పెళ్లి అయిన ఏడాదికే.. | Shweta Basu Announce Separation With Rohit Mittal | Sakshi
Sakshi News home page

వైవాహిక జీవితానికి ముగింపు పలికిన నటి

Published Tue, Dec 10 2019 11:40 AM | Last Updated on Tue, Dec 10 2019 2:28 PM

Shweta Basu Announce Separation With Rohit Mittal - Sakshi

గతేడాది వివాహం చేసుకున్న ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్‌ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో తన బాయ్‌ఫ్రెండ్‌ రోహిత్‌ మిట్టల్‌తో శ్వేతా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ‘రోహిత్‌ మిట్టల్‌, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా మా మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు మా ప్రయాణం చాలా సంతోషంగా సాగింది. ఒక పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవనంత మాత్రాన.. అది చెడ్డది కాదు. అలాగే కొన్ని విషయాలు అసంపూర్ణంగానే ఉండటం బాగుంటుంది. నేను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చినందుకు, ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలించినందుకు థ్యాంక్యూ రోహిత్‌’ అని శ్వేతా పేర్కొన్నారు.

2018 డిసెంబర్‌ 13న శ్వేతా, రోహిత్‌ల వివాహం పుణెలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. కాగా, మక్డీ చిత్రం ద్వారా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన శ్వేతా బసు.. ఆ తర్వాత  టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను  చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement