చైనా మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ సెల్యూట్ టు స్పీడ్ అంటూ తీసుకొచ్చిన వన్‌ప్లస్ 6టీ సిరీస్‌లో మెక్‌లారెన్ ఎడిషన్‌ను భారత మార్కెట్లలో నేడు (శనివారం) విడుదల చేసింది. మెక్‌లారెన్ బ్రాండ్ లోగోతో ప్రత్యేకంగా రూపొందించిన ఈ డివైస్ ప్రత్యేకంగా అమెజాన్‌లో అందుబాటులోకి వచ్చింది. అలాగే వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ , ఆన్‌లైన్ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చని తెలిపింది. 10జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ నాచ్ డిస్‌ప్లే ఈ ఫోన్ స్పెషల్ ఫీచర్లని కంపెనీ వెల్లడించింది. డిసెంబరు 24 వరకు విక్రయానికి లభ్యం.
మెక్‌లారెన్ ఎడిషన్ వన్‌ప్లస్ 6టీ ధర రూ. 50,999.
ఇక లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే వన్‌ప్లస్ 6టీ మెక్‌లారెన్ ఎడిషన్ కొనుగోలుపై యాక్సిస్ బ్యాంక్ కార్డులతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 2000 క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. ఈ కార్డుల ద్వారా డైరెక్టుగా కొనుగోలు చేసే వారికి రూ. 1,500 క్యాష్‌బ్యాక్ వస్తుంది. దీంతో పాటు పాత వన్‌ప్లస్ ఫోన్లను ఎక్స్ఛేంజ్ ద్వారా రూ. 3000 డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇతర వన్‌ప్లస్ 6టీ వేరియంట్లపై డిసెంబరు 24 వరకు ఆఫర్లు వర్తించనున్నాయి.
వన్‌ప్లస్ 6టీ మెక్‌లారెన్ ఫీచర్లు
6.41 అంగుళాల ఫుల్ హెచ్‌డీ నాచ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 9.0
ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845ఎస్ఓసీ ప్రాసెసర్
10జీబీ ర్యామ్,256జీబీ స్టోరేజ్
16+20 ఎంపీ రియర్ డ్యుయల్ కెమెరాల
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
3700ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment