
'ఆ గొడవలకు కులాల రంగు పూయడం సరికాదు'
హైదరాబాద్: యూనివర్సిటీ తగదాలకు కులాల రంగు పూయడం సరికాదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హెచ్సీయూ నేత సుశీల్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్లో సుశీల్ మాట్లాడుతూ....హెచ్సీయూ ఘటనపై కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు.
40 మందికి పైగా వచ్చి నన్ను కొట్టినప్పుడు ఒక్కరు మాట్లాడలేదని...ఇప్పుడు మాట్లాడుతున్నవారందరూ అప్పుడేమయ్యారని ప్రశ్నించాడు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతి కారణంగా గత నాలుగు రోజులుగా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే.