Rohit Mittal
-
మా స్నేహం కొనసాగుతూనే ఉంటుంది
నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2018 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు నటి శ్వేతా బసు ప్రసాద్, బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్. అయితే తొలి వివాహ వార్షికోత్సవం పూర్తికాక ముందే గత ఏడాది డిసెంబర్ 10న విడిపోతున్నట్లు ప్రకటించారు ఈ ఇద్దరూ. ఈ విషయం గురించి శ్వేత మాట్లాడుతూ – ‘‘విడిపోవాలనే నిర్ణయాన్ని పరస్పర అంగీకారంతోనే తీసుకున్నాం. ప్రస్తుతం నేను, రోహిత్ మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నాం. నా యాక్టింగ్ కెరీర్‌కి ఎప్పుడూ సపోర్ట్‌గా ఉన్నాడు. తను మంచి దర్శకుడు. భవిష్యత్తులో మేమిద్దరం కలసి సినిమా కూడా చేయొచ్చేమో. మేం కేవలం పెళ్లిని మాత్రమే ముగించాం. మా స్నేహం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’’ అన్నారు. మళ్లీ ప్రేమలో పడతారా? అనే ప్రశ్నకు – ‘‘మళ్లీ ప్రేమలో పడకూడదు లాంటి నిర్ణయాలేం తీసుకోలేదు. ప్రస్తుతం నా దృష్టంతా నా కెరీర్ మీదే ఉంది. ప్రేమ అనేది అనూహ్యంగా జరగాలి. అలా జరుగుతుందో లేదో చూద్దాం’’ అని బదులిచ్చారు. -
విడాకులపై పెదవి విప్పిన నటి శ్వేతాబసు
తెలుగులో 'కొత్త బంగారు లోకం' చిత్రంతో ప్రేక్షకుల మదిని దోచుకున్న నటి శ్వేతాబసు ప్రసాద్. ఆ తర్వాత అనేక సినిమాలు చేసినా అవేవీ ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే.. శ్వేతాబసు 2018లో రోహిత్ మిట్టల్ అనే డైరెక్టర్ని పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లయిన కొద్ది రోజులకే వారి వైవాహిక దాంపత్యంపై అనేక ఊహాగానాలు వెలువడగా.. తాజాగా ఈ విషయంపై శ్వేతాబసు క్లారిటీ ఇచ్చింది. మేం చట్టపరంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నాం కానీ.. భార్యాభర్తల కంటే ముందు నుంచి తాము మంచి స్నేహితులమని చెప్పింది. అతడు అద్భుతమైన దర్శకుడు. ఏదో ఒకరోజు మళ్లీ కలిసి పనిచేస్తామన్న నమ్మకముంది. మేం ఐదేళ్లుగా ఎంతో ప్రేమగా, ఆరోగ్యంగా నిజాయితీగా అనుబంధాన్ని కొనసాగించాం. రోహిత్, తాను పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకొని విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రతి పుస్తకాన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవలేమని, అంతమాత్రాన ఆ పుస్తకం చెడ్డది కాదని, తమ వైవాహిక జీవితం కూడా ఓ అసంపూర్ణ పుస్తకం లాంటిదేనని నిర్వేదం వెలిబుచ్చింది. విడిపోయినా తాము ఎప్పటికీ స్నేహితుల్లానే ఉంటామని శ్వేతా స్పష్టం చేసింది. (దారుణం: 17వ తేదీన పెళ్లి.. 18న గ్యాంగ్ రేప్) -
మేం విడిపోయాం
మరో రెండు రోజులు గడిస్తే తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిన సమయంలో నటి శ్వేతాబసు ప్రసాద్ జీవితంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. తన భర్త రోహిత్ మిట్టల్‌తో విడిపోతున్నట్లు ఆమె వెల్లడించారు. ‘‘రోహిత్‌తో నా వివాహ బంధం ముగిసింది. పరస్పర అంగీకారంతోనే మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ప్రతి పుస్తకాన్ని పూర్తిగా చదవాలనేం లేదు. అలా అని ఆ పుస్తకం మంచిది కాదని కాదు. మరొకరు చదవకూడదని కూడా కాదు. కొన్ని అలా అసంపూర్ణంగా మిగిలిపోతాయంతే. మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చి, ఇన్ని రోజులు నాకు స్ఫూర్తిగా నిలిచిన రోహిత్‌కు ధన్యవాదాలు. భవిష్యత్‌లో నీ (రోహిత్) జీవితం మరింత బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు శ్వేతాబసు ప్రసాద్. గత ఏడాది డిసెంబరు 13న రోహిత్ మిట్టల్‌ను శ్వేతాబసు ప్రసాద్ వివాహం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. -
పెళ్లి అయిన ఏడాదికే..
గతేడాది వివాహం చేసుకున్న ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. గతేడాది డిసెంబర్లో తన బాయ్‌ఫ్రెండ్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ‘రోహిత్ మిట్టల్, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా మా మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు మా ప్రయాణం చాలా సంతోషంగా సాగింది. ఒక పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవనంత మాత్రాన.. అది చెడ్డది కాదు. అలాగే కొన్ని విషయాలు అసంపూర్ణంగానే ఉండటం బాగుంటుంది. నేను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చినందుకు, ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలించినందుకు థ్యాంక్యూ రోహిత్’ అని శ్వేతా పేర్కొన్నారు. 2018 డిసెంబర్ 13న శ్వేతా, రోహిత్‌ల వివాహం పుణెలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. కాగా, మక్డీ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన శ్వేతా బసు.. ఆ తర్వాత టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. -
ముడిపడింది
నాలుగేళ్ల ప్రేమబంధాన్ని మూడు ముళ్లతో మరింత బలంగా మార్చుకున్నారు శ్వేతా బసు ప్రసాద్. డిసెంబర్ 13న తన బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకున్నారు. ఈ వేడుక పూణేలో జరిగింది. పెళ్లిలో బెంగాలీ పెళ్లి కూతురిలా రెడీ అయ్యారు శ్వేతా. రోహిత్ బ్లాక్ షేర్వాణీలో కనిపించారు. ఈ పెళ్లి ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు శ్వేతా. బాలీవుడ్లో పెళ్లిల ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఈ జంట ఒకటయ్యారు. శ్వేతాబసు, రోహిత్ శ్వేతాబసు -
ఘనంగా శ్వేతా బసు వివాహం
పుణె: ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్, ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌ల వివాహం గురువారం రాత్రి పుణెలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో పింక్ కలర్ సిల్క్ సారీలో శ్వేతా బసు మెరిసిపోయారు. అంతకు ముందు జరిగిన పెళ్లి వేడుకల్లో శ్వేతా బసు, రోహిత్ మిట్టల్‌ల కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్యాన్సులతో సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను శ్వేతా బసు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రోహిత్ కూడా ‘హో గయి’ అంటూ పెళ్లి ఫొటోను ఫెస్‌బుక్‌లో ఉంచారు. మక్డీ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించిన శ్వేతా బసు.. ఆ తర్వాత టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతా బసు.. పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on Dec 13, 2018 at 8:32am PST -
పెళ్లికళ వచ్చేసింది
సినిమా ఇండస్ట్రీలో ఏది జరిగినా ఒక ట్రెండ్‌లా నడుస్తుంటుంది. ఒక సినిమా హిట్ అయితే అలాంటి ఫార్ములాతో వరుసగా సినిమాలు వస్తుంటాయి. ఇప్పుడు బాలీవుడ్లో పెళ్లిళ్ల ట్రెండ్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్నే ‘దీప్‌వీర్’ (దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్) ఒక్కటయ్యారు. డిసెంబర్ 2న ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్) జో«ద్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నారు. పెళ్లి పనులన్నీ సక్రమంగా జరగాలని ముంబైలోని ప్రియాంకా చోప్రా నివాసంలో బుధవారం పూజ చేశారు. పెళ్లి పీటలెక్కనున్న ఈ జాబితాలోకి తాజాగా రాఖీ సావంత్, శ్వేతాబసు ప్రసాద్ చేరారు. శ్వేతాబసు ప్రసాద్ బాయ్‌ఫ్రెండ్, దర్శకుడు రోహిత్ మిట్టల్ జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 13న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని బాలీవుడ్ టాక్. మరోవైపు ఎప్పటికప్పుడు ఏదోఒక సెన్సేషన్తో వార్తల్లో నిలిచే రాఖీసావంత్ కూడా పెళ్లి కూతురు కాబోతున్నట్టు ప్రకటించారు. టెలివిజన్ యాక్టర్ దీపక్ కలాల్‌ను వివాహం చేసుకోబుతున్నట్టు సోషల్ మీడియాలో తెలిపారామె. డిసెంబర్ 31 సాయంత్రం 5: 55 నిమిషాలకు వీరి వివాహం లాస్ ఏంజెల్స్‌లో జరగనున్నట్టు పేర్కొన్నారు. ‘‘మేం ఒక్కటవ్వాలనుకుంటున్నాం. ఇండస్ట్రీలో చాలా మంది ఒక్కటవుతున్నారు. ఇదే రైట్ టైమ్ అనిపించింది. అందరి ఆశీర్వాదం మాకు కావాలి’’ అని రాఖీ సావంత్ బాలీవుడ్ మీడియాకు తెలిపారు. సో.. బాలీవుడ్‌కి పెళ్లికళ వచ్చేసిందన్నమాట. -
పెళ్లి పీటలెక్కనున్న శ్వేతా బసు ప్రసాద్
మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు నటి శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామ తర్వాత పూర్తిగా ముంబైకే పరిమితమయ్యారు. ప్రస్తుతం పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్వేతా బసు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఫిల్మ్‌మేకర్ రోహిత్ మిట్టల్‌ను శ్వేతా వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబరు 13న పుణెలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. పెళ్లి తర్వాత అదే వారంలో ముంబయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. మార్వాడీ, బెంగాలీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్వేత తన కాబోయే భర్త, స్నేహితులతో కలిసి ఇండోనేషియా, బాలీలో బ్యాచిలర్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలు, వీడియోలను శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. View this post on Instagram Let. The. Bachelorette. Begin! A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on Nov 25, 2018 at 4:26pm PST ఈ విషయం గురించి శ్వేతా స్నేహితురాలు మాట్లాడుతూ.. శ్వేతా, రోహిత్‌లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్లుగా వారు రిలేషన్లో ఉన్నారు. ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ బెస్ట్ కపూల్స్ మారబోతున్నారు. ఈ క్షణాల కోసం మేమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అబ్బాయిలే ముందు ప్రపోజ్ చేయాలనేది పాత మాట. ఇద్దరి మధ్య ఒకే రకమైన భావాలు ఉన్నప్పుడు ఎవరు ముందు ప్రపోజ్ చేశారనేది ముఖ్యం కాదు. శ్వేతానే ముందుగా ప్రపోజ్ చేసింది. గోవా వెళ్లినప్పుడు శ్వేత, రోహిత్‌కు ప్రపోజ్ చేసింది. తర్వాత రోహిత్ పూణెలో ఎస్ చెప్పాడు అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram I love cheap thrills! @rahul_prasad3 #bachelorette #bali 💃🏻 A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on Nov 27, 2018 at 6:54pm PST -
అవును.. నిజమే
‘కొత్తబంగారు లోకం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. అప్పట్లో ఆమె వరుసగా సినిమాలు చేసినా ఆ తర్వాత స్లో అయ్యారు. వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. ఇప్పుడు శ్వేతా గురించి బాలీవుడ్లో ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో శ్వేతా బసు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని, గతేడాదే వీళ్ల నిశ్చితార్థం జరిగిందన్నది ఆ న్యూస్. ఆ వార్తలకు శ్వేతాబసు స్పందిస్తూ ‘‘రోహిత్‌తో నా ఎంగేజ్మెంట్ జరిగిన మాట వాస్తవమే. మేం ఇద్దరం కూడా మా పర్శనల్ లైఫ్ ప్రైవేట్‌గా ఉండాలని కోరుకునేవాళ్లమే. అందుకే ఈ విషయం గురించి బయట మాట్లాడలేదు’’ అని పేర్కొన్నారామె. విశేషం ఏంటంటే... వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారట. తన దగ్గర స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా ఉన్న శ్వేతాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోహిత్‌కు పరిచయం చేసింది అనురాగ్ కశ్యపే అని సమాచారం. వీళ్ల లవ్స్టొరీలో మొదట గోవాలో రోహిత్‌కు శ్వేతా ప్రపోజ్ చేయగా, పూణేలో శ్వేతాకు రోహిత్ ప్రపోజ్ చేశారట. వచ్చే ఏడాదిలో వీళ్లిద్దరి పెళ్లి ఉండొచ్చని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్లో ‘ది తస్కెంట్ ఫైల్స్’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. -
పెళ్లి కథనాలపై శ్వేతా బసు క్లారిటీ
సాక్షి, ముంబై: పెళ్లి కథనాలపై నటి శ్వేతాబసు ప్రసాద్ ఎట్టకేలకు స్పందించారు. కొత్తబంగారు లోకం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఈ మధ్య గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వివాహంపై వస్తున్న పుకార్లపై పెదవి విప్పారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో గత నాలుగేళ్లుగా స్నేహంగా ఉంటున్న ఆమె.. అతన్నే వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ‘అబ్బాయిలే పెళ్లి ప్రస్తావన తెచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలతో ప్రేమను వ్యక్తం పరుస్తున్నారు. నేను రోహిత్‌కు గోవాలో ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత అతను పుణెలో నా ప్రేమను అంగీకరించాడు. ఇద్దరి ఇంట్లో ఒప్పుకొన్నారు. అయితే పెళ్లికి ఇప్పుడే తొందరేం లేదు. మా ఇద్దరి నిశ్చితార్థం జరిగినట్లు వస్తున్న కథనాలు నిజమే. కానీ, మా ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయాలు బయటికి చెప్పుకోవాలని అనుకోవడం లేదు’ అని శ్వేత తెలిపారు. బాలీవుడ్లో ఇక్బాల్ చిత్రంతో బాలనటిగా కెరీర్‌ను ప్రారంభించిన శ్వేత.. కొత్త బంగారు లోకంతో తెలుగువారికి చేరువయ్యారు. తర్వాత కళావర్ కింగ్, రైడ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం కాబోయే భర్తతో రూపొందిస్తున్న కొన్ని షార్ట్ ఫిలింస్‌లో, మరికొన్ని వెబ్ సిరీస్‌లతోపాటు బాలీవుడ్‌లోనూ ఓ పొలిటికల్ చిత్రంలోనూ నటిస్తున్నారు. -
అవును అతణ్ని ప్రేమిస్తున్నా..
అవును నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. అని నటి శ్వేతాబసు స్పష్టం చేశారు. బహుభాషానటిగా శ్వేతాబసు గురించి చిత్ర పరిశ్రమలో తెలియని వారుండరు. తమిళంలో రారా, చందమామ తదితర చిత్రాల్లో నాయకిగా నటించిన ఈ భామ తెలుగు, హిందీ చిత్రాల్లోనూ నటించి గుర్తింపు పొందారు. ఇక ఆ మధ్య వ్యభిచార కేసులో పోలీసులకు పట్టుబడి పెద్ద కలకలం సృష్టించిన శ్వేతాబసు కోర్టు ఉత్తర్వులతో కొంత కాలం స్త్రీ సంక్షేమ ఆశ్రమంలో గడిపారు. అనంతరం బయటపడ్డ శ్వేతాబసు అవకాశాల వేటలో పడ్డారు. అయితే చాలా మంది అయ్యో పాపం అన్నారే కానీ అవకాశాలివ్వలేదు. దీంతో మీ సింపతీ నాకొద్దు అంటూ ముంబైకి మకాం మార్చిన ఈ అమ్మడు అక్కడ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద సహాయకురాలిగా చేరారు. ఆయనతో కథా చర్చల్లో పాల్గొంటున్న శ్వేతాబసుకు వారి కార్యాలయానికి వచ్చిన మరో దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో పరిచయం ప్రేమగా మారిందట. వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ప్రచారం హల్చల్ చేస్తున్నా పట్టించుకోని శ్వేత తాజాగా అవును నేను దర్శకుడు రోహిత్ మిట్టల్ ప్రేమించుకుంటున్నాం అని బహిరంగంగా వెల్లడించారు. గత రెండేళ్లుగా తాము ప్రేమించుకుంటున్నామనీ, ఒక కార్యక్రమంలో తనకు రోహిత్ పరిచయం అయ్యాడని అది ప్రేమకు దారి తీసిందని తెలిపారు. రెండేళ్లుగా తామిద్దరం ప్రేమలో సంతోషంగా ఉన్నామని, పెళ్లి గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ శ్వేతాబసు పేర్కొన్నారు.