సో క్యూట్‌.. చిన్నారి కోసం ఈ పిల్లి ఏం చేసిందో చూడండి.. | Viral Video: See What This Cat Doing For Saving A Little Boy | Sakshi
Sakshi News home page

Viral Video: చిన్నారి కోసం ఈ పిల్లి ఏం చేసిందో చూడండి

Published Sat, Aug 6 2022 3:40 PM | Last Updated on Sat, Aug 6 2022 3:51 PM

Viral Video: See What This Cat Doing For Saving A Little Boy  - Sakshi

చాలామందికి ఇంట్లో జంతువులు పెంచుకోవడానికి పిచ్చిగా ఇష్టపడుతుంటారు. ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతి బాగా పెరిగిపోయింది. కొందరు అయితే వాటిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. జంతు ప్రేమికులు ఎక్కువగా కుక్క, పిల్లి, చిలుకను పెంచుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇంట్లో మనుషులను చూసినట్లుగానే వాటి ఆలనా పాలనా చూస్తుంటారు. కొన్ని సార్లు మనం పెంచుకునే పెట్స్‌ మనకు ఎంతో సాయం చేస్తుంటాయి. చాలా విషయాల్లో మనల్ని ప్రమాదం నుంచి కాపాడతాయి.

తాజాగా సోషల్‌ మీడియాలో ఓ పిల్లికి చెందిన వీడియో వైరల్‌గా మారింది. ఇంట్లో పెంచుకునే పిల్లి ఓ పిల్లాడికి బాడీగార్డ్‌గా మారింది. ఏడాది వయసున్న బాలుడు బాల్కనీ వద్దకు వచ్చి నిల్చొని బయటకు చూస్తుంటాడు. బాల్కనీలోని ఐరన్‌ గ్రిల్‌పై చేయి పెట్టి పెక్కి ఎక్కేందుకు మెల్లగా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న పిల్లి అతన్ని చేయిని కిందకు తీసేస్తుంది. అయినా చిన్నారి చేతులు పెడుతుంటే పిల్లి మళ్లీ తీసేస్తుంది.

చూడటానికి ఎంతో ముద్దుగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు కానీ గాబ్రియేల్ కార్నో అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘పిల్లి చాలా తెలివైనది. జంతువుల హృదయాల్లో కల్లాకపటం ఏం ఉండదు.. ప్రేమ, అప్యాయత మాత్రమే ఉంటాయని కామెంట్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement