
అంధులకు టీవీ
లండన్: టెలివిజన్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలను అంధులు, బధిరులు ఆస్వాదించేందుకుగాను శాస్త్రవేత్తలు కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ‘ప్రీవాసివ్ ఎస్‌యూబీ’ అనే సాఫ్ట్‌వేర్ టీవీల్లో వచ్చే ప్రతీ కార్యక్రమానికి సంబంధించిన సబ్‌టైటిల్స్‌ను దీనికి అనుసంధానంగా ఉన్న సర్వర్‌కు చేరవేస్తుంది.
ఈ సబ్‌టైటిల్స్‌ను బ్రెయిలీ లిపిలోకి మార్పుచేసి స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌కు పంపుతారు. బ్రెయిలీ లిపిలోని వీటిని చదివేందుకు ప్రత్యేకమైన యాప్‌ను యూజర్లు తమ డివైజ్‌ల్లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ప్రస్తుతం దీన్ని మాడ్రిడ్‌లోని స్పానిష్ చానల్స్‌లో వాడుతున్నారు. దీన్ని ఉపయోగించుకునేందుకు ఎటువంటి రుసుము అవసరం లేదని తెలిపారు.