
హెచ్‌డీ నాణ్యతతో గణతంత్ర వేడుకల ప్రసారం
గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ టీవీ చానల్ దూరదర్శన్ తొలిసారిగా హైడెఫినిషన్ (హెచ్‌డీ) నాణ్యతతో ప్రసారం చేయనుంది. ఇంటర్నెట్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ద్వారా కూడా ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వ టీవీ చానల్ దూరదర్శన్ తొలిసారిగా హైడెఫినిషన్ (హెచ్‌డీ) నాణ్యతతో ప్రసారం చేయనుంది. ఇంటర్నెట్ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్ ద్వారా కూడా ఈ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డీడీ న్యూస్, డీడీ భారతి, డీడీ ఉర్దూ చానళ్లలో ఆదివారం జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్న దూరదర్శన్, తొలిసారిగా సంజ్ఞల భాషలోనూ ప్రసారం చేయనుంది. ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇప్పటివరకు స్టాండర్డ్ డెఫినిషన్ నాణ్యతతోనే ప్రసారం చేస్తూ వచ్చామని, ఈ ఏడాది తొలిసారిగా హెచ్‌డీ నాణ్యతతో ప్రసారం చేయనున్నామని దూరదర్శన్ అధికారులు తెలిపారు. అంతరాయం లేకుండా ఈ ప్రసారాలు జరపడానికి సుమారు వందమందికి పైగా సిబ్బంది పనిచేయనున్నట్లు చెప్పారు.