క్రికెట్ బుకీల అరెస్ట్
- అదుపులో ఐదుగురు బెట్టింగ్ రాయుళ్లు
- రూ. 1.13 లక్షలు, ఏడు సెల్‌ఫోన్లు, చీటీలు స్వాధీనం
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలతో పాటు, బెట్టింగ్ పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.13 లక్షలు, ఏడు సెల్‌ఫోన్లు, చీటీలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బార్‌పేటకు చెందిన రియాజ్‌బాషా, కునిముల్లాకు చెందిన గరీఫ్ బాషా ఇంటి వద్దనే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడటంతో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అలాగే పట్టణంలో బెట్టింగ్ ఆడుతున్న వాల్మీకి నగర్‌కు చెందిన సోను, గోకర్‌జెండా నవశాద్, కౌడల్‌పేట నసీర్‌బాషా, జావిద్, హవన్నపేట మహ్మద్‌బాషాను త్రీటౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ విజయ్‌కుమార్, ఎస్‌ఐలు సునిల్ కుమార్, సిబ్బందితో కలిసి వారిపై దాడి చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇంకా కొంతమంది బుకీల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం వారంతా కర్ణాటకకు చెందిన రాయచూరు, బెంగళూరు, శిరుగుప్ప, బళ్లారిలో మకాం పెట్టి ఆదోని పట్టణంంలో సెల్‌ఫోన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.