HCU incident
-
విద్యార్థి రోహిత్ కుటుంబానికి టీపీసీసీ ఆర్థిక సాయం
హైదరాబాద్: హెచ్‌సీయూ విద్యార్థి వేముల రోహిత్ కుటుంబానికి తెలంగాణ పీసీసీ ఆర్థిక సాయం చేసింది. మంగళవారం రోహిత్ తల్లి రాధికకు 5 లక్షల రూపాయల చెక్కును తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అందజేశారు. కాగా, హెచ్‌సీయూలో సస్పెన్షన్‌కు గురైన ఐదుగురు విద్యార్థుల్లో గుంటూరుకు చెందిన వేముల రోహిత్ అనే పీహెచ్డీ విద్యార్థి కలత చెంది ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
'ఆ గొడవలకు కులాల రంగు పూయడం సరికాదు'
హైదరాబాద్: యూనివర్సిటీ తగదాలకు కులాల రంగు పూయడం సరికాదని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) హెచ్‌సీయూ నేత సుశీల్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లో సుశీల్ మాట్లాడుతూ....హెచ్‌సీయూ ఘటనపై కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించాడు. 40 మందికి పైగా వచ్చి నన్ను కొట్టినప్పుడు ఒక్కరు మాట్లాడలేదని...ఇప్పుడు మాట్లాడుతున్నవారందరూ అప్పుడేమయ్యారని ప్రశ్నించాడు. పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతి కారణంగా గత నాలుగు రోజులుగా సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. -
కులాల రంగు పూయడం సరికాదు
-
10 మంది హెచ్ సీయూ ప్రొఫెసర్ల రాజీనామా
హైదరాబాద్: పీహెచ్ డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. 10 మంది ఎస్టీ, ఎస్సీ ప్రొఫెసర్లు అడ్మినిస్ట్రేటివ్ పదవులకు రాజీనామా చేశారు. పరిపాలనా సంబంధిత పదవుల నుంచి తప్పుకుంటున్నామనీ, విద్యా బోధనలు కొనసాగిస్తామని వారు గురువారం మీడియాకు లేఖ విడుదల చేశారు. రాజీనామాలతో తాము అడ్మినిస్ట్రేషన్‌పై ఒత్తిడి తేగలమని పేర్కొన్నారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారంగానూ తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని అధ్యాపకులు ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్య ఘటనపై వెలువెత్తిన నిరసనలకు తాము సంఘీభావం తెలపుతున్నామన్నారు. అంతేకాక ఇప్పటివరకూ విద్యార్థులపై సస్పెన్షన్, నమోదైన పోలీస్ కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. కాగా, ఆదివారం వేముల రోహిత్ ఆత్మహత్య ఘటనతో దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో విద్యార్థులు, రాజకీయ పార్టీల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. -
దోషులను కచ్చితంగా శిక్షించాల్సిందే: నఖ్వీ
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. హైదరాబాద్ వర్శిటీలో ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. దోషులను కచ్చితంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ఆరాటపడుతోందని విమర్శించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయను లక్ష్యం చేసుకోవడం సరికాదన్నారు.