
మరో రెండు రోజులు గడిస్తే తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిన సమయంలో నటి శ్వేతాబసు ప్రసాద్ జీవితంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. తన భర్త రోహిత్ మిట్టల్‌తో విడిపోతున్నట్లు ఆమె వెల్లడించారు. ‘‘రోహిత్‌తో నా వివాహ బంధం ముగిసింది. పరస్పర అంగీకారంతోనే మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ప్రతి పుస్తకాన్ని పూర్తిగా చదవాలనేం లేదు. అలా అని ఆ పుస్తకం మంచిది కాదని కాదు. మరొకరు చదవకూడదని కూడా కాదు. కొన్ని అలా అసంపూర్ణంగా మిగిలిపోతాయంతే. మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చి, ఇన్ని రోజులు నాకు స్ఫూర్తిగా నిలిచిన రోహిత్‌కు ధన్యవాదాలు. భవిష్యత్‌లో నీ (రోహిత్) జీవితం మరింత బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు శ్వేతాబసు ప్రసాద్. గత ఏడాది డిసెంబరు 13న రోహిత్ మిట్టల్‌ను శ్వేతాబసు ప్రసాద్ వివాహం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment