Swetha Basu Prasad
-
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘కొత్తబంగారు లోకం’ హీరోయిన్(ఫోటోలు)
-
17 ఏళ్లకే హీరోయిన్.. తెలుగులో ఫస్ట్ మూవీనే బ్లాక్‌బస్టర్.. ఈమెని గుర్తుపట్టారా?
ఈమె స్వతహాగా చైల్డ్ ఆర్టిస్ట్. కట్ చేస్తే టీనేజ్‌లోకి వచ్చేసరికి హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ ఫస్ట్ తెలుగు మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది. ఈమె లక్ ఏంటో గానీ ఏకంగా బ్లాక్‌బస్టర్ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ సినిమాల సంగతి అటుంచితే ఘోరమైన కాంట్రవర్సీలో ఈమె ఇరుక్కుంది. ఆల్మోస్ట్ కెరీర్ మటాష్ అయిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శ్వేతబసు ప్రసాద్. హా.. అవును మీరు ఊహించింది కరెక్టే. 'కొత్తబంగారు లోకం' మూవీతో 2008లో సెన్సేషన్ సృష్టించిన బ్యూటీనే ఈమె. జార్ఖండ్‌లోని జంషెడ్పుర్లో పుట్టిన ఈ భామ.. చిన్నతనంలో ఫ్యామిలీతో కలిసి ముంబయి వచ్చేసింది. ఈమె పేరు శ్వేత మాత్రమే. తల్లి పేరులోని బసు, తండ్రి పేరులోని ప్రసాద్‌ని తన పేరుకి యాడ్ చేసుకుంది. దీంతో శ్వేతబసు ప్రసాద్ అయింది. (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) 2002లోనే 'మక్దీ' అనే హిందీ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన శ్వేత.. ఆ తర్వాత మరో రెండు మూడు చిత్రాల్లో నటించింది. 2008లో బెంగాలీలో 'ఏక్ నదిర్ గల్పో', తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమాలతో హీరోయిన్ అయిపోయింది. అనంతరం తెలుగు-తమిళ భాషల్లో దాదాపు ఆరేళ్లు పలు సినిమాల్లో హీరోయిన్గా చేసింది. పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి షిప్ట్ అయిపోయింది. అయితే కొన్నేళ్ల క్రితం ఓసారి హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. దీంతో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయిపోయింది. ఈ సంఘటన వల్ల ఈమె కెరీర్ కాస్త దెబ్బతింది. ఇకపోతే 2018లో రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ సరిగ్గా ఏడాదిలోనే అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉంటూ ఓటీటీలో మూవీస్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) -
డేటింగ్ ఎలా జరిగింది అంటే చెప్పలేను: శ్వేతా బసు ప్రసాద్
-
వరుణ్ సందేశ్, నాని తనీష్ లో ఎవరు బెస్ట్ ?
-
కథ ఒకలా చెప్పి సినిమా ఇంకోలా తీస్తారు
-
కొత్త బంగారులోకంలో అలా ఛాన్స్ వచ్చింది
-
పెళ్లి కథనాలపై శ్వేతా బసు క్లారిటీ
సాక్షి, ముంబై: పెళ్లి కథనాలపై నటి శ్వేతాబసు ప్రసాద్ ఎట్టకేలకు స్పందించారు. కొత్తబంగారు లోకం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఈ మధ్య గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వివాహంపై వస్తున్న పుకార్లపై పెదవి విప్పారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో గత నాలుగేళ్లుగా స్నేహంగా ఉంటున్న ఆమె.. అతన్నే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ‘అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలతో ప్రేమను వ్యక్తం పరుస్తున్నారు. నేను రోహిత్‌కు గోవాలో ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. ఇద్దరి ఇంట్లో ఒప్పుకొన్నారు. అయితే పెళ్లికి ఇప్పుడే తొందరేం లేదు. మా ఇద్దరి నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న కథనాలు నిజమే. కానీ, మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదు’ అని శ్వేత తెలిపారు. బాలీవుడ్లో ఇక్బాల్ చిత్రంతో బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్వేత.. కొత్త బంగారు లోకంతో తెలుగువారికి చేరువయ్యారు. తర్వాత కళావర్ కింగ్, రైడ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కాబోయే భర్తతో రూపొందిస్తున్న కొన్ని షార్ట్ ఫిలింస్‌లో, మరికొన్ని వెబ్ సిరీస్‌లతోపాటు బాలీవుడ్‌లోనూ ఓ పొలిటికల్ చిత్రంలోనూ నటిస్తున్నారు. -
అమలాపురం టు షిర్డీ
సుందరి ట్రావెల్స్ చాలా ఫేమస్. అమలాపురం టు షిర్డీ వెళ్లే ఈ ట్రావెల్స్ బస్సులో విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు ప్రయాణం చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఆ కథల సమాహారంతో రూపొందిన చిత్రం ‘మిక్సర్ పొట్లం’. నటుడు భానుచందర్ తనయుడు జయంత్, శ్వేతాబసు ప్రసాద్, గీతాంజలి హీరో హీరోయిన్లు. ఎం.వి. సతీష్ కుమార్ దర్శకత్వంలో కలపటపు లక్ష్మీప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోను కె.భాగ్యరాజా, భానుచందర్, ఎస్పీబీ, వెన్నెలకంటి తదితరులు వీక్షించారు. ‘‘శ్వేతాబసు నటన హైలెట్. ప్రముఖులందరూ ప్రీమియర్ షో చూసి, అభినందించడం సంతోషం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
అవును అతణ్ని ప్రేమిస్తున్నా..
అవును నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. అని నటి శ్వేతాబసు స్పష్టం చేశారు. బహుభాషానటిగా శ్వేతాబసు గురించి చిత్ర పరిశ్రమలో తెలియని వారుండరు. తమిళంలో రారా, చందమామ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన ఈ భామ తెలుగు, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు పొందారు. ఇక ఆ మధ్య వ్యభిచార కేసులో పోలీసులకు పట్టుబడి పెద్ద కలకలం సృష్టించిన శ్వేతాబసు కోర్టు ఉత్తర్వులతో కొంత కాలం స్త్రీ సంక్షేమ ఆశ్రమంలో గడిపారు. అనంతరం బయటపడ్డ శ్వేతాబసు అవకాశాల వేటలో పడ్డారు. అయితే చాలా మంది అయ్యో పాపం అన్నారే కానీ అవకాశాలివ్వలేదు. దీంతో మీ సింపతీ నాకొద్దు అంటూ ముంబైకి మకాం మార్చిన ఈ అమ్మడు అక్కడ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద సహాయకురాలిగా చేరారు. ఆయనతో కథా చర్చల్లో పాల్గొంటున్న శ్వేతాబసుకు వారి కార్యాలయానికి వచ్చిన మరో దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో పరిచయం ప్రేమగా మారిందట. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ప్రచారం హల్చల్ చేస్తున్నా పట్టించుకోని శ్వేత తాజాగా అవును నేను దర్శకుడు రోహిత్ మిట్టల్ ప్రేమించుకుంటున్నాం అని బహిరంగంగా వెల్లడించారు. గత రెండేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామనీ, ఒక కార్యక్రమంలో తనకు రోహిత్ పరిచయం అయ్యాడని అది ప్రేమకు దారి తీసిందని తెలిపారు. రెండేళ్లుగా తామిద్దరం ప్రేమలో సంతోషంగా ఉన్నామని, పెళ్లి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ శ్వేతాబసు పేర్కొన్నారు. -
మళ్లీ... శ్వేతాబసు
చిన్నితెర నుంచి వెండితెరకు వచ్చిన శ్వేతాబసు ప్రసాద్ మళ్లీ బుల్లితెరపై పలకరించనున్నారు. బుజ్జి బుజ్జిగా ఉన్నప్పుడు బుల్లితెరపై సందడి చేసిన ఆమె ఇప్పుడు పాతికేళ్ల వయసులో టీవీ వైపు రావడం విశేషం. తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బెంగాలీ బ్యూటీ ఆ మధ్య ఓ కేసు నుంచి బయటపడిన విషయం తెలిసిందే. మళ్లీ నటిగా బిజీ కావాలనుకుంటున్న శ్వేత ఒకపక్క సినిమాల్లో చాన్స్‌ల కోసం ప్రయ త్నిస్తూనే, ‘డర్ సబ్కో లగ్తా హై’ అనే టీవీ సీరియల్ కాన్సెప్ట్ నచ్చి, అందులో నటించడానికి ఒప్పుకున్నారు. మొత్తానికి, 14 ఏళ్ల తర్వాత టీవీలో మళ్ళీ సందడి చేయనున్నారు. సిటీకి కొత్తగావచ్చిన అమ్మాయికి హాస్టల్లో ఎదురైన భయా నక అనుభవాలు ఈ సీరియల్ కథ. -
మాటలే.. చేతలు లేవు
మాటలు గుప్పించారు, చేతలు మాత్రం శూన్యం అంటూ నటి శ్వేతాబసు వాపోతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో ఇప్పుడిప్పుడే కథా నాయకిగా ఎదుగుతున్న ఈమె ఆర్థిక సమస్యలు, లేక ఇతర కారణాలు గాని ఆ మధ్య వ్యభిచారం వ్యవహారంలో పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో బాలీవుడ్ దర్శకులతో సహా పలువురు శ్వేతాబసుకు మద్దతు ప్రకటించి, నటిగా అవకాశాలు కల్పిస్తామని బహిరంగంగానే వె ల్లడించారు. అయితే అలాంటి వారిలో ఏ ఒక్కరూ అవకాశం కల్పించలేదని శ్వేత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఒక చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తెలుగు నటుడు విష్ణు మంచు మినహా ఇతరులెవరూ అవకాశం ఇవ్వలేదన్నారు. విష్ణు చిత్రంలో నటించే విషయం కూడా చర్చల్లో ఉందని తెలిపారు. తమిళం, తెలుగు, హిందీ ఏ భాషలోనైనా తాను నటించడానికి సిద్ధమని అన్నారు. అలాగే తనకు వ్యక్తిగత కార్యనిర్వాహకుడంటూ ఎవరూ లేరని అవకాశం కల్పించేవారు నేరుగా తనను సంప్రదించవచ్చని శ్వేత పేర్కొంది. -
అప్పుడూ, ఇప్పుడూ ఒకేలా ఉన్నా..!
-
ప్రకటనలే తప్ప.. ఆఫర్లు లేవు!
-
నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు
-
కొత్త రోల్లో శ్వేతాబసుప్రసాద్!
-
శ్వేతాబసుకు దీపిక వత్తాసు
నటి శ్వేతాబసు ప్రసాద్‌కు బాలీవుడ్ క్రేజీ నటి దీపిక పదుకునే వత్తాసు పలికింది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా నటించి శ్వేతాబసు ఇటీవల హైదరాబాదులో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన విష యం తెలిసిందే. శ్వేతాబసు చర్యను నటి కుష్భులాంటి వారు తప్పుబట్టగా మరికొందరు సమర్థించిన వారు లేకపోలేదు. ప్రముఖ బాలీ వుడ్ దర్శకుడు ఆమెకు మద్దతుగా నిలబడి మళ్లీ హీరోయిన్ అవకాశం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. తాజాగా శ్వేతాబసుకు వత్తాసు పలికిన వారి లిస్టులో ప్రముఖ బాలీవుడ్ నటి దీపి కా పదుకునే చేరింది. కుటుంబ పోషణ కోసం శ్వేతాబసు వ్యభిచారం చేయ డం తప్పు లేదంటోందీ భామ. సిని మా అవకాశాలు లేకపోవడంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేరే దారి లేకనే శ్వేతాబసు వ్యభిచారానికి పాల్పడ్డానని తెలపడం వలన ఆమెకు అందరూ అండగా నిలబడాలని అంది. మరికొందరు తమిళ నటీనటులు శ్వేతాబసు చర్యపై స్పందించడానికి ఆసక్తి చూపలేదు. -
ఎర్రమంజిల్ కోర్టుకు శ్వేతాబసు ప్రసాద్
హైదరాబాద్ : వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన వర్థమాన నటి శ్వతాబసు ప్రసాద్‌ను పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. నగరంలోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఆదివారం ఆమె పోలీసులకు పట్టబడిన విషయం తెలిసిందే. కాగా బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో శ్వేతాబసు ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దర్ని పోలీసులు ఈరోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు. కాగా నటి శ్వేతబసు ప్రసాద్‌ను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అలాగే బాలును చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు బాలును కస్టడీలోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు!
-
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు ప్రసాద్!
హైదరాబాద్: వర్ధమాన నటి శ్వేతాబసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి నగరంలోని ఒక స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. బంజారాహిల్స్ లోని పార్క్ హయాత్ హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో శ్వేతాబసు ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారని ప్రాథమిక సమాచారం. ఇందులో బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఓ స్టార్ హోటల్లో ఆమె వ్యభిచారం నిర్వహిస్తున్నారనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. కొన్నేళ్ళ క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ సరసన మెరిసిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్.. తొలి చిత్రంతోనే అనూహ్యమైన గుర్తింపు సాధించినా తరువాత అనూహ్యంగా వెనుకబడ్డారు. -
కెమేరా వెనుక కొత్త అవతారం
కొన్నేళ్ళ క్రితం ‘కొత్త బంగారు లోకం’ చిత్రంలో హీరో వరుణ్ సందేశ్ సరసన మెరిసిన కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ గుర్తుందిగా! తొలి చిత్రంతోనే అనూహ్యమైన గుర్తింపు సాధించిన ఈ యువ నటి ఆ తరువాత ఆశించిన మేరకు విజయాలు అందుకోక బాగా వెనుకబడ్డారు. ప్రత్యేక నృత్య గీతాల్లోనూ నర్తించారు. అయితే, ఇప్పుడీ నవతరం అమ్మాయి ఓ డాక్యుమెంటరీని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ‘రూట్స్’ అని పేరు పెట్టిన ఈ డాక్యుమెంటరీ చిత్రం భారతీయ శాస్త్రీయ సంగీతంపై తీసినది కావడం విశేషం. మూడేళ్ళు పట్టిన ఈ డాక్యుమెంటరీ కోసం చిత్రీకరణకు ముందు విస్తృతంగా పరిశోధన చేసినట్లు శ్వేతాబసు చెబుతున్నారు. ‘‘2011 మే నెలలో నాకు 20 ఏళ్ళ వయసులో ఈ డాక్యుమెంటరీ చిత్ర రూపకల్పన మొదలుపెట్టాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మొత్తం ప్రయాణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను’’ అని ఆమె అన్నారు. ఇటు కర్ణాటక సంగీతం, అటు హిందుస్థానీ సంగీతం - రెండూ ఇవాళ భారతీయ యువతరంలో ఏ మేరకు నిలిచాయన్న అంశం ఆధారంగా ఈ ‘రూట్స్’ తీశారు. ఇందులో విశాల్ భరద్వాజ్, ఏ.ఆర్. రెహమాన్, శుభా ముద్గల్, ఇమ్తియాజ్ అలీ, పండిట్ హరిప్రసాద్ చౌరసియా లాంటి సుప్రసిద్ధుల ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీని దేశవిదేశాల్లోని చలనచిత్రోత్సవాల్లోనే కాక, పాఠశాలలు, ఇతర విద్యా సంస్థల్లో సైతం ప్రదర్శించాలని భావిస్తున్నారు. మరి, ఈ ప్రయత్నంలోనైనా శ్వేతాబసు సక్సెస్ అవుతారా? -
హాట్ బేబీకి ఇప్పుడు టైం వచ్చింది
-
‘శివకేశవ్’ సినిమా స్టిల్స్