మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌ | OnePlus 5 launched in India today, price starts at Rs 32,999 | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌

Published Fri, Jun 23 2017 12:39 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM

మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌

మార్కెట్‌లోకి ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌

ప్రారంభ ధర రూ.32,999
ముంబై: చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్‌’ తాజాగా ‘వన్‌ప్లస్‌–5’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది 6 జీబీ ర్యామ్‌/64 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్‌/128 జీబీ మెమరీ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్లమర్లకు అందుబాటులో ఉండనుంది. వీటి ధరలు వరుసగా రూ.32,999, రూ.37,999గా ఉన్నాయి.

వినియోగదారులు ఈ ఫోన్లను అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల ఫుల్‌–హెచ్‌డీ స్క్రీన్, ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్, 16 ఎంపీ+ 20 ఎంపీ రియర్‌ డ్యూయెల్‌ కెమెరాలు, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 3,300 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్‌ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement