అవును అతణ్ని ప్రేమిస్తున్నా.. | Actress Swetha Basu Prasad Secret Affair with Rohit Mittal | Sakshi
Sakshi News home page

అవును అతణ్ని ప్రేమిస్తున్నా..

Published Tue, Sep 27 2016 2:57 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

అవును అతణ్ని ప్రేమిస్తున్నా..

అవును అతణ్ని ప్రేమిస్తున్నా..

అవును నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. అని నటి శ్వేతాబసు స్పష్టం చేశారు. బహుభాషానటిగా శ్వేతాబసు గురించి చిత్ర పరిశ్రమలో తెలియని వారుండరు. తమిళంలో రారా, చందమామ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన ఈ భామ తెలుగు, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు పొందారు. ఇక ఆ మధ్య వ్యభిచార కేసులో పోలీసులకు పట్టుబడి పెద్ద కలకలం సృష్టించిన శ్వేతాబసు కోర్టు ఉత్తర్వులతో కొంత కాలం స్త్రీ సంక్షేమ ఆశ్రమంలో గడిపారు.
 
 అనంతరం బయటపడ్డ శ్వేతాబసు అవకాశాల వేటలో పడ్డారు. అయితే చాలా మంది అయ్యో పాపం అన్నారే కానీ అవకాశాలివ్వలేదు. దీంతో మీ సింపతీ నాకొద్దు అంటూ ముంబైకి మకాం మార్చిన ఈ అమ్మడు అక్కడ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద సహాయకురాలిగా చేరారు. ఆయనతో కథా చర్చల్లో పాల్గొంటున్న శ్వేతాబసుకు వారి కార్యాలయానికి వచ్చిన మరో దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో పరిచయం ప్రేమగా మారిందట.
 
 వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ప్రచారం హల్‌చల్ చేస్తున్నా పట్టించుకోని శ్వేత తాజాగా అవును నేను దర్శకుడు రోహిత్ మిట్టల్ ప్రేమించుకుంటున్నాం అని బహిరంగంగా వెల్లడించారు. గత రెండేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామనీ, ఒక కార్యక్రమంలో తనకు రోహిత్ పరిచయం అయ్యాడని అది ప్రేమకు దారి తీసిందని తెలిపారు. రెండేళ్లుగా తామిద్దరం ప్రేమలో సంతోషంగా ఉన్నామని, పెళ్లి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ శ్వేతాబసు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement