![TV Actress Shubhangi Atre Confirms Separation from Husband Piyush Poorey - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/9/TV%20Actress%20Shubhangi%20Atre%20001.jpg.webp?itok=RRMRB3HP)
బుల్లితెర జంట శుభంగి ఆత్రే- పీయూశ్ పూరే విడిపోయారు. ఏడాది క్రితం విడిపోయిన వీరిద్దరూ అప్పటినుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ఇంతవరకు సీక్రెట్‌గా ఉన్న ఈ విషయాన్ని తాజాగా శుభంగి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. 'మేము కలిసి ఉండటం లేదు. పరస్పర గౌరవం, నమ్మకం, స్నేహం వంటివి బలమైన పెళ్లికి పునాదులు. మా వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి మేము చాలావరకు ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ఒక ఏడాది నుంచే మేము సెపరేట్‌గా ఉంటున్నాం.
మా మధ్య ఉన్న మనస్పర్థలు పరిష్కారం అయ్యేలా కనిపించలేదు. అందుకే ఎవరి జీవితాన్ని వారికే వదిలేయాలనుకున్నాం. కానీ ఇప్పటికీ ఇది నాకు కష్టంగా ఉంది. నేను కుటుంబమే ముఖ్యమనుకునేదాన్ని. మా కుటుంబాలు చుట్టూ ఉండాలనుకున్నాను. అయితే కొన్ని సమస్యలు చేయాల్సిన నష్టాన్ని చేసేశాయి. ఎన్నో ఏళ్లు కలిసి ఉన్న బంధాన్ని తెంచేసుకోవడమంటే ఎంత మానసిక క్షోభ ఉంటుందో చెప్పలేను. ప్రతికూలతలే మనకు గుణపాఠాలను నేర్పుతాయి.
నేను తనకు దూరమైనంత మాత్రాన నా కూతురికి తండ్రి ప్రేమ దక్కకుండా చేయను. తనకు తల్లిదండ్రుల ప్రేమ కచ్చితంగా అవసరం. అందుకే పీయూశ్ ఆదివారాలు వచ్చి తనను కలుస్తుంటాడు' అని చెప్పుకొచ్చింది. కాగా నటి శుభంగి ఆత్రే 2006లో కసౌటీ జిందగీకే సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత కస్తూరి, చిడియా ఘర్, బాబ్జీ ఘర్ పర్ హైర్ వంటి సీరియల్స్‌లో నటించింది. శుభంగి 19 ఏళ్ల వయసులోనే డిజిటల్ మార్కెటింగ్‌లో పని చేస్తున్న పీయూశ్‌ను పెళ్లాడింది. 2003లో వీరి పెళ్లి జరగ్గా 2005లో అశి అనే కూతురు జన్మించింది.
Comments
Please login to add a commentAdd a comment