రూ.130కే 100 ఎస్డీ చానళ్లు! | TRAI proposes Rs 130 per month rental for 100 SD channels | Sakshi
Sakshi News home page

రూ.130కే 100 ఎస్డీ చానళ్లు!

Published Fri, Oct 14 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM

రూ.130కే 100 ఎస్డీ చానళ్లు!

రూ.130కే 100 ఎస్డీ చానళ్లు!

ట్రాయ్ కొత్త ప్రతిపాదన..
న్యూఢిల్లీ: ఇకపై నెలకు కనీసం రూ.130 అద్దె చెల్లించడం ద్వారా 100 ఎస్‌డీ చానళ్లను వీక్షించే అవకాశం కలగనుంది. సెట్‌టాప్ కనెక్షన్లకు రూ.130 రూపాయల నెలసరి అద్దెపై 100 స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్‌డీ) చానళ్లను అందించాలని ట్రాయ్ ప్రతిపాదించింది. నూతన చార్జీలతో కూడిన ముసాయిదాను రూపొందించి దీనిపై ఈ నెల 24లోపు అభిప్రాయలు తెలియజేయాలని భాగస్వాములను కోరింది.

అలాగే కస్టమర్లు తాము సొంతంగా ఎంపిక చేసుకునే (అలా కార్టే చానల్స్) చానళ్లకు గరిష్ట ధర ఎంతో కూడా తెలియజేయాలని ట్రాయ్ ఇందులో పేర్కొంది. అయితే, ప్రీమియం చానళ్లపై గరిష్ట ధర పరిమితి విధించలేదు. దీంతో ప్రసారాలను అందించే సంస్థలు తమ ఇష్టానుసారం ధరలను ఖరారు చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చినట్టయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement