మళ్లీ... శ్వేతాబసు
చిన్నితెర నుంచి వెండితెరకు వచ్చిన శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ బుల్లితెరపై పలకరించనున్నారు. బుజ్జి బుజ్జిగా ఉన్నప్పుడు బుల్లితెరపై సందడి చేసిన ఆమె ఇప్పుడు పాతికేళ్ల వయసులో టీవీ వైపు రావడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ ఆ మధ్య ఓ కేసు నుంచి బయటపడిన విషయం తెలిసిందే.
మళ్లీ నటిగా బిజీ కావాలనుకుంటున్న శ్వేత ఒకపక్క సినిమాల్లో చాన్స్‌ల కోసం ప్రయ త్నిస్తూనే, ‘డర్ సబ్‌కో లగ్తా హై’ అనే టీవీ సీరియల్ కాన్సెప్ట్ నచ్చి, అందులో నటించడానికి ఒప్పుకున్నారు. మొత్తానికి, 14 ఏళ్ల తర్వాత టీవీలో మళ్ళీ సందడి చేయనున్నారు. సిటీకి కొత్తగావచ్చిన అమ్మాయికి హాస్టల్లో ఎదురైన భయా నక అనుభవాలు ఈ సీరియల్ కథ.