Viral Video : Cat Watches Gymnasts Perform At Tokyo Olympics On Television - Sakshi
Sakshi News home page

Tokyo Olympics: టీవీలో అథ్లెటిక్స్‌ను చూసి రంగంలోకి పిల్లి, ఫన్నీ వీడియో

Published Fri, Jul 30 2021 6:59 PM | Last Updated on Fri, Jul 30 2021 8:08 PM

Cat Watches Gymnasts Perform at Tokyo Olympics n TV, Viral Video - Sakshi

ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ జాతర కొనసాగుతోంది‌. ఎవరు నెగ్గుతున్నారు, ఏ దేశానికి ప‌త‌కాలు ఎక్కువస్తున్నాయనేదే హాట్‌ టాపిక్‌గా మారింది‌. క్రీడ‌లు మ‌హారంజుగానే సాగుతున్నా.. స్టేడియాల్లో ప్రేక్షకులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితేనేం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ టీవీల ముందుకు చేరి తమకు నచ్చిన ఆటగాళ్ల ప్రదర్శనలను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నారు. అయితే ఈ ఒలింపిక్స్‌ ఆటలు జనాలతో పాటు జంతువులను కూడా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి నిదర్శనమే ఈ వీడియో. ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఇందులో టీవీ ముందు కూర్చున్న ఓ పిల్లి జిమ్నాస్ట్‌ ప్రదర్శనను ఆసక్తిగా తిలకిస్తోంది. టీవీలోని జిమాస్ట్‌ కదలికలకు అనుగుణంగా పిల్లి తన తలను కూడా మార్చుతుంది. అంతేగాక పిల్లి తన చేతులతో జిమ్నాస్ట్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. రెండు చేతులను టీవీ మీదకు పెట్టి జిమ్నాస్ట్‌తోపాటు అటు ఇటు తిరుగుతుంది. 54 సెకన్ల నిడివిగల ఈ వీడియోను హ్యూమర్‌ అండ్‌ ఎనిమల్స్‌ అనే ట్విటర్‌ పేజ్‌ బుధవారం షేర్‌ చేసింది. ‘జిమ్నాస్టిక్‌ను చూస్తున్న పిల్లి. ఇప్పుడు ఇదే నా ఫేవరెట్‌’ అంటూ షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పటికే మిలియన్‌ వ్యూవ్స్‌ను సంపాదించింది. దీనిపై స్పందించిన నెటిజన్లు ‘పిల్లి జిమ్నాస్ట్‌ తన బ్యాలెన్స్‌ కోల్పోకుండా తనకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది.’ అంటూ ఫన్నీ కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement