channels
-
ఏపీలో ఆ చానళ్ల ప్రసారాలు వెంటనే పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నిలిపివేసిన చానళ్ల ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. జూన్ 6 నుంచి ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ మిని పుష్కర్ణ మంగళవారం విచారించారు. ఆయా చానళ్లను పునరుద్ధరించాలని కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. లిఖితపూర్వక ఆదేశాలు ఇంకా వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ (ఎన్బీఎఫ్) హర్షం వ్యక్తం చేసింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా తీసుకొన్న నిర్ణయంపై కొరడా లాంటి ఆదేశాలుగా అభివరి్ణంచింది. ‘ప్రజాస్వామ్య పనితీరుకు అవసరమైన బహిరంగ, పారదర్శక మీడియా వాతావరణాన్ని నిర్వహించే ప్రాముఖ్యతను హైకోర్టు జోక్యం నొక్కి చెబుతోంది. ఈ తీర్పు పత్రికా స్వేచ్ఛను సమరి్థంచడం, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించడంపై ఓ ఉదాహరణగా నిలుస్తుంది’ అని మంగళవారం ఎన్బీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. -
నిలిపివేయడం సరికాదు: NBDA
-
పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోండి: వలంటీర్ ఫిర్యాదు
విజయవాడ: ఒంటరి మహిళల సమాచారాన్ని వలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించాయని విజయవాడ శాంతినగర్‌కు చెందిన వలంటీర్ రంగవల్లి న్యాయమూర్తి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో వలంటీర్లనుద్దేశించి ఏలూరులో పవన్ చేసిన వ్యాఖ్యలపై విజయవాడలోని పలువురు వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు పట్టించుకోకపోవడంతో వలంటీర్ రంగవల్లి నేరుగా విజయవాడ మెట్రోపాలిటన్ మేజ్రిస్టేట్ కోర్టు న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి శుక్రవారం రికార్డు చేశారు. ఆమె తరఫు న్యాయవాది ఒగ్గు గవాస్కర్, మరో 25 మంది న్యాయవాదుల సమక్షంలో కోర్టు హాల్లో గంటన్నరపాటు ఆమె వాంగ్మూలాన్ని న్యాయమూర్తి సేకరించారు. ‘పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అన్ని దినపత్రికలు, వార్తా చానళ్లు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగాం, ట్విట్టర్లలో వచ్చాయి. పవన్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని నేను నివాసం ఉంటున్న, విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతంలో కొందరు సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తున్నారు. నా పిల్లలను స్కూలుకు తీసుకెళ్లేటప్పుడు∙కొందరు యువకులు వేధిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించి సమాజంలో మర్యాద లేకుండా చేసిన పవన్ కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని వేడుకుంది. ఆమె నుంచి పూర్తి సమాచారం సేకరించిన న్యాయమూర్తి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేశారు. ఆ రోజు మిగిలిన సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించారు. -
ఎరిటేల్ బంపెరాఫెర్ 15 ఓటీటీ చానెల్స్ ఫ్రీ
-
వీక్షకులకు సంక్రాంతి బంపర్ ఆఫర్..
సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారులకు రూ 130కు వంద ఛానెళ్ల స్ధానంలో 200 ఛానళ్లను వీక్షించే వెసులుబాటు కల్పిస్తూ ట్రాయ్ న్యూ టారిఫ్ ఆర్డర్ (ఎన్టీఓ)కు సవరణలు చేసింది. ప్రసార భారతి ఛానళ్లు కాకుండా 200 ఛానళ్లను రూ 130కే వీక్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. వినియోగదారులకు అత్యధిక ఛానళ్లను అందించేలా ఎన్‌టీఓలో నిబంధనలు మార్చామని ఆయన పేర్కొన్నారు. ఛానళ్ల అనైతిక పోటీ, అతిక్రమణలకు పాల్పడకుండా ఈ మార్పులు చేపట్టామని చెప్పారు.గతంలో వినియోగదారుల ఉద్దేశాలను ప్రతిబింబించకుండా, వారి ఎంపికకూ విఘాతం కలిగేలా వ్యవహరించే పద్ధతిని ఎన్‌టీఓలో మార్పుల ద్వారా నిలువరించగలిగామని ట్రాయ్ చైర్మన్ వెల్లడించారు. తాజా మార్పులతో బొకే కింద అందించే పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి చానల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు చానల్‌ను ఇతర చానళ్లతో కలిపి గంపగుత్తగా (బొకే) ఆఫర్ చేసేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి (పన్నులు అదనం) మించరాదు. -
నిలచిన కేబుల్ ప్రసారాలు
సాక్షి, హైదరాబాద్ : కేబుల్ ప్రసారాలపై తాజాగా ట్రాయ్ విధించిన నిబంధనలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌తో శనివారం హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ప్రసారాలను నిలిపేసి ఆపరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ, ఏపీ ఎంఎస్ఒ, కేబుల్ ఆపరేటర్ల జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిపి తమ నిరసనతో పాటు కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంఎస్ఒ అసోసియేషన్ అధ్యక్షుడు కిశోర్, కేబుల్ టీవీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేంద్రలు మాట్లాడుతూ పే చానల్స్‌ను గతంలో ఉన్న ధరకే ఇవ్వాలని, గరిష్ట ధరను రుద్దవద్దని, జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గడువు, సమాచారం ఇవ్వకుండా ట్రాయ్ రెండో విడతగా పే చానల్స్‌ను కనిష్టంగా రూ.1 నుంచి 19 వరకు ప్రకటించడం సహేతుకం కాదన్నారు. గతంలో రూ.1 ఉన్న చానల్స్ కూడా ప్రస్తుతం రూ. 19 గా ప్రకటించడంతో వినియోగదారులపై మోయలేని భారం పడుతుందన్నారు. ఇలా ఒక్కో చానల్‌కు రూ.19 వంతున చెల్లిస్తే ప్రస్తుతం ఉన్న కేబుల్ చార్జీలు 200 నుంచి 800 దాటే అవకాశం ఉందన్నారు. ఇలా రేట్లు పెంచితే వినియోగదారులు తమను నిలదీయడమే కాకుండా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించే పరిస్థితి వస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ రూపంలో 18 శాతం వసూలు చేస్తున్నాయని దాన్ని పూర్తిగా ఎత్తేయాలని కిశోర్, జితేంద్రలు డిమాండ్ చేశారు. బ్లాకవుట్ ఎప్పుడూ లేదు.. కేబుల్ చరిత్రలో బ్లాకవుట్ ఎప్పుడూ జరగలేదని, కేబుల్ రంగంలో ఇంతపెద్ద సమస్య ఎప్పుడూ రాలేదన్నారు. 2012లో డిజిటలైజేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించటంతో కేబుల్ ఆపరేటర్లు రూ.లక్షలు వెచ్చించి సెటప్ బాక్సులు పెట్టారన్నారు. 2015 కన్నా ముందు రూ.3 నుంచి 5 ఒక్కొ పే చానల్ ధర ఉండగా ప్రస్తుతం ట్రాయ్ ఒక్కసారిగా పెంచేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే అదనుగా ప్రతీ బ్రాడ్‌కాస్టర్ గతంలో తక్కువ ధర ఉన్న తమ చానల్ రేటును రూ.19కి పెంచి ఆ రేటుకే ఇస్తామని చెపుతున్నారన్నారు. ట్రాయ్ కొత్త టారిఫ్‌ను నియంత్రించాలని గతంలో ఉన్న టారిఫ్‌కే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిట్ పిటీషన్ వేశామన్నారు. పే చానల్స్ ఏవో, ఫ్రీ చానల్స్ ఏవో వినియోగదారులకు తెలియకుండా తాము రూ.200 వసూలు చేసి అన్ని చానల్స్ ప్రసారం చేశామన్నారు. ఇలా చూపడంద్వారానే బ్రాడ్కాస్టర్లకు రేటింగులు పెరిగాయన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలన్నారు. కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ గ్రేటర్ అధ్యక్షుడు హరిగౌడ్, గ్రేటర్ గౌరవాధ్యక్షుడు జి. భాస్కర్ రావు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.పి.రాంబాబు, సునీల్, సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త డెడ్‌లైన్ జనవరి 31
న్యూఢిల్లీ: టీవీ వీక్షకులు కోరుకున్న చానల్స్ ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపేందుకు ఉద్దేశించిన కొత్త నిబంధనల అమలుకు గడువు పొడిగిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్ణయం తీసుకుంది. నిబంధనల అమలుకు జనవరి 31 దాకా సమయం ఇస్తున్నట్లు వెల్లడించింది. అప్పటిదాకా సబ్‌స్క్రయిబర్స్‌కి ప్రస్తుత ప్యాకేజీలే కొనసాగుతాయని వివరించింది. వాస్తవానికి సర్వీస్ ప్రొవైడర్లంతా ఇందుకు సంబంధించిన ప్రక్రియను డిసెంబర్ 28 నాటికి పూర్తి చేస్తే, కొత్త నిబంధనలు మర్నాడు .. అంటే డిసెంబర్ 29 నుంచే అమల్లోకి రావాల్సి ఉంది. ‘కొత్త నిబంధనల అమలుకు తాము సిద్ధంగా ఉన్నామని గురువారం జరిగిన సమావేశంలో బ్రాడ్‌కాస్టర్స్, డీటీహెచ్ ఆపరేటర్లు, మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా సబ్‌స్క్రయిబర్స్‌కి అవగాహన కల్పించేందుకు, 15 కోట్ల మంది యూజర్లు ఎంచుకునే ఆప్షన్స్ గురించి తెలుసుకునేందుకు మరికాస్త సమయం కావాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. దీంతో నెల రోజుల దాకా సమయమివ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత ప్యాక్‌లు, ప్లాన్లు 2019 జనవరి 31 దాకా యథాప్రకారం కొనసాగుతాయి. అప్పటిదాకా ఏ ఎంఎస్‌వోకి గానీ స్థానిక కేబుల్ ఆపరేటర్‌కు గానీ సర్వీస్ ప్రొవైడర్లు సిగ్నల్స్‌ను నిలిపేయకూడదు‘ అని ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది. సబ్‌స్క్రయిబర్స్ ఎంచుకునే చానల్స్ గురించి తెలుసుకునేందుకు డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు (డీపీవో) సొంత ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి సబ్‌స్క్రయిబర్స్ అందరినీ కొత్త విధానానికి మార్చాల్సి ఉంటుంది. డిసెంబర్ 29 నాటికి డీపీవోలు డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధరను (డీఆర్పీ), నెట్వర్క్ కెపాసిటీ ఫీజును (ఎన్సీఎఫ్) ప్రకటించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలేంటంటే.. సబ్‌స్క్రయిబర్స్ ప్రస్తుతం ప్రసారమయ్యే చానళ్లన్నింటికీ గంపగుత్తగా చెల్లించాల్సి వస్తోంది. వీటిలో ఇతర భాషలవి, వీక్షకులకు అక్కర్లేని చానళ్లు కూడా ఉంటున్నాయి. సబ్‌స్క్రయిబర్స్ తాము కోరుకున్న చానల్స్‌ని మాత్రమే ఎంచుకుని, వాటికి మాత్రమే చెల్లింపులు జరిపే అవకాశం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ట్రాయ్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం.. తాము కోరుకున్న చానల్స్‌ను ఎంపిక చేసుకునేందుకు, వాటికి మాత్రమే చెల్లించేందుకు యూజర్లకు అవకాశం లభిస్తుంది. టీవీ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు ఒక్కో చానల్ రేటును, బొకే కింద ఇచ్చే చానళ్ల ప్యాకేజీల రేట్లను ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది. దీనివల్ల వీక్షకులకు భారం తగ్గుతుందని ట్రాయ్ చెబుతోంది. కొత్త నిబంధనల ప్రకారం.. సుమారు 100 ఉచిత చానళ్లు ఉండే బేస్ ప్యాకేజీ ధర రూ.130గా (18 శాతం జీఎస్టీ అదనం). వీటిలో దూరదర్శన్‌కి చెందిన 26 చానళ్లు తప్పనిసరిగా ఉంటాయి. అదనంగా రూ. 20 చెల్లిస్తే ఇంకో 25 స్టాండర్డ్ డెఫినిషన్ చానల్స్ పొందవచ్చు. అలా కాకుండా సబ్‌స్క్రయిబర్స్ తమకు కావాల్సిన చానళ్లను ఎంపిక చేసుకుని, వాటికి అనుగుణంగా రేటు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాచుర్యంలో ఉన్న వివిధ తెలుగు చానళ్ల పూర్తి ప్యాకేజీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే దాదాపు రూ.115 దాకా బేస్ ప్యాక్‌పై అదనంగా కట్టాల్సి రావొచ్చని అంచనా. -
ఇకపై యూట్యూబ్ పెయిడ్ చానెల్స్
శాన్ఫ్రాన్సిస్కో: యూట్యూబ్‌లో ఇకపై పెయిడ్ చానెల్ సభ్యత్వం అందుబాటులోకి రానుంది. తద్వారా సృజనాత్మకత కలిగిన వారు మరింత డబ్బు సంపాదించుకునే వీలు కలుగుతుందని యూట్యూబ్ అధికారి నీల్ మోహన్ పేర్కొన్నారు. పెయిడ్ చానెల్‌కు సబ్స్క్రైబర్స్ నెలకు దాదాపు రూ.340 (4.99 డాలర్లు) చెల్లిస్తే, ఆ చానెల్లోని కొన్ని ప్రత్యేకమైన వీడియోలు, లైవ్ వీడియోలు తదితరాలను చూసే వీలు కల్పిస్తామని వివరించారు. ఇది లక్షకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న చానెళ్లకే వర్తిస్తుంది. -
రూ.130కే 100 ఎస్డీ చానళ్లు!
ట్రాయ్ కొత్త ప్రతిపాదన.. న్యూఢిల్లీ: ఇకపై నెలకు కనీసం రూ.130 అద్దె చెల్లించడం ద్వారా 100 ఎస్డీ చానళ్లను వీక్షించే అవకాశం కలగనుంది. సెట్‌టాప్ కనెక్షన్లకు రూ.130 రూపాయల నెలసరి అద్దెపై 100 స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్డీ) చానళ్లను అందించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. నూతన చార్జీలతో కూడిన ముసాయిదాను రూపొందించి దీనిపై ఈ నెల 24లోపు అభిప్రాయలు తెలియజేయాలని భాగస్వాములను కోరింది. అలాగే కస్టమర్లు తాము సొంతంగా ఎంపిక చేసుకునే (అలా కార్టే చానల్స్) చానళ్లకు గరిష్ట ధర ఎంతో కూడా తెలియజేయాలని ట్రాయ్ ఇందులో పేర్కొంది. అయితే, ప్రీమియం చానళ్లపై గరిష్ట ధర పరిమితి విధించలేదు. దీంతో ప్రసారాలను అందించే సంస్థలు తమ ఇష్టానుసారం ధరలను ఖరారు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చినట్టయింది. -
మా చానల్స్ చూడండి.. నెలకు మూడు వేలిస్తాం !
కోదాడ టౌన్: ‘మేమే కంప్యూటర్ ఇస్తాం.. ఇం టర్నెట్ కనెక్షన్ ఉంటే బిల్లు కూడా ఇస్తాం. అంతే కాదు.. నెలకు రూ.3,000 మీ అకౌంట్లో వేస్తాం. మేము ఇచ్చిన కంప్యూటర్ను రోజుకు ఎనిమిది గంటలు ఆన్‌చేసి ఉంచాలి. ఇందుకోసం ఇప్పుడు 10 వేలు చెల్లించాలి.’ ఇదీ కోదాడలో నెల రోజు లుగా ఒక సంస్థ చేస్తున్న ప్రచారం. దీంతో వేలం వెర్రిగా ఇంజనీరింగ్ విద్యార్థులు, ఉద్యోగులు ఎగబడుతున్నారు. కానీ, ఇందులో ఏదో తిరకాసు దాగుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తమ వెబ్సైట్ కోసం ప్రచారం అని చెబుతుండడం గమనార్హం. కోదాడ, ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్షిత క్రియేషన్స్ పేరుతో వెబ్‌చానల్స్ నడుపుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. విద్యార్థులు, వ్యాపారులను మచ్చిక చేసుకుని రూ.10 వేలకు పాత కంప్యూటర్ అంటగడుతున్నారు. ప్రతినెలా నెట్ బిల్లు రూ.500 ఇస్తామని.. రోజు ఎనిమిది గంటలు కంప్యూటర్ను ఆన్ చేసి ఉంచితే ప్రతి నెలా రూ.3,000 అకౌంట్లో వేస్తామని ప్రచారం చేయడంతో ఒక్క కోదాడలోనే నెల రోజుల్లో 200 మంది రూ.10 వేల నుంచి రూ.14 వేలు చెల్లించి పాత కంప్యూటర్లను తీసుకున్నారు. వాస్తవానికి ఒక్కో కంప్యూటర్ ఖరీదు రూ. 5 వేల నుంచి రూ.6 వేలు మాత్రమే ఉంటుందని పాత కంప్యూటర్లను రెట్టింపు రేట్లతో అంటగడుతున్నారని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వీడియోకాన్ డీ2హెచ్లో మరో రెండు చానల్స్
ముంబై: డెరైక్ట్ టు హోమ్ సేవల సంస్థ వీడియోకాన్ డీ2హెచ్ తాజాగా మరో రెండు హై-డెఫినిషన్ చానల్స్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. స్టార్ మూవీస్ సెలెక్ట్ హెచ్డీ, ఫాక్స్ లైఫ్ హెచ్‌డీలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించింది. దీంతో తమ హెచ్డీ చానల్స్ సంఖ్య 37కి పెరిగినట్లు వీడియోకాన్ డీ2హెచ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సౌరభ్ ధూత్ తెలిపారు. స్టార్ మూవీస్ సెలెక్ట్ హెచ్డీలో ప్రతి నెలా రెండు కొత్త చిత్రాలు (గతంలో భారత్‌లో విడుదల కానివి) ప్రసారమవుతాయని, అలాగే ప్రతి రోజూ ఒక కొత్త మూవీ ప్రసారమవుతుందని ఆయన వివరించారు. ఫాక్స్ లైఫ్ హెచ్డీలో హిందీ, తమిళం, బెంగాలీ భాషల్లో కూడా ఆడియో సదుపాయం ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
తెలంగాణలో పరిస్థితిని గమనిస్తున్నాం
హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ సర్కార్ ముందుకు వెళుతోందని కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఆయన గురువారం బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశానికి మంచి రోజులు రానున్నాయని, వందరోజుల మోడీ పాలనపై ప్రజలకు నమ్మకం కలిగిందన్నారు. మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పధంలో నడుస్తోందన్నారు.పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారన్నారు. విదేశీ కంపెనీలు సైతం భారత్ వైపు చూస్తున్నాయని జవదేకర్ పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా అన్ని సేవలు సులభతరం చేస్తున్నామని తెలిపారు. అవినీతి రహిత పాలన అందిస్తామన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. అభివృద్ధి కోసమే ప్రజలు మోడీకి ఓటు వేశారని జవదేకర్ అన్నారు. పర్యావరణ శాఖలో ఏళ్ల తరబడి ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వటమే గత ప్రభుత్వం మానేసిందని తెలిపారు. త్వరలోనే పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేస్తామన్నారు. అభివృద్ధి, పర్యావరణం, రక్షణ తమకు ముఖ్యమన్నారు. తెలంగాణలో పరిస్థితిని గమనించామని, ఛానెల్స్ ప్రసారాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదన్నారు. మరోవైపు ఏబీఎన్, టీవీ9 సిబ్బంది ఈరోజు ఉదయం జవదేకర్‌ను కలిశారు. ఛానల్స్ ప్రసారాల పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు ఛానల్స్ తెరిపించాలంటూ ఐజేయూ తరపున దేవులపల్లి అమర్ వినతిపత్రం ఇచ్చారు. దీనిపై స్పందించిన జవదేకర్ ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై..రెండురోజుల్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక కేబుల్ ఆపరేటర్లు కూడా జవదేకర్‌ను కలిశారు. ట్రాయ్‌లో తమకు విరుద్ధంగా ఉన్న నిబంధనలు సడలించే అంశాలను పరిశీలించాలని వారు విజ్ఞప్తి చేశారు. -
తెలంగాణలో పరిస్థితిని గమనిస్తున్నాం
-
'కనురెప్ప కొట్టే సమయం కూడా పోనివ్వను'
హైదరాబాద్ : మహాకవి కాళోజీ వ్యక్తిత్వాన్ని కొలవలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన మంగళవారం వరంగల్‌లో కాళోజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. కాళోజీ కళాక్షేత్రం కోసం 12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయన ఏనాడూ పదవులకూ, డబ్బుకూ లొంగలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాళోజీది రాజీపడి మనస్తత్వమన్నారు. ఒక విషయాన్ని తీసుకుంటే....కొసదాకా కొట్లాడు బిడ్డా అని తనను కాళోజీ ఆశీర్వదించారన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కాళోజీ విశ్వమానవుడని కేసీఆర్ ప్రశంసించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్లలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని ఎన్నికల ప్రచారంలో తాను ముందే చెప్పానన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యను అధిగమించి తీరుతామన్నారు. దాన్ని కూడా వ్యతిరేకంగా రాయటం దురదృష్టకరమన్నారు. ఏడాది... ఏడాదికి విద్యుత్ ఉత్పత్తి మెరుగుపరుచుకుంటూ.. వచ్చే మూడేళ్లలో కనురెప్ప కొట్టే సమయం కూడా కరెంట్ పోనివ్వమని కేసీఆర్ తెలిపారు. -
పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా...
వరంగల్ : తెలంగాణ ఉనికిని అగౌరపరిస్తే పాతరేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కాళోజీ శతయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మంగళవారం మీడియా ఆందోళనపై స్పందించారు. 'మా గడ్డ మీద ఉండాలంటే మా ప్రాంతానికి సలాం కొట్టాలి.... తెలంగాణప్రాంతాన్ని కించపరిచే ఆ ఛానల్స్ మాకు అక్కరలేదని' అన్నారు. 'పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా... పాతర ....పాతర వేస్తాం ..పదికిలోమీటర్ల లోతున' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను తిడితే బాధలేదని, తెలంగాణ శాసనసభ్యుల్ని తిట్టడం అవమానకరమన్నారు. తెలంగాణ శాసనసభ్యులంతా ఆ ఛానల్స్‌పై సమిష్టిగా తీర్మానం చేశాయని .... ఆ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. దానికి స్పందించిన ఎంఎస్‌వో ఆ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేశారన్నారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ వరకూ తీసుకుపోయి రాద్ధాంతం చేశారని కేసీఆర్ విమర్శించారు. రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసిన తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ సంఘానికి సెల్యూట్ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సంబంధిత ఛానళ్లలో పనిచేస్తున్న స్థానిక ఉద్యోగులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు. -
'హేళన చేసేలా టీవీ-9 చూపించడం విచారకరం'
-
'హేళన చేసేలా టీవీ-9 చూపించడం విచారకరం'
హైదరాబాద్ : అవహేళన చేసేవిధంగా కథనాలు ప్రసారం చేశారంటూ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేయటం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. జడ్జిమెంట్ ఇవ్వకుండానే నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఆయన బుధవారమిక్కడ ప్రశ్నించారు. ఎమ్ఎస్ఓల చర్య ప్రతీకార దాడిగా కనిపిస్తోందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఎంఎస్ఓలు ఈ నిర్ణయాన్ని స్వతంత్రంగా తీసుకుంటే సంతోషిస్తానని ఆయన అన్నారు. అయితే వారి నిర్ణయంలో ప్రభుత్వం ఒత్తడి ఉండకూడదన్నారు. అయితే ప్రసార మాధ్యమాలు కూడా స్వయం నియంత్రణ పాటించాలని ఆయన మరోవైపు వ్యాఖ్యలు చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉండాలని, అయితే అది హద్దులో ఉండాలన్నారు. శాసనసభను హేళన చేసేలా టీవీ-9 చూపించటం విచారకరమని జానారెడ్డి అన్నారు. ఆ చర్యను తాము ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ జెన్కోకు చెందిన అన్ని విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న ముసాయిదా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కోరటం సరికాదని జానారెడ్డి అన్నారు. అది విభజన చట్టాన్ని ఉల్లంఘించటమేనని అన్నారు. ఈఆర్ఎస్కి చంద్రబాబు లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చిందని జానా ప్రశ్నించారు. పీపీఏలను రద్దు చేయరాదంటూ కేంద్రాన్ని కోరతామన్నారు. ఇటువంటి కక్షసాధింపు చర్యలు సరికాదని ఆయన అన్నారు. -
టీవీక్షణం : కుక్కలు చూసేందుకు ఓ చానెల్!
వంటల చానెళ్లు, ఆటల చానెళ్లు, సినిమాల చానెళ్లు అంటూ చాలా రకాలు ఉన్నాయి. ఎవరికి నచ్చినవి వాళ్లు చూస్తుంటారు. అలాగే జంతువుల చానెళ్లు కూడా ఉన్నాయి. మూగజీవాలంటే ఇష్టం ఉన్నవాళ్లు వాటిని చూస్తారు. అయితే జంతువులు మాత్రమే చూసే చానెల్ ఏదైనా ఉందా? జంతువులు టీవీ చూడ్డమేంటి, పైగా వాటికో చానెల్ కూడానా అని ఆశ్చర్యపోకండి. ఇప్పుడు అలాంటివి కూడా రాబోతున్నాయి! డెరైక్ట్ టీవీ అనే అమెరికన్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ ఓ కొత్త చానెల్‌కు రూపకల్పన చేసింది. అయితే అది మనుషులు చూడ్డానికి కాదు... శునకాలు వీక్షించడానికి! ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కుక్కలు ఇంటికి కాపలా కాస్తాయి. యజమాని ఉన్నా లేకపోయినా ఇంటిని అంటిపెట్టుకునే ఉంటాయి. ఇంట్లో వాళ్లంతా బయటకు వెళ్లిపోతే, ఇంట్లోనే కాలం గడుపుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటికి బోర్ కొడితే? ఈ ఆలోచన ఇప్పటి వరకూ ఎవరికీ వచ్చి ఉండదు. కానీ డెరైక్ట్ టీవీ వాళ్లకు వచ్చింది. అందుకే కుక్కల కోసం వాళ్లు ఏకంగా ఓ చానెల్‌నే తెచ్చేస్తున్నారు. ఓ కుక్కల చానెల్ని తీసుకు రాబోతున్నాం అని ప్రకటించినప్పుడు, కుక్కలకు సంబంధించిన విషయాలను చెప్పేందుకు ఈ చానెల్‌ను తెస్తున్నారేమో అనుకున్నారట జనం. కానీ కుక్కల గురించి మనుషులకు చెప్పడానికి కాదు, కుక్కలు చూసి ఎంజాయ్ చేయడానికే ఆ చానెల్ని తెస్తున్నాం అని చెప్పేసరికి అందరూ అవాక్కయ్యారు. కుక్కల కోసం మంచి సంగీతం, యానిమేషన్ చిత్రాలు, వాటికి నచ్చే ఆహార పదార్థాల విషయాలు వంటి వాటిని ప్రసారం చేస్తారట ఇందులో. మొదట అమెరికాలో ట్రై చేసి, అక్కడ కనుక సక్సెస్ అయితే ఇతర దేశాలకు కూడా ప్రసారాలను విస్తరిస్తాం అని చెబుతున్నారు. మనుషుల కోసం ఇన్ని చానెళ్లు ఉన్నప్పుడు కుక్కలకూ ఒకటి ఉంటే ఏం పోయింది చెప్పండి. పాపం వాటిని కూడా ఎంజాయ్ చేయనివ్వాలి కదా! -
అగ్రిగోల్డ్ ‘టాలీవుడ్’ చానల్
హైదరాబాద్, న్యూస్‌లైన్: అగ్రిగోల్డ్ గ్రూప్ మీడియా రంగంలోకి ప్రవేశిస్తోంది. పూర్తిగా తెలుగు సినిమారంగ వార్తలు, విశేషాలను అందించేందుకు ‘టాలీవుడ్’ పేరుతో కొత్త చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ సీతారామ్ అవ్వాస్ తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుచిత్ర రంగానికి సంబంధించిన అన్ని విభాగాలను,అన్ని రకాల అంశాలకు, వార్తలతో పాటు ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేసినట్టు చెప్పారు. 24 గంటలూ పూర్తిస్థాయి కార్యక్రమాలతో నిరంతర ప్రసారాలు అందించే చానల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ నటి శ్రీదేవి ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారని, కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డీకే అరుణ, డి. శ్రీధర్‌బాబు, కేంద్ర మాజీ మంత్రులు టి. సుబ్బరామిరెడ్డి, దాసరి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్, జయసుధ తదితరులు పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ సీఈవో శర్మ, డెరైక్టర్ నరేందర్‌రెడ్డి, నటి సంజన తదితరులు పాల్గొన్నారు.