'కనురెప్ప కొట్టే సమయం కూడా పోనివ్వను' | will give 24 hour power supply within three years, says kcr | Sakshi
Sakshi News home page

'కనురెప్ప కొట్టే సమయం కూడా పోనివ్వను'

Published Tue, Sep 9 2014 2:43 PM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM

'కనురెప్ప కొట్టే సమయం కూడా పోనివ్వను' - Sakshi

'కనురెప్ప కొట్టే సమయం కూడా పోనివ్వను'

హైదరాబాద్ : మహాకవి కాళోజీ వ్యక్తిత్వాన్ని కొలవలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన మంగళవారం వరంగల్లో కాళోజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.  కాళోజీ కళాక్షేత్రం కోసం 12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేసీఆర్  ఈ సందర్భంగా ప్రకటించారు.  ఆయన ఏనాడూ పదవులకూ, డబ్బుకూ లొంగలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాళోజీది రాజీపడి మనస్తత్వమన్నారు. ఒక విషయాన్ని తీసుకుంటే....కొసదాకా కొట్లాడు బిడ్డా అని తనను కాళోజీ ఆశీర్వదించారన్నారు.

తెలంగాణ ముద్దుబిడ్డ అయిన కాళోజీ విశ్వమానవుడని కేసీఆర్ ప్రశంసించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు పరుస్తామని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్లలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని ఎన్నికల ప్రచారంలో తాను ముందే చెప్పానన్నారు. వచ్చే మూడేళ్లలో విద్యుత్ సమస్యను అధిగమించి తీరుతామన్నారు. దాన్ని కూడా వ్యతిరేకంగా రాయటం దురదృష్టకరమన్నారు. ఏడాది... ఏడాదికి విద్యుత్ ఉత్పత్తి మెరుగుపరుచుకుంటూ..  వచ్చే మూడేళ్లలో కనురెప్ప కొట్టే సమయం కూడా కరెంట్ పోనివ్వమని కేసీఆర్ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement