
ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చీటికిమాటికి దేనికో దానికి కొట్టుకుంటారు. అలానే కొంతమంది రకరకాల పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. అవి కూడా అంతే కొట్టుకుంటూ పెద్ద హడావిడే చేస్తుంటాయి. అచ్చం అలానే ఇక్కడొక యజమాని పెంపుడు జంతువులు కూడా అలానే కొట్టుకుంటాయి. ఐతే ఇక్కడ కుక్క, పిల్లిని తరుముతుండటేమే కాకుండా వెంటాడుతుంది. కానీ ఆ పిల్లి ఎంత తెలివిగా ఆ కుక్క నుంచి తప్పించుకుందో చూడండి.
వివరాల్లోకెళ్తే....కుక్కులు సహజంగానే తమ కన్న చిన్న జంతువులను తరుముతూ వెంటపడుతుంటాయి. పైగా ఆ రెండు జాతులకు సాధారణంగా పడదు. ఏమైందో ఏమో ఉన్నట్టుండి కుక్క పిల్లిని తరుముతుంది. దాడి చేసేందకు వెంటపడి మరీ తరుముతుంటుంది. దీంతో ఆ పిల్లి చక్కటి ట్రిక్ ఉపయోగించి కుక్క అవాక్కయ్యేలా తప్పించకుంటుంది.
ఇంతకీ పిల్లి ఏం చేసిందంటే...పరుగెడుతున్నప్పుడూ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న తెడ్డుపైకి ఎక్కి అవతలి ఒడ్డుకు చేరుకుని తప్పించుకుంటుది. కానీ కుక్క పాపం ఆ పిల్లి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతుందనుకుంది. పిల్లి అలా తెలివిగా తప్పించుకునేటప్పటికీ కుక్కకి ఏం చేయాలో తోచక చూస్తుండిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్ వేయండి.
In a brilliant move, cat outsmarts puppy..🐈🐾🐕💨🏄😅 pic.twitter.com/k517VkJCPe
— 𝕐o̴g̴ (@Yoda4ever) June 4, 2022
Comments
Please login to add a commentAdd a comment