనివర్సిటీ తగదాలకు కులాల రంగు పూయడం సరికాదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హెచ్‌సీయూ నేత సుశీల్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో సుశీల్ మాట్లాడుతూ....హెచ్‌సీయూ ఘటనపై కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు. 40 మందికి పైగా వచ్చి నన్ను కొట్టినప్పుడు ఒక్కరు మాట్లాడలేదని...ఇప్పుడు మాట్లాడుతున్నవారందరూ అప్పుడేమయ్యారని ప్రశ్నించాడు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతి కారణంగా గత నాలుగు రోజులుగా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. -
కులాల రంగు పూయడం సరికాదు