
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లసస్ తన దూకుడును కొనసాగిస్తోంది. తాజాగా స్మార్ట్‌టీవీల రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ మేరకు వన్‌ప్లస్ కంపెనీ తన బ్లాగ్ ద్వారా లోగోను రివీల్ చేసి తన తొలి టీవీ విడుదలను ధృవీకరించింది. తద్వారా గత ఏడాది కాలంగా కొనసాగుతున్న రూమర్లకు చెక్ చెప్పింది. అయితే టీవీకి ఫీచర్లు, ధర తదితర వివరాలు ఇంకా ప్రకటించలేదు.
తాజా సమాచారం ప్రకారం న్‌ప్లస్ తన మొదటి టెలివిజన్ సెట్‌ను సెప్టెంబర్ 26 న విడుదల చేయనున్నట్లు పుకార్లు వ్యాపించాయి. ధర, ఇతర స్పెసిఫికేషన్లపై ప్రస్తుతానికి ఎలాంటి అంచనాలు వెలువడనప్పటికీ, 91 మొబైల్స్ సమాచారం ప్రకారం జియో స్ట్రీమింగ్ యాప్‌లతో ఇండియాలో లాంచ్ కానుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన సాంకేతికలను పరీక్షిస్తోందని అంచనా. 43, 55, 65, 75 అంగుళాల పరిమాణాల్లో వన్‌ప్లస్ తన మొదటి టీవీని అమెజాన్ ద్వారా లాంచ్ చేయనుందట.
Comments
Please login to add a commentAdd a comment