cricket bookies
-
బడా బుకీ జతిన్ అరెస్ట్
కర్ణాటక, బనశంకరి: సంచలనాల కర్ణాటక ప్రీమియర్ లీగ్ (కేపీఎల్)లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్, నటీమణుల ప్రమేయం తదితరాల కేసు విచారణను తీవ్రతరం చేసిన బెంగళూరు సీసీబీ అంతర్జాతీయ బుకీ జతిన్‌ను సోమవారం అరెస్ట్ చేసింది. కొన్నినెలలుగా నెదర్లాండ్స్‌లో తలదాచుకున్న ఢిల్లీకి చెందిన ఇతని కోసం రెడ్ కార్నర్ నోటీస్‌ను జారీచేశారు. అంతలోగా జతిన్ కోర్టులో ముందస్తు జామీను తీసుకున్నాడు. కేపీఎల్ ఫిక్సింగ్‌లో సూత్రధారిగా పేరున్న జతిన్ కెంపేగౌడ విమానాశ్రయానికి వస్తున్నాడనే పక్కా సమాచారం అందింది. దీని ఆధారంగా సోమవారం కెంపేగౌడ విమానాశ్రయంలో నెదర్లాండ్స్ నుంచి విమానంలో దిగగానే సీసీబీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు సీసీబీ ఉన్నతాధికారి సందీప్ పాటిల్ తెలిపారు. జతిన్ కేపీఎల్తో పాటు పలు క్రికెట్ మ్యాచ్ బెట్టింగుల్లో పాల్పంచుకున్నట్లు తేలిందని, దీనిపై కూపీ లాగుతున్నట్లు చెప్పారు. కేపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు సంబంధించి జతిన్ కీలక సమాచారం అందించాడని, ఇప్పటి వరకు అరెస్టైన వారితో సంబంధాలు ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. డీసీపీ కుల్దీప్కుమార్ జైన్ నేతృత్వంలో జతిన్‌ను విచారిస్తున్నామని, కోర్టు అనుమతి తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేపీఎల్ బాగోతం కీలక మలుపు తిరిగే అవకాశముంది. -
క్రికెట్ బుకీల అరెస్ట్
బరంపురం: నగరంలో కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ బుకీలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీలు త్రినాథ పటేల్, సంతున్ కుమార్ దాస్ చెప్పారు. స్థానిక పెద్ద బజార్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీలు మాట్లాడుతూ..నగరంలో కొద్ది రోజుల నుంచి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తమకు రహస్య సమాచారం అందిందని చెప్పారు. ఈ నేపథ్యంలో పెద్ద బజార్ ఐఐసీ అధికారి సురేష్ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్థానిక ఫస్ట్‌గేట్‌లోని క్రికెట్ బుకీలను పట్టుకున్నట్లు తెలిపారు. బుకీల ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి జీపీఎస్ సహకారంతో వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి గురువారం అర్ధరాత్రి ప్రత్యేక దాడులు చేసి 5గురు బుకీలను అరెస్ట్ చేశామని తెలిపారు. అరెస్ట్ అయిన వారి నుంచి రూ. 7.61లక్షల నగదు, సెల్‌ఫోన్స్, మూడు నోట్‌బుక్స్, ఒక కాల్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారు శాస్త్రినగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి దీపక్ సమంతరాయి అలియాస్ డిప్పు, కొనిసి హట్టో గ్రామానికి చెందిన జితేంద్ర నాయక్ అలియాస్ జిత్తు, దాస్‌పూర్‌కి చెందిన ప్రశాంత్ బెహరాగా పోలీసులు గుర్తించారు. అందా డిప్పు, యు.జె.రమేష్‌తో పాటు మరికొంత మంది పరారయ్యారని తెలిపారు. పరారైన వారిని త్వరలో పట్టుకుంటామని ఏఎస్సీలు చెప్పారు. గత రెండేళ్లలో క్రికెట్ బెట్టింగ్‌లో పాల్పడిన 32మంది అరెస్ట్ చేసి రూ.26 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ∙ -
15 మంది క్రికెట్ బుకీల అరెస్టు
ప్రకాశం, అద్దంకి: అద్దంకిలో నిన్న మొన్నటి వరకూ మూడు పువ్వులు ఆరు కాయాలుగా క్రికెట్ బెట్టింగ్ నడిచింది. పక్షం రోజులుగా పోలీసులు నిఘా ఉంచారు. బంగ్లా రోడ్లో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్న కొంతమందిని పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం మేరకు తీగ లాగితే డొంక కదిలింది. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, బెట్టింగ్ రాయుళ్లతో కలుపుకుని మొత్తం 25 మంది ఉన్నట్లు గుర్తించి వారిలో 15 మందిని బుధవారం అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ కె.నాగేశ్వరరావు చెప్పారు. డీఎస్పీ కథనం ప్రకారం.. అద్దంకి పట్టణంలో కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్‌కు ప్రధాన సూత్రధారులున్నట్లు సీఐ హైమారావుకు సమాచారం అందింది. ఆయన నిఘా ఉంచారు. పట్టణంలోని బంగ్లా రోడ్‌ను అడ్డాగా చేసుకుని క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు ఆయన నిర్ధారించుకున్నారు. తొలుత ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నగదు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 15 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. వారినీ త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అరెస్టయిన వారిలో నన్నాబత్తిన విశ్వరూపాచారి, కాటూరి రాంబాబు, డి.వెంకటేశ్వర్లు, బి.శివశంకర్, కె.నాగరాజుతో పాటు మరో పది మంది ఉన్నారు. నిందితుల నుంచి రూ.2,36,100 నగదు, 2.5 కిలోల గంజాయి, బెట్టింగ్‌ల కోసం ఉపయోగించే (లైవ్ క్రికెట్ చూడటం కోసం) 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆట ఇలా.. ప్రధాన నిందితులు తమ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న క్రికెట్ యాప్ ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడతారు. అందులో ప్యావరేట్, ఈటింగ్ అనే గుర్తులతో బెట్టింగులు కాచే వారి స్థాయిని నిర్ణయిస్తారు. ప్యావరేట్ అంటే రూ.10 వేలు కాస్తే, గెలిస్తే రూ.8 వేలు వస్తాయని చెబుతారు. ఈటింగ్‌లో 8,300 కాస్తే గెలిస్తే రూ.10 వేలు వస్తాయంటారు. తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదించాలనే ఉద్దేశంతో ఇటువంటి బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. విలేకరుల సమావేశంలో సీఐ హైమారావు, అద్దంకి, మేదరమెట్ల, కొరిశపాడు ఎస్ఐలు సుబ్బరాజు, పాండురంగారావు, వెంకటేశ్వర్లు, సిబ్బంది ఉన్నారు. -
గుంటూరులో క్రికెట్ బుకీలు అరెస్టు
సాక్షి,గుంటూరు: గుంటూరు జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగులకు పాల్పడుతున్నారనే సమాచారంతో నల్లచెరువు ప్రాంతంలో దాడులు నిర్వహించిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల నగదు, ల్యాప్‌టాప్, టీవీ, 6 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం నిందితులను విచారిస్తున్నారు. -
బెట్టింగ్‌కు పాల్పడుతోన్న 10 మంది అరెస్ట్
వైఎస్సార్ జిల్లా : కడప నగరంలో పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతోన్న 10 మంది బుకీలను కడప టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5.30 లక్షల నగదు, 10 మొబైల్స్, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ మసూమ్ బాషా తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించినట్లు వెల్లడించారు. -
అవినీతి ఖాకీల్లో కలవరం !
సాక్షి, గుంటూరు : జిల్లాలో క్రికెట్ బుకీలు, బెట్టింగ్ నిర్వాహకులపై రూరల్ జిల్లా ఎస్పీ సీహెచ్.వెంకటప్పలనాయుడు కన్నెర్ర చేశారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిపై తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి వదిలేయకుండా, కీలక బుకీల్ని కూడా అరెస్టు చేసి డొంకను కదులుస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్‌పై సీరియస్‌గా దృష్టి సారించిన పి.హెచ్.డి. రామకృష్ణను బెట్టింగ్ మాఫియా అధికార పార్టీ నేతల అండతో బదిలీ చేయించిన విషయం తెలిసిందే. క్రికెట్ బుకీల ఒత్తిడితో ఎస్పీ స్థాయి అధికారినే బదిలీ చేయించడంతో జిల్లాలోని పోలీస్ అధికారుల్లో గుబులు మొదలయింది. రెండేళ్లుగా రెచ్చిపోతున్న మాఫియా క్రికెట్ బెట్టింగ్ మాఫియా రెండేళ్లుగా మరింత రెచ్చిపోయింది. అమాయకులను వ్యసనపరులుగా మార్చేసింది. బెట్టింగ్‌ల్లో డబ్బులు పోగొట్టుకున్న వారి ఆస్తులు సైతం దౌర్జన్యంగా రాయించుకుని వారి కుటుంబాలను రోడ్ల పాలు చేసింది. అనేక మంది బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలూ అనేకం ఉన్నాయి. జిల్లాలో కొందరు అవినీతి పోలీస్ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్లూ ఇస్తూ ఆయా ప్రాంతాల్లో తమ స్థావరాల్ని ఏర్పాటు చేసుకుని నిర్భయంగా క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. నర్సరావుపేట, సత్తెనపల్లి, గురజాల సబ్ డివిజన్ల పరిధిలో ఇప్పటి వరకూ పనిచేసిన కొందరు పోలీస్ అధికారులైతే స్థాయి మరిచి క్రికెట్ బుకీలతో కలిసి బెట్టింగ్ కేంద్రాలకు వెళ్లడం, వారితో కలసి టూర్లు, జల్సాలు సైతం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్పీ సీరియస్ గుంటూరు రూరల్ ఎస్పీ వెంకటప్పలనాయుడు క్రికెట్ బుకీలపై సీరియస్‌గా దృష్టి సారించారు. స్థానిక పోలీస్ అధికారులకు తెలియకుండా తాను ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ద్వారా మొదట ఓ కీలక బుకీని అదుపులోకి తీసుకున్నారు. అతని ద్వారా సేకరించిన సమాచారంతో బెట్టింగ్ మాఫియా డొంకను కదులుస్తున్న విషయం తెలిసిందే. గురువారం కీలక బుకీ సుబ్బారావుతోపాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చూపిన పోలీసులు వారిపై గేమింగ్ యాక్ట్‌తోపాటు గంజాయి సరఫరా చేస్తున్నట్లు కేసు నమోదు చేయడంతో క్రికెట్ బుకీల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెట్టింగ్ నిర్వాహకులు, పంటర్లను సైతం అదుపులోకి తీసుకోవాలంటూ నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలోని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో అవినీతి పోలీస్ అధికారుల్లో కలవరం మొదలయింది. అంతేకాకుండా బుకీల సెల్‌ఫోన్ నెట్వర్క్ ఆధారంగా జిల్లాలో బుకీలు, నిర్వాహకులతో సంబంధాలు ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బంది జాబితాను సైతం ఎస్పీ తయారు చేశారనే విషయం బయటకు పొక్కడంతో అవినీతి పోలీసు అధికారులకు కంటిపై కునుకు లేకుండా పోతోంది. నర్సరావుపేట టూటౌన్ ఎస్ఐకి బెట్టింగ్ వ్యవహారంలో సంబంధాలు ఉండటం వల్లే ఎస్పీ వీఆర్‌కు పిలిపించారని తెలియగానే... ఈ వ్యవహారంలో ఇంకెదరిపై వేటు పడుతుందోననే చర్చ పోలీస్‌శాఖలో జోరుగా సాగుతోంది. రాత్రికి రాత్రే పరార్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి వారిపై కఠినమైన సెక్షన్లు కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. నరసరావుపేటకు చెందిన కీలక బుకీ సుబ్బారావును గుంటూరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలుసుకున్న జిల్లాలోని పలువురు బుకీలు, నిర్వాహకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. సెల్ఫోన్లు పక్కన పడేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఐదు రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్ళడంతో వీరిని ఎలా పట్టాలో తెలియక ఆయా ప్రాంతాల పోలీస్ అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఓ వైపు ఎస్పీ ఒత్తిడి మరోవైపు బుకీలు, నిర్వాహకుల సమాచారం తెలియక ఆందోళనలో పడ్డారు. అయితే, వారితో సంబంధాలు ఉన్న పోలీస్ అధికారులు మాత్రం విషయం పాతబడి సీరియస్ తగ్గే వరకూ పక్కకు వెళ్లి పొమ్మని బుకీలకు సలహా ఇచ్చి పంపారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. బెట్టింగ్‌పై ఎస్పీ ఇదే తరహాలో పట్టు బిగిస్తే మాఫియా పని పట్టవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏ మాత్రం పట్టు సడలించినా బుకీలు మరింత రెచ్చిపోతారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -
క్రికెట్ బుకీల అరెస్ట్
- అదుపులో ఐదుగురు బెట్టింగ్ రాయుళ్లు - రూ. 1.13 లక్షలు, ఏడు సెల్ఫోన్లు, చీటీలు స్వాధీనం ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలతో పాటు, బెట్టింగ్ పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.13 లక్షలు, ఏడు సెల్ఫోన్లు, చీటీలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బార్పేటకు చెందిన రియాజ్‌బాషా, కునిముల్లాకు చెందిన గరీఫ్ బాషా ఇంటి వద్దనే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడటంతో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అలాగే పట్టణంలో బెట్టింగ్ ఆడుతున్న వాల్మీకి నగర్‌కు చెందిన సోను, గోకర్‌జెండా నవశాద్, కౌడల్‌పేట నసీర్‌బాషా, జావిద్, హవన్నపేట మహ్మద్‌బాషాను త్రీటౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ విజయ్‌కుమార్, ఎస్ఐలు సునిల్ కుమార్, సిబ్బందితో కలిసి వారిపై దాడి చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇంకా కొంతమంది బుకీల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం వారంతా కర్ణాటకకు చెందిన రాయచూరు, బెంగళూరు, శిరుగుప్ప, బళ్లారిలో మకాం పెట్టి ఆదోని పట్టణంంలో సెల్‌ఫోన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ఇద్దరు బుకీలను పోలీసులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. పట్టణంలోని అమరావతి నగర్‌కు చెందిన మంగలి రాజు, కల్లుబావి బీసీ నగర్‌కు చెందిన శ్రీరాములు సోమవారం ఉదయం 9 గంటలకు ఓవర్ బ్రిడ్జి కింద రవిబార్ సమీపంలో ఐపీఎల్ 20–20 క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ రామానాయుడు, ఎస్ఐ బాబు సిబ్బందితో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.25 వేలు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 9 బెట్టింగ్ కేసుల్లో రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఇద్దరు బుకీల అరెస్టు
యాడికి (తాడిపత్రి రూరల్) : యాడికిలో క్రికెట్ బెట్టింగ్ కేంద్రంపై ఆదివారం దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ఆడుతున్న మణికిశోర్, అబ్దుల్‌రహీం అనే బుకీలను అరెస్టు చేసినట్లు వివరించారు. వారి నుంచి రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హత్యాయత్నం కేసులో మరొకరి అరెస్టు తాడిపత్రి రూరల్ : తాడిపత్రి శ్రీనివాసపురానికి చెందిన నాగభూషణం అనే నిందితుడ్ని హత్యాయత్నం కేసులో ఆదివారం అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. తాడిపత్రిలోని పప్పూరు రోడ్డులో గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో నందలపాడుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి గాయపడిన సంగతి తెలిసిందే. అయితే పాత కక్షల నేపథ్యంలో తనను హత్య చేయాలన్న కుట్రతో తన ప్రత్యర్థులు టాటా సుమోతో ఢీకొట్టారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే రెండ్రోజుల కిందట ముగ్గుర్ని అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా నాగభూషణం అనే నిందితుడ్ని అరెస్టు చేశారు. అతన్ని కోర్టులో హాజరుపరచినట్లు వివరించారు. -
క్రికెట్ బుకీలపై పోలీసుల దాడులు
-
నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రాయనంలో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల నగదుతోపాటు 37 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. -
శంషాబాద్ లో క్రికెట్ బుకీల అరెస్ట్
శంషాబాద్: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను ఆర్జీఐఏ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మండల కేంద్రంలోని అహ్మద్‌నగర్ ప్రాంతంలో బెట్టింగ్ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో సదరు ఇంటిపై దాడి చేసిన పోలీసులు సాబెర్, పాతూర్, బ్రహ్మం, చారీ అనే నలుగురి అదుపులోకి తీసుకుని వీరి నుంచి రూ.40వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
బాబోయ్ బెట్టింగ్..
► మొదలైన టీ20 ప్రపంచకప్ ► చక్రం తిప్పుతున్న బుకీలు ► యువతను లక్ష్యంగా చేసుకున్న వైనం ► బుకీల దూకుడుకు పోలీసులు కళ్లెం వేసేనా..? టీ20 ప్రపంచకప్ పోటీలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటుగా జీవితాలు నాశనం చేసే బెట్టింగ్ కూడా పురివిప్పింది. బెట్టింగ్ కారణంగా ఇల్లు గుల్లయినా, అప్పులుపాలైపోయినా కొందరు అదేం పట్టించుకోకుండా పోయిన చోటే వెతుక్కోవాలనే సామెతను అనుసరిస్తూ మళ్లీ ఆ ఊబిలోకి దిగేస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన పోటీలు ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్నాయి. మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన బెట్టింగ్ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని పల్లెలకు పాకేసింది. బుకీలు ఈనెల మొదటి నుంచే బెట్టింగ్‌లు కాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచకప్ పోటీలు ముగిసేనాటికి ఎందరి బతుకులు తలకిందులవుతాయో? ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతాయో అన్న ప్రశ్న అందరిలో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు(క్రైమ్) : కొంతకాలంగా టీ20 క్రికెట్ మ్యాచ్‌లకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. గతంలో ఇరుదేశాల మధ్య వన్డే మ్యాచ్ అంటే సుమారు 10 గం టల పాటు టీవీల వద్ద కూర్చొని ఫలితాల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. టీ20 మ్యాచ్‌లతో కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే జట్ల భవితవ్యం తేలిపోతోంది. దీంతో బెట్టింగ్ కాసేందుకు ఊత్సాహం చూపుతున్నారు. సంపన్నుల నుంచి.. రోజువారి కూలీవరకు.. గతంలో కేవలం వన్డే మ్యాచ్‌లు, ప్రపంచకప్ పోటీలపై మాత్రమే పందేలు కాసేవారు. టీ20 మ్యా చ్‌లు రావడంతో పరిస్థితి మారింది. స్మార్ట్ఫోన్ల కారణంగా ఎక్కడున్నా స్కోర్ల వివరాలు సులువుగా తెలుస్తుండటంతో పందెంరాయుళ్లు వ్యవహారాన్నంతా ఫోన్ల ద్వారానే జరిపిస్తున్నారు. సంపన్నవర్గాల కు చెందిన వారే కాకుండా మధ్యతరగతి, దినసరి కూ లీలు, ఆటోవాలాలు, హోటల్సర్వర్లుతో పాటు అనేకవర్గాల వారు పందేలకు అలవాటుపడి విలువైన జీవితాలను చిధ్రం చేసుకొంటున్నారు. రూ.లక్షల్లో పందేలు కడుతున్నారు. పందేల్లో సరస్వస్వం కోల్పోయినప్పటికి అప్పులు తెచ్చి మరీ ఫణంగా పెడుతూ నడిరోడ్లపై పడుతున్నారు. మరికొందరు అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నాలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు ఊర్లు విడిచి పారిపోతున్నారు. యువతే లక్ష్యంగా..... యువత, విద్యార్థులే లక్ష్యంగా క్రికెట్‌బుకీలు పావులు కదుపుతున్నారు.వారికి లేని పోని ఆశలు చూపి బెట్టింగ్‌వైపు ఆకర్షితులను చేస్తున్నారు. బెట్టింగ్‌లో నగదు కోల్పోయిన యువతే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అంచనా.గతంలో జరిగిన పలు సం ఘటనలు ఊదాహరణగా నిలుస్తోన్నాయి.ఇది ఇలా ఉంటే ప్రపంచకప్ పోటీలు పదోతరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ఓవైపు పరీక్షలు, మరోవైపు ప్రాణప్రదమైన క్రికెట్ పోటీలు జరగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు నగరానికి చెందిన కొందరు బుకీలుగా అవతారమెత్తారు. ఇతరప్రాంతాల్లో పాగావేసి జిల్లా వ్యాప్తంగా సబ్‌బుకీలను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గతంలో పోలీ సు అధికారులు విసృ్తతంగా దాడలు చేయడంతో కొంతమేర పందేలకు బ్రేక్‌పడింది. అయితే ఇటీవల తిరిగి ఊపందుకున్నాయి. ఒక్కో మ్యాచ్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల మేర బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జోరుమీద ఉన్న బుకీల దూకుడు కు పోలీసులు ఏమాత్రం కళ్లెం వేస్తా రో వేచి చూడాల్సిందే. బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై చర్యలు తీసుకొంటాం. ఇప్పటికే మా వద్ద బుకీల సమాచారం ఉంది. వారిపై నిఘా ఉం చాం. ప్రజలు తమ ప్రాంతాల్లో బెట్టింగ్ నిర్వహిస్తే సమాచారం అందించాలి. వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. జి.వెంకటరాముడు, డీఎస్పీ -
క్రికెట్ బుకీలు, మట్కా నిర్వాహకుల అరెస్ట్
హిందూపురం : అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్, మట్కా నిర్వహిస్తున్న 15 మందిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు హిందూపురం, పరిసర ప్రాంతాలలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ ఆడుతున్న ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,23,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే లేపాక్షి ప్రాంతంలో మట్కా నిర్వహిస్తున్న 8 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.80వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సుబ్బారావు తెలిపారు. -
ఏడుగురు క్రికెట్ బుకీల అరెస్ట్
కడప : ఏడుగురు క్రికెట్ బుకీలను కడప అర్బన్ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కడప టూటౌన్ ప్రాంతంలోని అబీబుల్లా కాంప్లెక్స్‌లో బుకింగ్ వ్యవహారాలు నడుస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అర్బన్ పోలీసులు సదరు కాంప్లెక్స్‌పై దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.54 లక్షల నగదు, ఏడు సెల్ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రధాన బుకీ నాగేంద్ర పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్టు.. రూ.5.95 లక్షలు స్వాధీనం
కారంపూడి(గుంటూరు): క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను అరెస్టు చేసి, వారి నుంచి రూ. 5,95,020 నగదు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు గురజాల డీఎస్పీ కె నాగేశ్వరరావు గురువారం తెలిపారు. గుంటూరు జిల్లా కారంపూడిలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక వినుకొండ రోడ్డులోని ఓ ఇంట్లో బుధవారం దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భాగంగా బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు వారిపై దాడి చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న కారంపూడికి చెందిన ముత్యాలంపాటి పుల్లారావు, మాచర్ల నెహ్రూ నగర్ రెండో లైన్‌కు చెందిన కొప్పల గోపీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 5,95,020 నగదు, ఐదు సెల్ ఫోన్లు, ఐదు సిమ్ కార్డులు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ గుంటూరు జిల్లా దుర్గి గ్రామానికి చెందిన జక్కా మస్తాన్‌రావు అనే బుకీ కింద సబ్ బుకీలుగా కమీషన్‌కు పనిచేస్తున్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. మస్తాన్‌రావును అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. -
నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్
కడప: ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచుల సందర్భంగా బుకింగ్ వ్యవహారాలు నడుపుతున్న నలుగురిని వైఎస్సార్ జిల్లా కడప పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. స్థానికంగా రవీంద్రనగర్‌లో ఓ ఇంటిలో బుకింగ్ వ్యవహారాలు నడుస్తున్నట్టు అందిన సమాచారంతో డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా బుకీలు అనిల్‌కుమార్ రెడ్డి, అల్తాఫ్, అహ్మద్, ఆదిశేషులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3 లక్షలకుపైగా నగదు, 4 సెల్ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు. మరో ప్రధాన బుకీ మాధవరెడ్డి పరారైనట్టు పోలీసులు తెలిపారు. -
ఇద్దరు క్రికెట్ బుకీల అరెస్ట్
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ నిర్వహించిన రవికుమార్, నరేష్లతో సహా మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్ష రూపాయల నగదు, 11 మొబైల్స్, ఒక ల్యాప్‌టాప్, ఒక స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్‌లో క్రికెట్ బూకి అరెస్ట్ వరల్డ్‌కప్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న బూకిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సికింద్రాబాద్ పరిధిలోని వారాసిగూడకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని బుధవారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి ఒక క్యాష్ మెషీన్, ఒక సెట్‌టాప్ బాక్స్, 8 సెల్ఫోన్లు, 13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
బెట్టింగ్..సెట్టింగ్
నగరవాసుల క్రికెట్ క్రేజీని క్యాష్ చేసుకునేందుకు బుకీలు సన్నద్ధమయ్యారు. ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో చాకచక్యంగా ముందుకుసాగుతున్నారు. పోలీసులకు చిక్కకుండా హైటెక్నాలజీ, సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అధికారులు ఎన్ని పకడ్బందీ చర్యలు చేపట్టినా బెట్టింగ్‌కు అన్ని సెట్ చేసుకున్నట్లు సమాచారం. హైదరాబాద : క్రికెట్ బెట్టింగ్ నిరోధానికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా, బుకీలు మాత్రం కొంత పంథాలో ముందుకు సాగుతూనే ఉన్నారు. ప్రపంచ కప్ క్రికెట్లో బెట్టింగ్ కోసం బుకీలు సోషల్ మీడియానూ ఆశ్రయిస్తున్నారు. మరోవైపు నగరంలో బెట్టింగ్ రాయుళ్ల భరతం పట్టేందుకు నగర పోలీసు కమిషనరేట్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు సిద్ధమవుతున్నారు. ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ సుమారు రెండు నెలల పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరుగనుం ది. ఆదివారం జరిగే పాక్, ఇండియా మ్యాచ్‌లో భారీగా బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. గతంలో నగరంలో పట్టుబడిన క్రికెట్ బుకీల వివరాలను జంట పోలీసు కమిషనర్లు ఎం.మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్‌లు తెప్పిం చుకున్నారు. వారిపై నిఘా పెట్టారు. హుక్కా సెంటర్లలో.. పేరు మోసిన బుకీలతో పాటు ఈ సారి హుక్కా సెంటర్ల నిర్వాహకులు కూడా బుకీల అవతారం ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని హుక్కా సెంటర్లలో పెద్ద పెద్ద ఎల్సీడీ టీవీలు ఏర్పాటు చేశారు. వారంలో 1000కిపైగా ఎల్సీడీ టీవీలు నగరంలో అమ్ముడయ్యాయి. వీటిని క్రికెట్ మ్యాచ్‌ల కోసమే ఖరీదు చేశారు. ముందుగానే గదుల బుకింగ్.. నగరం, శివార్లలోని కొన్ని లాడ్జీల్లో బుకీలు ముందుగానే కొన్ని గదులను బుక్ చేసుకున్నట్లు సమాచారం. మ్యాచ్ జరిగే రోజున లాడ్జీలో ల్యాప్‌టాప్‌లు, టీవీలు ద్వారా వీరు దందా నిర్వహిస్తారు. ఆన్లైన్ బ్యాకింగ్ ద్వారా బెట్టింగ్ వ్యవహారం నిర్వహిస్తారు. అలాగే కొందరు శివారులోని ఫాం హౌస్‌లు, రిసార్ట్స్‌లను కేంద్రంగా చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. ముంబై మాఫియా.. నగరంలోని బెట్టింగ్ కేంద్రాలకు ముంబై మాఫియా హస్తం ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్న సందర్భాల్లో ఈ విషయం వెల్లడైంది. నగరంలో నడిచే క్రికెట్ బెట్టింగ్‌లో ముంబై నుంచి బెట్టింగ్‌లు నడుస్తాయి. గతంలో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు.. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు గతేడాది ఫిబ్రవరి 1న రట్టు చేశారు. బుకీలు మహ్మద్ అబ్దుల్ ఖదీర్(5 2), షేక్ మహమూద్ గౌస్ (49), షేక్ సమీర్ బాషా (27), షేక్ ఇమ్రాన్ (34), మహ్మద్ ఖాన్ (30), జి.కిరణ్ కుమార్ (35), షేక్ చాంద్ పాషా (29), అబ్దుల్ ఇ మ్రాన్ (45)తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సిబ్బందిని అప్రమత్తం చేశాం.. క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లు, బుకీలపై నిఘా పెట్టాం. ఈ మేరకు అన్ని జోన్ల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. లాడ్జీలు, హుక్కా సెంటర్లపై వరుస తనిఖీలు చేపడుతున్నాం. నగరంలో బెట్టింగ్ జరగకుండా చూస్తాం. ఇందుకోసం సర్వం సిద్ధం చేశాం. బెట్టింగ్‌పై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలి. - లింబారెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ -
భారీ స్థాయిలో బెట్టింగ్ పాల్పడుతున్నబుకీల అరెస్ట్
ప్రకాశం: క్రికెట్ బుకీలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. భారీస్థాయిలో బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను అరెస్ట్ చేసిన ఘటన ప్రకాశంలో చోటు చేసుకుంది. తూము వెంకట్రావు, డాకా రమణారెడ్డిలు క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. బెట్టింగ్ లు తారస్థాయిలో జరుగుతున్నట్లు ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు వారిపై నిఘా ఉంచారు. చాకచక్యంగా ఆ ఇద్దరు బుకీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ బుకీల వద్ద రూ.4 లక్షలతోపాటు, 10 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. -
ఆడిందే ఆట.. పాడిందే పందెం
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్: ప్రొద్దుటూరు పట్టణంలో క్రికెట్‌బుకీలు రెచ్చిపోతున్నారు. ఆడిందే ఆట(క్రికెట్) గా..పాడిందే పాట(పందెం)గా చెలరేగుతున్నారు. ఇంతకముందు క్రికెట్ మ్యాచ్ ప్రారంభం అయ్యిందంటే చాలు ప్రధాన బుకీలు రెండు మూడు రోజులు ముందే హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు లాంటి ప్రాంతాలకు తరలి వెళ్లేవారు. అక్కడ బెట్టింగ్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకునేవారు. స్థానికంగా వారి అనుయాయులు, సబ్‌బుకీలు, కొరియర్ బాయ్‌లు బెట్టింగ్ డబ్బు సమకూర్చి పంపిస్తుంటారు. ఇదీ నిన్న మొన్నటి వరకు జరిగే తంతు. కానీ ఇటీవల ప్రొద్దుటూరు బుకీలు స్టైల్ మార్చారు. బుకీలు స్థానికంగానే లక్షల్లో బెట్టింగ్ నిర్వహిస్తూ రెచ్చిపోతున్నారు. ఇక్కడే ఉంటూ ప్రధాన బుకీలందరూ తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. బుకీలను పోలీసులు గాలికి వదిలేశారా.. రెండు మూడు నెలల నుంచి ఎన్నికల విధుల్లో మునిగి ఉన్న పోలీసులు ఇతర వ్యవహారాలైపై దృష్టి పెట్టడం లేదు. ఏప్రిల్ నెల నుంచి ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఎన్నికల విధుల్లో నుంచి బయట పడిన పోలీసులు క్రికెట్ బెట్టింగ్నూ పూర్తిగా విస్మరించారు. గతంలో అయితే క్రికెట్ మ్యాచ్‌లు జరిగేటప్పుడు ప్రత్యేకంగా దాడులు నిర్వహించేవారు. ప్రస్తుతం పోలీసులు పట్టించుకోక పోవడంతో ప్రధాన బుకీలందరూ పట్టణంలోనే ఉంటూ స్వేచ్ఛగా క్రికెట్ పందేలు కాస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు సందర్భంగా ప్రతి రోజూ ఒక్క ప్రొద్దుటూరులోనే రూ.80 లక్షల నుంచి రూ.కోటి దాకా బెట్టింగ్ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పట్టణంలోని వైఎంఆర్ కాలనీ, జిన్నారోడ్డు, మెయిన్‌బజార్, గాంధీరోడ్డు, మోడంపల్లి తదితర ప్రాంతాలలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుతున్నట్లు తెలుస్తోంది. ఎస్పీ ఆదేశాలు హుళుక్కేనా.. ఎస్పీ అశోక్‌కుమార్ మొదటిసారిగా ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు బెట్టింగ్ నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీసు అధికారులకు సూచించారు. మ్యాచ్‌లు జరిగే సమయాల్లో బుకీలందరినీ ఆయా పోలీస్టేషన్లలో హాజరయ్యేలా చూడాలన్నారు. ఇటీవల ఎస్కేవీ ఫంక్షన్ హాల్లో జరిగిన పోలీసు గెట్ టు గెదర్ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఎస్పీ దీన్ని కచ్చితంగా పాటిస్తే కొంత ఫలితం ఉంటుందని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభంలో మాత్రం రెండు మూడు మ్యాచ్‌లకు బుకీలను స్టేషన్లకు పిలిపించారు. పట్టణంలో వందల సంఖ్యలో బుకీలు ఉండగా 10-15 మందిని మాత్రమే బుకీలను స్టేషన్లకు పిలిపించారు. తర్వాత వారిని గాలికి వదిలేశారు. దీంతో బుకీలు దర్జాగా బెట్టింగ్ కార్యకలాపాలకు పా ల్పడుతున్నారు. ఆదివారం నాడు పంజాబ్, కలకత్తా టీంల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో బుకీలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రధాన బుకీల ఇళ్లల్లోనే బెట్టింగ్ నిర్వహణ జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆదివారం నాడు ప్రొద్దుటూరులోనే రూ.2 కోట్లకు పైగా బెట్టింగ్ జరుగవచ్చని బుకీలు అంచనా వేస్తున్నారు.