కడప : ఏడుగురు క్రికెట్ బుకీలను కడప అర్బన్ పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కడప టూటౌన్ ప్రాంతంలోని అబీబుల్లా కాంప్లెక్స్‌లో బుకింగ్ వ్యవహారాలు నడుస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అర్బన్ పోలీసులు సదరు కాంప్లెక్స్‌పై దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.54 లక్షల నగదు, ఏడు సెల్‌ఫోన్లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. కాగా ప్రధాన బుకీ నాగేంద్ర పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.