Shwetabasu Prasad
-
మేం విడిపోయాం
మరో రెండు రోజులు గడిస్తే తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవాల్సిన సమయంలో నటి శ్వేతాబసు ప్రసాద్ జీవితంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. తన భర్త రోహిత్ మిట్టల్‌తో విడిపోతున్నట్లు ఆమె వెల్లడించారు. ‘‘రోహిత్‌తో నా వివాహ బంధం ముగిసింది. పరస్పర అంగీకారంతోనే మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ప్రతి పుస్తకాన్ని పూర్తిగా చదవాలనేం లేదు. అలా అని ఆ పుస్తకం మంచిది కాదని కాదు. మరొకరు చదవకూడదని కూడా కాదు. కొన్ని అలా అసంపూర్ణంగా మిగిలిపోతాయంతే. మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చి, ఇన్ని రోజులు నాకు స్ఫూర్తిగా నిలిచిన రోహిత్‌కు ధన్యవాదాలు. భవిష్యత్‌లో నీ (రోహిత్) జీవితం మరింత బాగుండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు శ్వేతాబసు ప్రసాద్. గత ఏడాది డిసెంబరు 13న రోహిత్ మిట్టల్‌ను శ్వేతాబసు ప్రసాద్ వివాహం చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. -
అవును.. నిజమే
‘కొత్తబంగారు లోకం’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్. అప్పట్లో ఆమె వరుసగా సినిమాలు చేసినా ఆ తర్వాత స్లో అయ్యారు. వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. ఇప్పుడు శ్వేతా గురించి బాలీవుడ్లో ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌తో శ్వేతా బసు నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నారని, గతేడాదే వీళ్ల నిశ్చితార్థం జరిగిందన్నది ఆ న్యూస్. ఆ వార్తలకు శ్వేతాబసు స్పందిస్తూ ‘‘రోహిత్‌తో నా ఎంగేజ్మెంట్ జరిగిన మాట వాస్తవమే. మేం ఇద్దరం కూడా మా పర్శనల్ లైఫ్ ప్రైవేట్‌గా ఉండాలని కోరుకునేవాళ్లమే. అందుకే ఈ విషయం గురించి బయట మాట్లాడలేదు’’ అని పేర్కొన్నారామె. విశేషం ఏంటంటే... వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారట. తన దగ్గర స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా ఉన్న శ్వేతాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న రోహిత్‌కు పరిచయం చేసింది అనురాగ్ కశ్యపే అని సమాచారం. వీళ్ల లవ్స్టొరీలో మొదట గోవాలో రోహిత్‌కు శ్వేతా ప్రపోజ్ చేయగా, పూణేలో శ్వేతాకు రోహిత్ ప్రపోజ్ చేశారట. వచ్చే ఏడాదిలో వీళ్లిద్దరి పెళ్లి ఉండొచ్చని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్లో ‘ది తస్కెంట్ ఫైల్స్’ అనే పొలిటికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. -
బస్ మిస్సింగ్..!
కొత్త జీవితాలను ప్రారంభించాలనుకున్న ప్రేమికులు, మరదలి కోసం వెతుకుతున్న బావ, ఎంజాయ్ చేసేందుకు టూర్‌కు వెళ్తున్న దంపతులు ఇలా ప్రతి ఒక్కరిది ఒక్కో కథ. ఈ అందరూ సువర్ణసుందరి టూర్ బస్‌లో ప్రయాణం చేస్తుంటారు. సడన్‌గా ఆ బస్సు మాయమౌతుంది. ప్రయాణికులను కిడ్నాప్ చేసింది ఎవరు? కిడ్నాపర్ల డిమాండ్స్ ఏంటి? ప్రయాణికులు ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కారు..? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మిక్సర్ పొట్లం’. శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్రలో ఎంవి సతీష్‌కుమార్ దర్శకత్వంలో భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా గోదావరి సినీటోన్ పతాకంపై కలపటపు శ్రీ లక్ష్మీప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు, సంయుక్తంగా నిర్మించారు. గీతాంజలి కథానాయిక. సుమన్, భానుచందర్ నటించారు. మే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు మా చిత్రాన్ని రెండు ఏరియాల్లో రిలీజ్ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సతీష్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి వచ్చి ‘మిక్చర్ పొట్లం’ సినిమాను నిర్మించాం. మాధవపెద్ది సురేష్ మంచి సంగీతం అందించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు.