ఘనంగా శ్వేతా బసు వివాహం | Shweta Basu Prasad Married Rohit Mittal | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 14 2018 12:29 PM | Last Updated on Fri, Dec 14 2018 12:38 PM

Shweta Basu Prasad Married Rohit Mittal - Sakshi

పుణె: ప్రముఖ నటి శ్వేతా బసు ప్రసాద్‌, ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ల వివాహం గురువారం రాత్రి పుణెలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతోపాటు, పలువురు సన్నిహితులు హాజరయ్యారు. బెంగాలీ సంప్రదాయంలో జరిగిన పెళ్లి వేడుకలో పింక్‌ కలర్‌ సిల్క్‌ సారీలో శ్వేతా బసు మెరిసిపోయారు. అంతకు ముందు జరిగిన పెళ్లి వేడుకల్లో శ్వేతా బసు, రోహిత్‌ మిట్టల్‌ల కుటుంబ సభ్యులు, స్నేహితులు డ్యాన్సులతో సందడి చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను శ్వేతా బసు తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. రోహిత్‌ కూడా ‘హో గయి’ అంటూ పెళ్లి ఫొటోను ఫెస్‌బుక్‌లో ఉంచారు.

మక్డీ చిత్రం ద్వారా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో తొలి సినిమాతోనే సంచలనాలు సృష్టించిన శ్వేతా బసు.. ఆ తర్వాత  టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతా బసు.. పలు టీవీ సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement