
కోరుట్ల: ‘మేం చిన్నపిల్లలం.హైకోర్టు మా విషయంలో ఇంత ఆదరణ చూపుతుందని అనుకోలేదు. సమస్యలు తెలుసుకోవడానికి అంతా కదిలివచ్చారు. మా పాఠశాలను బాగు చేయడానికి డబ్బులు ఇస్తామన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాపై ఆదరణతో స్పందించిన హైకోర్టు న్యాయమూర్తికి ధన్యవాదాలు.. మా నమ్మకం నిలబడింది’.. అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల జెడ్పీ పాఠశాల నుంచిసమస్యలు రాసిన తొమ్మిదో తర గతి విద్యార్థినులు వైష్ణవి, రశ్మితలు సంతోç Ùం వ్యక్తంచేశారు. కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం పాఠశాలను సంద ర్శించి మౌలిక వసతులను పరిశీలించారు.
హడావుడిగా మరమ్మతులు
హైకోర్టు ఆదేశాలతో కోరుట్ల బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలలో దెబ్బతిన్న మరుగుదొడ్లను అధికారులు హడావుడిగా బాగు చేయించారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి వసతి కోసం రూ.11 లక్షలతో రూపొందించిన ప్రతిపాదనలు ఆర్‌ఎంఎస్‌ఏ అధికారులకు పంపించారు. ఈ నిధులు త్వరలో వస్తాయని పాఠశాలకు పూర్తి వసతులు కల్పిస్తామని ఎంఈవో నరేశం తెలిపారు. విద్యార్థులు ఒక పాఠాన్ని చదివి ఆచరణాత్మకంగా తమ సమస్యల పరిష్కారానికి హైకోర్టుకు లేఖ రాయడం అభినందనీయమని పేర్కొన్నారు. రశ్మిత, వైష్ణవి చొరవ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.