నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్ | four cricket bookies were arrested | Sakshi
Sakshi News home page

నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్

Published Mon, Mar 2 2015 10:39 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

four cricket bookies were arrested

కడప: ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచుల సందర్భంగా బుకింగ్ వ్యవహారాలు నడుపుతున్న నలుగురిని వైఎస్సార్ జిల్లా కడప పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. స్థానికంగా రవీంద్రనగర్‌లో ఓ ఇంటిలో బుకింగ్ వ్యవహారాలు నడుస్తున్నట్టు అందిన సమాచారంతో డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బుకీలు అనిల్‌కుమార్ రెడ్డి, అల్తాఫ్, అహ్మద్, ఆదిశేషులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3 లక్షలకుపైగా నగదు, 4 సెల్‌ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రధాన బుకీ మాధవరెడ్డి పరారైనట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement