ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం రాయనంలో నలుగురు క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 వేల నగదుతోపాటు 37 సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.