seperation
-
పెళ్లైన 19 ఏళ్లకు భర్తతో విడిపోయిన నటి
బుల్లితెర జంట శుభంగి ఆత్రే- పీయూశ్ పూరే విడిపోయారు. ఏడాది క్రితం విడిపోయిన వీరిద్దరూ అప్పటినుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ఇంతవరకు సీక్రెట్‌గా ఉన్న ఈ విషయాన్ని తాజాగా శుభంగి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. 'మేము కలిసి ఉండటం లేదు. పరస్పర గౌరవం, నమ్మకం, స్నేహం వంటివి బలమైన పెళ్లికి పునాదులు. మా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి మేము చాలావరకు ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ఒక ఏడాది నుంచే మేము సెపరేట్‌గా ఉంటున్నాం. మా మధ్య ఉన్న మనస్పర్థలు పరిష్కారం అయ్యేలా కనిపించలేదు. అందుకే ఎవరి జీవితాన్ని వారికే వదిలేయాలనుకున్నాం. కానీ ఇప్పటికీ ఇది నాకు కష్టంగా ఉంది. నేను కుటుంబమే ముఖ్యమనుకునేదాన్ని. మా కుటుంబాలు చుట్టూ ఉండాలనుకున్నాను. అయితే కొన్ని సమస్యలు చేయాల్సిన నష్టాన్ని చేసేశాయి. ఎన్నో ఏళ్లు కలిసి ఉన్న బంధాన్ని తెంచేసుకోవడమంటే ఎంత మానసిక క్షోభ ఉంటుందో చెప్పలేను. ప్రతికూలతలే మనకు గుణపాఠాలను నేర్పుతాయి. నేను తనకు దూరమైనంత మాత్రాన నా కూతురికి తండ్రి ప్రేమ దక్కకుండా చేయను. తనకు తల్లిదండ్రుల ప్రేమ కచ్చితంగా అవసరం. అందుకే పీయూశ్ ఆదివారాలు వచ్చి తనను కలుస్తుంటాడు' అని చెప్పుకొచ్చింది. కాగా నటి శుభంగి ఆత్రే 2006లో కసౌటీ జిందగీకే సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత కస్తూరి, చిడియా ఘర్, బాబ్జీ ఘర్ పర్ హైర్ వంటి సీరియల్స్‌లో నటించింది. శుభంగి 19 ఏళ్ల వయసులోనే డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తున్న పీయూశ్ను పెళ్లాడింది. 2003లో వీరి పెళ్లి జరగ్గా 2005లో అశి అనే కూతురు జన్మించింది. -
తెలంగాణలో 67,820 ఉద్యోగ ఖాళీలు.. విభజన పూర్తయ్యేది ఎప్పుడో?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ఇంకొన్నాళ్లు సమయం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనవరి 1న నూతన సంవత్సర కానుకగా ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నా.. అది ఇంత త్వరగా సాధ్యమవుతుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నోటిఫికేషన్లను జనవరిలో ఇవ్వాలంటే డిసెంబరు 20లోగా కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఉద్యోగుల కేటాయింపునకు చాలా సమయం పడుతుందని ఉద్యోగ సం ఘాల నేతలు పేర్కొంటున్నారు. అందుకే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి ఇంకొన్నాళ్లు పడుతుందని చెబుతున్నారు. దీంతో అప్పటివరకు రాష్ట్రంలోని 8 లక్షల మంది నిరుద్యోగులకు ఎదురుచూపులు తప్పేలా లేవు. వివరాల సేకరణ ఏ పోస్టులు ఏ కేటగిరీలోకి వస్తాయన్న వర్గీకరణను పూర్తి చేసిన ప్రభుత్వం వివిధ శాఖల్లోని పోస్టుల వివరాలనూ సేకరించింది. శాఖల వారీగా మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారు, ఖాళీల వివరాలను తీసుకుంది. ఒక్క పాఠశాల విద్యాశాఖ మినహా మిగతా శాఖల వివరాల సేకరణ ఇదివరకే పూర్తికాగా.. ఇప్పుడు ఆ శాఖ లెక్క కూడా తేలింది. ఆర్థిక శాఖ క్షేత్రస్థాయి నుంచి సేకరించిన లెక్కల ప్రకారం 67,820 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆగస్టులో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌కు నివేదించింది. మరోసారి వాటిని పరిశీలించే ప్రక్రియను చేపట్టారు. అది పూర్తయితే ఈ వారంలోనే వివిధ శాఖల్లో ఖాళీలపై పూర్తిస్థాయి స్పష్టత రానుంది. ఆ తర్వాత అంటే వచ్చే నెల్లో ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమవుతుంది. వీలైతే ఈ నెలలోనే ఆ ప్రక్రియను పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు ఆర్డర్ టు సర్వ్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను కొత్త జిల్లాల ప్రకా రం కేటాయించడం, అందుకోసం వారికి ఆప్షన్లు ఇచ్చే ప్రక్రియను వచ్చే నెలలో చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆప్షన్లకు అందుబాటులో అన్ని పోస్టులు ఉద్యోగులు పనిచేస్తున్న పోస్టులు మాత్రమే కాకుండా శాఖల వారీగా మంజూరైన పోస్టులన్నింటినీ ఆప్షన్లకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగ సంఘాలు కూడా అదే డిమాండ్ చేశాయి. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్ల ప్రకారం వాటిని కేటాయించాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రాథమిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. సంబంధిత జిల్లా, జోన్, మల్టీ జోన్‌లోని పోస్టులను స్థానికత ఆధారంగా కేటాయిస్తారు. ఒకవేళ ఎక్కువ మంది ఆప్షన్లు ఇస్తే సీనియర్లకు ఇస్తారు. ఇందులోనూ వికలాంగులు, వితంతువులు, కేన్సర్/కిడ్నీ వ్యాధిగ్రస్తులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్న వారు, జీహెచ్ఎంసీ మినహా మిగతా ప్రాంతాల్లో స్పౌజ్ (కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు), గుర్తింపు పొందిన సంఘాల వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ ప్రక్రియను డిసెంబరులోగా పూర్తి చేస్తే ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి మార్గం సుగమం అవుతుంది. విద్యాశాఖలో... రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ పోస్టుల లెక్క తేలింది. ఇక జిల్లాల వారీగా విభజన చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరు ఏ జిల్లా పరిధిలోకి వస్తారనేది ధ్రువీకరిస్తారు. ఉమ్మడి జిల్లాల లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1.22 లక్షలు. అయితే చాలామంది పదవీ విరమణ, ఇతర కారణాల వల్ల వెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం విద్యాశాఖలో వివిధ కేడర్లలో 18,927 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. అయితే వీటిలో 12,225 పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అంటున్నారు. త్వరలోనే సీఎం సమావేశం.. ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ త్వరలోనే సమావేశం నిర్వహించే అవకాశముంది. కొత్త జిల్లాలకు శాశ్వత కేటాయింపులు చేపట్టేందుకు మార్గదర్శకాలపై చర్చిస్తారు. ఈ నెలాఖరులో సమావేశం జరిగే అవకాశం ఉంది. – రాజేందర్, టీఎన్జీవో, రాష్ట్ర అధ్యక్షుడు ఆయా శాఖల్లో భర్తీ చేసే అవకాశం ఉన్న పోస్టులు స్కూల్ అసిస్టెంట్–1,694, లాంగ్వేజ్ పండిట్–1,211, పీఈటీ–458, ఎస్జీటీ–8,862, హోంశాఖ–21,507, ఉన్నత విద్య–3,825, గిరిజన సంక్షేమం–1,700, వైద్యారోగ్యశాఖ– 10,048, బీసీ సంక్షేమం–3,538, ఎస్సీ సంక్షేమం–1,967, రెవెన్యూ–1,441, మైనారి టీ సంక్షేమం–1,437, గ్రామీణాభివృద్ధి– 1391, నీటి పారుదల–1,222, పురపాలక శాఖ–1,148, అటవీశాఖ–1,096, కార్మిక శాఖ–980, వ్యవసాయ శాఖ–742, పశుసంవర్థకశాఖ– 628, రోడ్లు భవనాలు, రవాణా– 492, పరిశ్రమలు–292, ఆర్థికశాఖ–838, స్త్రీ శిశుసంక్షేమం–800, జీఏడీ– 220, సాంస్కృతిక, పర్యాటక–69, ప్లానింగ్–65, పౌర సరఫరాలు–48, శాసనసభ–38, ఇంధన శాఖ–33, న్యాయ శాఖ–26, ఐటీ శాఖ– 4. -
భర్తతో విడిపోవడంపై టీఎంసీ ఎంపీ నుస్రత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కోల్కత్తా: ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ తన భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోవడంపై వస్తోన్న వార్తలపై తన మౌనానికి స్వస్తి పలికారు. నిఖిల్ జైన్‌తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఈ వివాహం భారత్‌లో చెల్లదని తన ప్రకటనలో తెలిపారు. తనకు సంబంధించిన ఆభరణాలు, ఇతర వస్తువులు అక్రమంగా నిఖిల్ జైన్ కుటుంబ సభ్యులు లాగేసుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తనకు చెందిన ఆస్తుల విషయంలో తన అభిప్రాయం తీసుకోకుండా తరలించారని వెల్లడించారు. ‘భారత చట్టాల ప్రకారం నాకు జరిగిన వివాహం ఇండియాలో చెల్లుబాటు కాదు. నిఖిల్ జైన్‌తో జరిగిన మతాంతర వివాహానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ధ్రువీకరణ ఉండాలి. నిఖిల్ నుంచి చాలా కాలం క్రితమే విడిపోయినా, భారత చట్టాల ప్రకారం విడాకులు తీసుకునే ప్రశ్న తలెత్తదు’ అని నుస్రత్ పేర్కొన్నారు. ఎవరి డబ్బుపై వ్యామోహం లేదని, తన సొంత ఖర్చులతోనే కుటుంబ పోషణ చేస్తున్నానని నుస్రత్ తెలిపారు. వారి అవసరాల కోసం తన పేరును, డబ్బును వాడుకున్నారని ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించే అవసరం ఎవరికి లేదని నుస్రత్ జహాన్ స్పష్టం చేశారు. చదవండి: టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్ చేసిన బీజేపీ -
ఇక జస్టిస్ ధర్మాధికారిదే నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యుత్ సంస్థలతో జస్టిస్ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిషన్ ఏడాదిగా జరుపుతున్న మధ్యవర్తిత్వం ముగిసింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ధర్మాధికారి ఆదివారం రెండో రోజు నిర్వహించిన సమావేశంలో సైతం 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీ స్థానికత కలిగి ఉన్నారన్న కారణంతో తెలంగాణ విద్యుత్ సంస్థలు 2015 జూన్‌లో 1,157 మంది ఉద్యోగులను ఏకపక్షంగా ఏపీకి రిలీవ్ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. దీంతో ఉద్యోగుల విభజన కోసం ఉద్యోగులందరి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని గతంలో ధర్మాధికారి మార్గదర్శకాలు జారీ చేశారు. రిలీవైన 1,157 మంది ఉద్యోగుల్లో 613 మంది ఏపీకి, 504 తెలంగాణకు ఆప్షన్లు ఇవ్వగా.. మిగిలినవారు ఏ రాష్ట్రానికీ ఆప్షన్లు ఇవ్వలేదు. ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 256 మంది తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చారు. ఏపీకి ఆప్షన్లు ఇచ్చిన 613 మందిని ఏపీ విద్యుత్ సంస్థలు తీసుకుంటే, తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 256 మందిలో సగంమందిని తీసుకుంటామని తెలంగాణ విద్యుత్ సంస్థలు ఆదివారం సమావేశంలో ఆఫర్ ఇచ్చాయి. దీనిని ఏపీ విద్యుత్ సంస్థలు తిరస్కరించాయి. దీంతో మధ్యవర్తిత్వపు ప్రక్రియ ముగిసిందని, తానే తుది నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకు నివేదిస్తానని పేర్కొంటూ జస్టిస్ ధర్మాధికారి సమావేశాన్ని ముగించారు. 2018 నవంబర్ 28న సుప్రీంకోర్టు ధర్మాధికారి కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మెట్టు దిగినా..: రిలీవైన 1,157 మందిలో తెలంగాణకు ఆప్షన్లు ఇచ్చిన 504 మందితోపాటు ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు ఆప్షన్లు ఇచ్చిన 256లో సగం మందిని తీసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలంగాణ విద్యుత్ జేఏసీ నేతలు శివాజీ, అంజయ్యలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి తోడు నాలుగేళ్ల కింద ఏపీ నుంచి 242 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థలు చేర్చుకున్నాయన్నారు. దీంతో మొత్తం 874 మంది ఉద్యోగులను తీసుకునేందుకు తెలంగాణ సంసిద్ధత వ్యక్తం చేయగా, 613 మందిని తీసుకోవడానికి ఏపీ అంగీకరించలేదని ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ సంస్థలు మెట్టు కిందికి దిగినా, ఏపీ విద్యుత్ సంస్థలు మొండికేశాయని విమర్శించారు. -
పెళ్లి అయిన ఏడాదికే..
గతేడాది వివాహం చేసుకున్న ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె అభిమానులతో పంచుకున్నారు. గతేడాది డిసెంబర్లో తన బాయ్‌ఫ్రెండ్ రోహిత్ మిట్టల్‌తో శ్వేతా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ‘రోహిత్ మిట్టల్, నేను మా వివాహ బంధానికి ముగింపు పలకాలనే నిర్ణయానికి వచ్చాం. కొన్ని నెలలుగా మా మధ్య విబేధాలు చోటుచేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అంతకుముందు మా ప్రయాణం చాలా సంతోషంగా సాగింది. ఒక పుస్తకాన్ని మొదటి నుంచి చివరి వరకు చదవనంత మాత్రాన.. అది చెడ్డది కాదు. అలాగే కొన్ని విషయాలు అసంపూర్ణంగానే ఉండటం బాగుంటుంది. నేను మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు ఇచ్చినందుకు, ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలించినందుకు థ్యాంక్యూ రోహిత్’ అని శ్వేతా పేర్కొన్నారు. 2018 డిసెంబర్ 13న శ్వేతా, రోహిత్‌ల వివాహం పుణెలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. కాగా, మక్డీ చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన శ్వేతా బసు.. ఆ తర్వాత టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. -
ట్రంప్‌పై బ్రాడ్ పిట్‌కు చిర్రెత్తుకొచ్చింది..
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్‌కు అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై చిర్రెత్తుకొచ్చింది. ముఖ్యంగా ట్రంప్ వేర్పాటువాద ఆలోచనలపై ఈ ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ మండిపడ్డారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'అసలు ట్రంప్ ఏమనుకుంటున్నారు. మన దేశాన్ని వెనక్కి తీసుకెళ్లాలనుకుంటున్నారా? ఇది ఎక్కడికి వెళుతోంది? అంటూ ట్రంప్ వేర్పాటువాద ప్రకటనలపై బ్రాడ్ పిట్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా ఇరుగుపొరుగుగా మారిపోయిందని, ఈ సమయంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలన్నారు. ట్రంప్ విధానాలు ఒంటరి, వేర్పాటువాద ఆలోచనల వైపు ఉన్నాయన్నారు. ట్రంప్ మద్దతుదారులు అన్నింటికీ వ్యతిరేకంగా పోరాడుతున్నారని బ్రాడ్ పిట్ విమర్శించారు. యూరప్ నుంచి బ్రిటన్ విడిపోతుందని(బ్రెగ్జిట్) తాను అనుకోలేదని బ్రాడ్ పిట్ తెలిపారు. అందరినీ కలిపేది మంచిదని.. విడగొట్టేది చెడ్డదని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అవుతాడని తాను భావించడం లేదన్నారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో మెక్సికో సరిహద్దులో గోడ కడతానని, వలసదారులను వెనక్కి పంపుతానని, ముస్లింలను అమెరికాలోకి రానివ్వొద్దంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
క్షేమంగా వెళ్ళి.. లాభంగా రండి..!
-
బ్రిటన్‌లో విభజన చిచ్చు!
-
సీమాంధ్ర నేతల తీరుపై హిజ్రాల నిరసన