ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త టీవీ కొనుగోలు చేయాలని చూస్తున్నవారికి ఇకపై అదనపు భారం తప్పదా? వచ్చే నెల నుంచి టెలివిజన్ ధరలు మోత మోగనున్నాయా? తాజా అంచనాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తు్నాయి. టీవీ ప్యానెల్స్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఈ నెలాఖరుతో నిలిచిపోనుంది. దీంతో ఆయా కంపెనీలు టీవీల ధరలు పెంచేందుకు సిద్ధపడుతున్నాయి. సెప్టెంబరు 30 తరువాత డ్యూటీ రాయితీని పొడిగించకపోతే వినియోగదారులకు అదనపు భారం తప్పదని పలు టీవీ కంపెనీలు ప్రకటించాయి. ఎల్‌జీ, పానాసోనిక్, థామ్సన్, సాన్సుయ్ కంపెనీలు ఈ వరుసలో ముందున్నాయి. గడువు పెంచకపోతే ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదని ఎల్‌జీ ఇండియా సీనియర్ డైరెక్టర్ రవీందర్ అన్నారు. 32 అంగుళాల టెలివిజన్‌కు 4 శాతం లేదా కనిష్టంగా 600 రూపాయలు, 42 అంగుళాల టీవీలపై 1,200-1,500 రూపాయల మేర ధరలు పెరిగే అవకాశం ఉంది. (ఈజీ టు ఇన్‌స్టాల్ : శాంసంగ్ బిజినెస్ టీవీలు)
అయితే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రాయితీని మరికొంత పెంచే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. శాంసంగ్ తన ఉత్పత్తిని వియత్నాం నుండి భారతదేశానికి తరలించిన నేపథ్యంలో టీవీ తయారీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగుమతి సుంకం రాయితీని గడువు పెంచేందుకు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. దీనిపై తుది నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకోనుంది. గతేడాది ఓపెన్ సెల్ ప్యానెళ్లపై ప్రభుత్వం 5 శాతం దిగుమతి సుంకం రాయితీ ఇచ్చింది. అదనంగా, టీవీని తయారు చేయడానికి అవసరమైన పూర్తిగా నిర్మించిన ప్యానెళ్ల రేట్లు 50 శాతానికి పైగా పెంచింది. టెలివిజన్ ఖర్చులో దాదాపు 60 శాతంగా ఉన్న ఒపెన్ సెల్ ప్యానెళ్లపై దిగుమతి సుంకం విధించే బదులు, ప్రభుత్వం దశలవారీగా-ఉత్పాదక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని స్థానిక తయారీదారులు అంటున్నారు. ఇండస్ట్రీ బాడీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయనెన్స్ తయారీదారుల సంఘం, బిజినెస్ ఛాంబర్ ఫిక్కీ ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు సమాచారం. (షావోమి కొత్త స్మార్ట్ టీవీ: హారిజన్ ఎడిషన్)
Comments
Please login to add a commentAdd a comment