
ఫిజికల్ సైన్‌స టెట్+డీఎస్సీ పేపర్-2
గ్రహాల మధ్య దూరాన్ని కొలిచేందుకు ఉపయోగపడేది? 1) సర్వే గొలుసు 2) పెద్ద టేపు 3) దూరదర్శిని 4) త్రిభుజీకరణ పద్ధతి
1. గ్రహాల మధ్య దూరాన్ని కొలిచేందుకు ఉపయోగపడేది?
1) సర్వే గొలుసు 2) పెద్ద టేపు
3) దూరదర్శిని 4) త్రిభుజీకరణ పద్ధతి
2. విమానాల ఎత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం?
1) బ్రామాప్రెస్ 2) భారమితి
3) అనార్థ్ర భారమితి 4) ఆల్టీమీటర్
3. దేశంలో తొలి కృత్రిమ ఉపగ్రహం?
1) ఆర్యభట్ట 2) రోహిణి
3) ఇన్‌శాట్-1ఏ 4) ఆపిల్
4. థర్మోస్కోప్ పనిచేయడంలో ఇమిడి ఉన్న ఉష్ణ ప్రక్రియ?
1) ఉష్ణ వహనం 2) ఉష్ణ సంవహనం
3) ఉష్ణ వ్యాకోచం 4) ఉష్ణ వికిరణం
5. రోడ్డు రోలర్ ఏ స్థితిలో ఉంటుంది?
1) స్థిర నిశ్చల 2) అస్థిర నిశ్చల
3) తటస్థ నిశ్చల 4) ఏదీకాదు
6. విద్యుదయస్కాంతాలను తయారు చేయడానికి వాడే పదార్థం?
1) ఉక్కు 2) కోబాల్ట్
3) మెత్తని ఇనుము 4) నికెల్
7. టెలివిజన్ ఏ సూత్రం ఆధారంగా పని చేస్తుంది?
1) కాంతి 2) కాంతి విద్యుత్ ఫలితం
3) విద్యుత్ 4) ధ్వని
8. ప్లగ్- కీ సంకేతం?
1) 2)
3) 4)
9. CuO + H2 ® Cu + H2O చర్యలో క్షయకరిణి?
1) CuO 2) Cu
3) H2O 4) H2
10. నూనెల హైడ్రోజనీకరణంలోఉపయోగించే ఉత్ప్రేరకం?
1) Fe 2) Co 3) Ni 4) Pt
11. పరమాణు సంఖ్య 19 ఉన్న మూలకం లాటిన్ పేరు?
1) కాలియం 2) కాల్షియం
3) పొటాష్ 4) నేట్రియం
12. ఆమ్ల, క్షార పదార్థాలను గుర్తించడానికి ఉపయోగించేవి?
1) లిట్మస్ పేపర్‌స 2) రసాయన సూచికలు
3) PH పేపర్‌స 4) పైవన్నీ
13. బ్లాక్‌హోల్స్‌పై పరిశోధన జరిపి నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త?
1) సి.వి.రామన్
2) సుబ్రహ్మణ్య చంద్రశేఖర్
3) ఐన్‌స్టీన్ 4) ఫారడే
14. సత్యాన్వేషణలో శాస్త్రీయ పద్ధతిని ఉపయో గించడం వల్ల విద్యార్థిలో పెంపొందే విలువ?
1) బౌద్ధిక 2) నైతిక
3) క్రమశిక్షణ 4) సౌందర్యాత్మక
15. పోలికలను తెలపడం, వివరించడం, తర్జుమా చేయడం వంటి లక్షణాలు?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) విశ్లేషణ
16. {పకల్పనా పద్ధతి విజయవంతం కావాలంటే ఏది కావాలి?
1) మంచి ప్రాజెక్టు
2) మూల్యాంకనం చేయడం
3) పరిస్థితిని కల్పించడం
4) ప్రణాళిక
17. సంచార ప్రయోగశాలను రూపొందించింది?
1) UNICEF 2) UNESCO
3) NCERT 4) SCERT
18. ఒక ఉపాధ్యాయుడు ఒక వారం బోధించిన తర్వాత విద్యార్థికి అసైన్‌మెంట్ నిర్వహిం చడాన్ని ఏమంటారు?
1) సామర్థ్య పరీక్ష 2) సాధనా పరీక్ష
3) ప్రక్షేపక పద్ధతి 4) అభిరుచి శోధికలు
19. కింది వాటిలో ఉత్పన్న రాశి?
1) పొడవు 2) వైశాల్యం
3) ద్రవ్యరాశి 4) కాలం
20. క్యాన్సర్ వ్యాధికి కారణమయ్యే కాలుష్య పదార్థం?
1) CO2 2) SO2
3) స్ట్రాన్షియం 90 4) ఫ్లోరో కార్బన్‌స
21. హేలీ తోకచుక్క ఎన్నేళ్లకోసారి కనిపిస్తుంది?
1) 76 2) 86 3) 100 4) 12
22. ఏటవాలు దర్పణాల మధ్య కోణం 45ని అయితే ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య?
1) 3 2) 7 3) 5 4) 11
23. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత?
1) 98.4°F 2) 36.9°C
3) 100°C 4) 1, 2
24. {దవాల విశిష్ట సాంద్రతను కొలిచేందుకు ఉపయోగించే పరికరం?
1) బారోమీటర్ 2) లాక్టోమీటర్
3) హైగ్రోమీటర్ 4) హైడ్రోమీటర్
25. బైక్రోమేట్ ఘటంలో విద్యుత్ ప్రేరక ద్రవం?
1) సజల H2SO4
2) K2Cr2O7+సజల H2SO4
3) NH4Cl ద్రావణం
4) NH4Cl పేస్టు
26. టెలివిజన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
1) మార్కోనీ 2) జె.ఎల్.బయర్‌డ
3) టెర్న్ 4) బాబేజ్
27. కింది వాటిలో విషపూరిత వాయువు?
1) CO2 2) CO
3) H2 4) O2
28. అమ్మోనియా వాయువును తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతి?
1) స్పర్శ 2) సీసపు గదులు
3) సైనమైడ్ 4) హేబర్
29. ఉతికే సోడా రసాయన నామం?
1) సోడియం కార్బోనేట్
2) సోడియం బై కార్బోనేట్
3) సోడియం సల్ఫేట్
4) ఏదీకాదు
30. {పొడ్యూసర్ వాయువు సంఘటనం?
1) CO+H2+N2 2) CO+H2
3) CO+H2+O2 4) CO2+N2+H2
31. ఖగోళ శాస్త్రానికి పునాది వేసిన గ్రంథం?
1) గణితం 2) లీలావతి గణితం
3) చరక సంహిత 4) ఆర్యభట్టీయం
32. అభిరుచులు, అభినందనలు, వైఖరులను కలిగి ఉండే రంగం?
1) జ్ఞాన రంగం 2) భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) పైవన్నీ
33. {Vహించడం కంటే కృత్యానికి, మూఢ విశ్వాసం కంటే పరిశోధనకు ప్రాముఖ్యతను ఇచ్చే పద్ధతి?
1) ఉపన్యాస పద్ధతి
2) అన్వేషణ పద్ధతి
3) ప్రకల్పన పద్ధతి
4) ప్రయోగశాల పద్ధతి
34. పాఠ్య పథకం అమలులో శిక్షణా బదలా యింపును సాధించే దశ?
1) సింహవలోకనం
2) సామాన్యీకరణం
3) వినియోగం 4) నియోజనం
35. {పక్షేపిత బోధనోపకరణానికి ఉదాహరణ?
1) చలనచిత్రం 2) చార్ట్
3) టెలివిజన్ 4) నల్లబల్ల
36. ఏ రకమైన ప్రశ్నల్లో విద్యార్థులు తమ మనసులోని భావాలను విపులంగా వివరించగలరు?
1) లక్ష్యాత్మక ప్రశ్నలు
2) ప్రక్షేపక ప్రశ్నలు
3) వ్యాసరూప ప్రశ్నలు
4) బహుళైచ్ఛిక ప్రశ్నలు
సమాధానాలు
1) 4; 2) 4; 3) 1; 4) 4; 5) 3;
6) 3; 7) 2; 8) 3; 9) 4; 10)3;
11) 1; 12) 4; 13) 2; 14) 3; 15) 2;
16) 4; 17) 3; 18) 2; 19) 2; 20) 3;
21) 1; 22) 2; 23) 4; 24) 4; 25) 2;
26) 2; 27) 2; 28) 4; 29) 1; 30) 1;
31) 4; 32) 2; 33) 2; 34) 3; 35) 1;
36) 3.