
ఫేస్‌బుక్,వాట్సాప్,యూట్యూబ్,హాట్‌స్టార్ వంటి సామాజిక మాధ్యమాలు ఎన్ని వచ్చినా టీవీ చూసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉందని,అందులోనూ దక్షిణ భారతీయులు ఈ విషయంలో ముందున్నారని తాజా సర్వేలో తేలింది.అంతేకాకుండా ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతంలోనే ఎక్కువ టెలివిజన్లు ఉన్నాయని కూడా బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడయింది.దక్షిణ భారత దేశంలో 99.9% ఇళ్లకు విద్యుత్ సదుపాయం ఉండటం, దక్షిణ భారతీయులు మొదట కొనే గృహోపకరణం టీవీయే కావడం దీనికి కారణమని బార్క్ సీఈవో దాస్‌గుప్తా తెలిపారు. 4,300 పట్టణాల్లో 3 లక్షల మందిని సర్వే చేసి బార్క్‘బ్రాడ్‌కాస్ట్ ఇండియా సర్వే(2018) పేరుతో నివేదిక విడుదల చేసింది.దాని ప్రకారం ఐదు దక్షిణ రాష్ట్రాల్లో 95శాతం ఇళ్లలో టీవీలు ఉన్నాయి.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 25 కోట్ల 90 లక్షల టీవీలు ఉన్నాయి.2016తో పోలిస్తే ఇది 8శాతం ఎక్కువ. ఉత్తర భారతంలో 20.9 కోట్లు, పశ్చిమ భారతంలో22.1 కోట్లు, తూర్పు భారతంలో14.6 కోట్ల టీవీలు ఉన్నాయి.దేశం మొత్తం మీద టీవీ ప్రేక్షకుల సంఖ్య 66శాతం ఉండగా, దక్షిణ భారత దేశంలో అది 95 శాతంగా ఉంది.
దేశంలో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో19.7 కోట్లకు చేరింది.2016తో పోలిస్తే ఇది 7.5% ఎక్కువ.అలాగే, టీవీ ప్రేక్షకుల సంఖ్య కూడా83.6 కోట్లకు(7.2% ఎక్కువ) చేరింది.
పట్టణ ప్రాంతాల్లో ప్రతి పది మందిలో ఎనిమిది మంది రోజులో 4 గంటల పది నిముషాలు,గ్రామీణ ప్రాంతాల్లో3 గంటల 27 నిముషాలు టీవీ చూస్తున్నారు. దక్షిణ భారతంలో టీవీ చూసే సమయం ఏటా పెరుగుతోంది.2016 నుంచి టీవీ ప్రేక్షకుల సంఖ్య 12శాతం పెరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య 2018లో 10శాతం పెరగ్గా, పట్టణ ప్రాంతాల్లో 4% పెరిగింది.
దేశంలో టీవీలు ఉన్న ఇళ్ల సంఖ్య
పట్టణాలు గ్రామాలు
2016 8 కోట్ల 40 లక్షలు 8 కోట్ల 70 లక్షలు
2018 9 కోట్ల 90 లక్షలు 10 కోట్ల 90 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment