అగ్రిగోల్డ్ ‘టాలీవుడ్’ చానల్ | Agri Gold group to launch four television channels | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ ‘టాలీవుడ్’ చానల్

Published Fri, Aug 23 2013 2:29 AM | Last Updated on Sat, Aug 11 2018 9:14 PM

అగ్రిగోల్డ్ ‘టాలీవుడ్’ చానల్ - Sakshi

అగ్రిగోల్డ్ ‘టాలీవుడ్’ చానల్

 హైదరాబాద్, న్యూస్‌లైన్: అగ్రిగోల్డ్ గ్రూప్ మీడియా రంగంలోకి ప్రవేశిస్తోంది. పూర్తిగా తెలుగు సినిమారంగ వార్తలు, విశేషాలను అందించేందుకు ‘టాలీవుడ్’ పేరుతో కొత్త చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ సీతారామ్ అవ్వాస్ తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుచిత్ర రంగానికి సంబంధించిన అన్ని విభాగాలను,అన్ని రకాల అంశాలకు, వార్తలతో పాటు ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేసినట్టు చెప్పారు. 24 గంటలూ పూర్తిస్థాయి కార్యక్రమాలతో నిరంతర ప్రసారాలు అందించే చానల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు.
 
  శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ నటి శ్రీదేవి ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారని, కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డీకే అరుణ, డి. శ్రీధర్‌బాబు, కేంద్ర మాజీ మంత్రులు టి. సుబ్బరామిరెడ్డి, దాసరి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్, జయసుధ తదితరులు పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ సీఈవో శర్మ, డెరైక్టర్ నరేందర్‌రెడ్డి, నటి సంజన తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement