క్రికెట్ బుకీల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న నగదుతో ఏఎస్పీలు
బరంపురం: నగరంలో కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ బుకీలను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీలు త్రినాథ పటేల్, సంతున్ కుమార్ దాస్ చెప్పారు. స్థానిక పెద్ద బజార్ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీలు మాట్లాడుతూ..నగరంలో కొద్ది రోజుల నుంచి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తమకు రహస్య సమాచారం అందిందని చెప్పారు.
ఈ నేపథ్యంలో పెద్ద బజార్ ఐఐసీ అధికారి సురేష్ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్థానిక ఫస్ట్‌గేట్‌లోని క్రికెట్ బుకీలను పట్టుకున్నట్లు తెలిపారు. బుకీల ఫోన్ కాల్స్ ట్యాప్ చేసి జీపీఎస్ సహకారంతో వారు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి గురువారం అర్ధరాత్రి ప్రత్యేక దాడులు చేసి 5గురు బుకీలను అరెస్ట్ చేశామని తెలిపారు.
అరెస్ట్ అయిన వారి నుంచి రూ. 7.61లక్షల నగదు, సెల్‌ఫోన్స్, మూడు నోట్‌బుక్స్, ఒక కాల్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరెస్ట్ అయిన వారు శాస్త్రినగర్‌కు చెందిన బీటెక్ విద్యార్థి దీపక్ సమంతరాయి అలియాస్ డిప్పు, కొనిసి హట్టో గ్రామానికి చెందిన జితేంద్ర నాయక్ అలియాస్ జిత్తు, దాస్‌పూర్‌కి చెందిన ప్రశాంత్ బెహరాగా పోలీసులు గుర్తించారు.
అందా డిప్పు, యు.జె.రమేష్‌తో పాటు మరికొంత మంది పరారయ్యారని తెలిపారు. పరారైన వారిని త్వరలో పట్టుకుంటామని ఏఎస్సీలు చెప్పారు. గత రెండేళ్లలో క్రికెట్ బెట్టింగ్‌లో పాల్పడిన 32మంది అరెస్ట్ చేసి రూ.26 లక్షలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ∙
Comments
Please login to add a commentAdd a comment