మొబైల్ ఫోన్ టెక్నాలజీ రోజురోజుకి విస్తరిస్తోంది. సరికొత్త ఆవిష్కరణలు ఫోన్ వాడకాన్ని మరింత సులువు చేస్తున్నాయి. ఫోన్ పెర్ఫ్మామెన్స్ మొదలు డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వరకు ప్రతీ దాంట్లో కొత్తగా వస్తున్న టెక్నాలజీ అబ్బుర పరుస్తోంది. తాజాగా మొబైల్ ఛార్జింగ్ విషయంలో వన్ ప్లస్ కొత్త మైలురాయిని ఆవిష్కరించింది.
వన్‌ప్లస్ తాజాగా 10ఆర్ 5జీ మొబైల్‌లో అమర్చిన ఛార్జింగ్ టెక్నాలజీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా మొబైల్‌ఫోన్‌ను ఛార్జ చేసేదిగా గుర్తింపు పొందింది. వన్‌ప్లస్ 10ఆర్ 5జీ మోడల్‌లో సూపర్‌వూక్ ఎండ్యురెన్స్ పేరుతో ప్రత్యేక ఎడిషన్ తెచ్చారు. ఇందులో ఏకంగా 150 వాట్స్ ఛార్జర్‌ను అమర్చారు. కేవలం 17 నిమిషాల వ్యవధిలోనే బ్యాటరీ 100 శాతం ఛార్జ్ చేయడం దీని ప్రత్యేకత.
ఆరేడేళ్ల కిందట ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత 5 వాట్స్ నుంచి ఇది మొదలయ్యాయి. ఇప్పటి వరకు మార్కెట్‌లో ఫాస్ట్ ఛార్జర్ కెపాసిటీ 65 వాట్స్‌గా ఉండేంది. కానీ పాత రికార్డులు బద్దలు కొడుతూ వన్ ప్లస్ ఏకంగా 150 వాట్స్ ఛార్జర్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
చదవండి: చూడటానికి పుట్టగొడుగులా ఉన్నా..ఈ గాడ్జెట్‌లో చాలా విషయం ఉందే!
Comments
Please login to add a commentAdd a comment