
శ్వేతా బసు ప్రసాద్
నాలుగేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2018 డిసెంబర్ 13న వివాహం చేసుకున్నారు నటి శ్వేతా బసు ప్రసాద్, బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్. అయితే తొలి వివాహ వార్షికోత్సవం పూర్తికాక ముందే గత ఏడాది డిసెంబర్ 10న విడిపోతున్నట్లు ప్రకటించారు ఈ ఇద్దరూ. ఈ విషయం గురించి శ్వేత మాట్లాడుతూ – ‘‘విడిపోవాలనే నిర్ణయాన్ని పరస్పర అంగీకారంతోనే తీసుకున్నాం. ప్రస్తుతం నేను, రోహిత్ మంచి ఫ్రెండ్స్‌లా ఉన్నాం.
నా యాక్టింగ్ కెరీర్‌కి ఎప్పుడూ సపోర్ట్‌గా ఉన్నాడు. తను మంచి దర్శకుడు. భవిష్యత్తులో మేమిద్దరం కలసి సినిమా కూడా చేయొచ్చేమో. మేం కేవలం పెళ్లిని మాత్రమే ముగించాం. మా స్నేహం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’’ అన్నారు. మళ్లీ ప్రేమలో పడతారా? అనే ప్రశ్నకు – ‘‘మళ్లీ ప్రేమలో పడకూడదు లాంటి నిర్ణయాలేం తీసుకోలేదు. ప్రస్తుతం నా దృష్టంతా నా కెరీర్ మీదే ఉంది. ప్రేమ అనేది అనూహ్యంగా జరగాలి. అలా జరుగుతుందో లేదో చూద్దాం’’ అని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment