ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్
Published Mon, May 1 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ఇద్దరు బుకీలను పోలీసులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. పట్టణంలోని అమరావతి నగర్‌కు చెందిన మంగలి రాజు, కల్లుబావి బీసీ నగర్‌కు చెందిన శ్రీరాములు సోమవారం ఉదయం 9 గంటలకు ఓవర్ బ్రిడ్జి కింద రవిబార్ సమీపంలో ఐపీఎల్ 20–20 క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ రామానాయుడు, ఎస్‌ఐ బాబు సిబ్బందితో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.25 వేలు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 9 బెట్టింగ్ కేసుల్లో రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు.
Advertisement
Advertisement