బుల్లితెరకు ప్రియమణి! | Television film! | Sakshi
Sakshi News home page

బుల్లితెరకు ప్రియమణి!

Published Mon, Mar 24 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM

బుల్లితెరకు ప్రియమణి!

బుల్లితెరకు ప్రియమణి!

వెండితెరకు దీటుగా.. ఆ మాటకొస్తే ఓ మెట్టుపైనే బుల్లితెర తన హవా కొనసాగిస్తుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. టీవీ ఆకర్షణశక్తి వల్ల చాలామంది థియేటర్లకు రావడానికి ఇష్టపడటంలేదు. ఆ విధంగా ఇంటిల్లిపాదినీ అక్కున చేర్చుకుంది కాబట్టే, సినిమా తారలు బుల్లితెరపై దృష్టి సారిస్తున్నారు. ఒకప్పుడు సినిమా రంగం నుంచి ఎవరైనా బుల్లితెరకు వస్తే, ‘అవకాశాలు లేక’ వచ్చారనుకునేవాళ్లు.


ఇప్పుడు మాత్రం సినిమాలు చేసుకుంటూనే హాయిగా టీవీ షోస్ చేస్తున్నారు. ఇటీవల నాగార్జున సైతం ఓ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించాలనే ఆలోచన ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రియమణి కూడా బుల్లితెర వైపు మొగ్గు చూపారు. ‘మళవిల్ మనోరమ’ అనే మలయాళ చానల్‌లో ప్రసారం కానున్న ఓ డాన్స్ బేస్డ్ రియాల్టీ షోకి న్యాయ నిర్ణేతగా  వ్యవహరించడానికి ప్రియమణి అంగీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement