ప్రేమించి పెళ్లి చేసుకున్ :పరిటాల మంజుల
పాలకొల్లు అర్బన్ : చంద్రముఖి సీరియల్‌లో నటించడం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు అభిమానిగా మారడంతోపాటు తెలుగింటి కోడలినయ్యానని టీవీ సీరియల్ నటి పరిటాల మంజుల అన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు సారథ్యంలో కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గోకులంలో సీత’ షూటింగ్ నిమిత్తం పాలకొల్లు విచ్చేసిన ఆమె విలేకరులతో ముచ్చటించారు.
బుల్లితెర నటిగా ఎలా అవకాశాలొచ్చాయి
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుండగా కన్నడంలో కొత్త నటీనటులతో సీరియల్ తీస్తున్నారని మా నాన్న మిత్రుడొకరు చెప్పారు. ఫొటో షూట్‌కి వెళ్లి తొలి ప్రయత్నంలోనే హీరోయిన్ పాత్ర దక్కించుకున్నాను.
తెలుగులో బుల్లితెరకు ఎలా పరిచయమయ్యారు
బెంగళూరులో ఆర్కా మీడియా సంస్థ ద్వారా తెలుగులో నటించే అవకాశం వచ్చింది. తెలుగులో తొలి సీరియల్ చంద్రముఖి.
కుటుంబ నేపథ్యం
నాన్న శివశంకర్ పోలీస్. అమ్మ పుష్ప గృహిణి. మేం నలుగురు ఆడపిల్లలం. నేను రెండో సంతానం. నాల్గో చెల్లి కీర్తి కూడా బుల్లితెర నటి.
ఎన్ని సీరియల్స్ నటించారు
కన్నడంలో మనయందు మూరుబాగిలు, ప్రేమ పిశాచిగలు, క్షణ-క్షణ, కాదంబరి, తులసి, కల్యాణి, రంగోలి, తెలుగులో చంద్రముఖి, అమ్మాయి కాపురం, చంద్రలేఖ, నీలాంబరి, ఇద్దరమ్మాయిలు, ఆకాశమంత, కాంచనగంగ, తరంగాలు, లేతమనసులు అన్నీ హీరోయిన్ పాత్రలే చేశా. కాంచనగంగలో విలన్ పాత్ర పోషించా.
పేరుతెచ్చిన సీరియల్
చంద్రముఖి, 1,850 ఎపిసోడ్‌లతో ఆరున్నరేళ్లు సాగింది.
మీది ప్రేమ వివాహమా
నా సహచర నటుడు, సినీ రచయిత ఓంకార్ కుమారుడు నిరుపమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా.
అవార్డులు మాటే ంటి
చంద్రముఖికి నాలుగు అవార్డులు అందుకున్నా. కాంచనగంగలో పాత్రకు పురస్కారం దక్కింది.
డ్రీమ్ రోల్
ఒకే సీరియల్‌లో రెండు విభిన్న పాత్రలు (హీరోయిన్, విలన్) చేయాలని ఉంది.