హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల సస్పెన్షన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల సస్పెన్షన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ను ఇప్పటికే ఎత్తివేశామని హెచ్సీయూ వర్గాలు హైకోర్టుకు తెలిపాయి. అయితే ఈ విషయంలో మరింత సమాచారం తెలుసుకున్న అనంతరం కౌటర్ దాఖలు చేస్తామని హోంశాఖ న్యాయవాది హై కోర్టుకు తెలిపారు. కాగా తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సుశీల్ కుమార్ తల్లి హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది.