బాహుబలి 2 సినిమా వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సంచలనాలు నమోదు చేస్తుందని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. అందుకే ఒకేసారి మూడు భాషల్లో టీవీ ప్రసారానికి రంగం సిద్ధం చేసింది. ఎలాంటి పండుగ సీజన్ కాకపోయినా.. బాహుబలి ప్రదర్శనే ఓ పండుగు అన్నట్టుగా ప్రచారం చేశారు చిత్రయూనిట్. ఆదివారం (08-10-2017) హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రెండు గంటల తేడాతో సినిమాను ప్రసారం చేయనున్నారు.స
ఈ ప్రీమియర్స్ షోస్ పై హీరో ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించాడు. తన ఫేస్ బుక్ పేజ్ లో బాహుబలి 2 సినిమాను టీవీలో చూసి ఆనందించాలని కోరిన ప్రభాస్, ఇంతకంటే గొప్ప ఆదివారం రాదంటూ కామెంట్ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment