
ఎర్రమంజిల్ కోర్టుకు శ్వేతాబసు ప్రసాద్
హైదరాబాద్ : వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన వర్థమాన నటి శ్వతాబసు ప్రసాద్ను పోలీసులు సోమవారం ఎర్రమంజిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. నగరంలోని ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఆదివారం ఆమె పోలీసులకు పట్టబడిన విషయం తెలిసిందే. కాగా బంజారాహిల్స్లోని ఓ హోటల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా చేసిన దాడిలో శ్వేతాబసు ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బాలు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరిద్దర్ని పోలీసులు ఈరోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు. కాగా నటి శ్వేతబసు ప్రసాద్ను ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించాలని కోర్టు పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అలాగే బాలును చర్లపల్లి జైలుకు తరలించారు. పోలీసులు బాలును కస్టడీలోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అతడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.