17 ఏళ్లకే హీరోయిన్.. తెలుగులో ఫస్ట్ మూవీనే బ్లాక్‌బస్టర్.. ఈమెని గుర్తుపట్టారా? | Kotha Bagaaru Lokam Movie Actress Swetha Basu Prasad Full Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: ఒకే ఒక్క వివాదం.. ఈమె కెరీర్‌నే మొత్తంగా దెబ్బతీసింది!

Published Tue, Dec 12 2023 9:16 PM | Last Updated on Wed, Dec 13 2023 7:15 AM

Kotha Bagaaru Lokam Movie Actress Swetha Basu Prasad Full Details - Sakshi

ఈమె స్వతహాగా చైల‍్డ్ ఆర్టిస్ట్. కట్ చేస్తే టీనేజ్‌లోకి వచ్చేసరికి హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ ఫస్ట్ తెలుగు మూవీతోనే ఎంట్రీ ఇచ్చింది. ఈమె లక్ ఏంటో గానీ ఏకంగా బ్లాక్‌బస్టర్ కొట్టేసింది. దీంతో ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ సినిమాల సంగతి అటుంచితే ఘోరమైన కాంట్రవర్సీలో ఈమె ఇరుక్కుంది. ఆల్మోస్ట్ కెరీర్ మటాష్ అయిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు శ్వేతబసు ప్రసాద్. హా.. అవును మీరు ఊహించింది కరెక్టే. 'కొత్తబంగారు లోకం' మూవీతో 2008లో సెన్సేషన్ సృష్టించిన బ్యూటీనే ఈమె. జార్ఖండ్‌లోని జంషెడ్‌పుర్‌లో పుట్టిన ఈ భామ.. చిన్నతనంలో ఫ్యామిలీతో కలిసి ముంబయి వచ్చేసింది. ఈమె పేరు శ్వేత మాత్రమే. తల్లి పేరులోని బసు, తండ్రి పేరులోని ప్రసాద్‌ని తన పేరుకి యాడ్ చేసుకుంది. దీంతో శ్వేతబసు ప్రసాద్ అయింది.

(ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!)

2002లోనే 'మక్దీ' అనే హిందీ మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన శ్వేత.. ఆ తర్వాత మరో రెండు మూడు చిత్రాల్లో నటించింది. 2008లో బెంగాలీలో 'ఏక్ నదిర్ గల్పో', తెలుగులో 'కొత్త బంగారు లోకం' సినిమాలతో హీరోయిన్ అయిపోయింది. అనంతరం తెలుగు-తమిళ భాషల్లో దాదాపు ఆరేళ్లు పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. పెద్దగా కలిసి రాలేదు. దీంతో బాలీవుడ్‌కి షిప్ట్ అయిపోయింది. 

అయితే కొన్నేళ్ల క్రితం ఓసారి హోటల్‌లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. దీంతో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయిపోయింది. ఈ సంఘటన వల్ల ఈమె కెరీర్ కాస్త దెబ్బతింది. ఇకపోతే 2018లో రోహిత్ మిట్టల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ సరిగ్గా ఏడాదిలోనే అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉంటూ ఓటీటీలో మూవీస్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తోంది. సో అదన్నమాట విషయం.

(ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement