హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఉన్న చైనా కంపెనీ వన్‌ప్లస్ అతిపెద్దఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తోంది. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హిమాయత్‌నగర్‌లో ఇది ఏర్పాటవుతోంది. కంపెనీకి ప్రపంచంలో ఇదే అతిపెద్ద, సొంత స్టోర్. ఈ ఏడాది చివరినాటికి నిర్మాణం పూర్తి కావొచ్చని సంస్థ భావిస్తోంది. వన్‌ప్లస్ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఆరు అంతస్తుల్లో సిద్ధమవుతున్న ఈ కేంద్రంలో రెస్టారెంట్, ప్లే ఏరియా వంటివి అందుబాటులోకి వస్తాయని కంపెనీ జీఎం వికాస్ అగర్వాల్ వెల్లడించారు. వన్‌ప్లస్ ఉత్పత్తుల విక్రయం కోసం ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సందర్భంగా సోమవారం ఆయన సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో మాట్లాడారు. ‘ఇప్పటికే హైదరాబాద్ గచ్చిబౌలిలో వన్‌ప్లస్ ఆర్‌అండ్‌డీ సెంటర్ ఉంది. ప్రస్తుతం 150 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. కొన్నేళ్లలో ఈ సంఖ్య వేలకు చేరుకుంటుంది. ఆర్‌అండ్‌డీ పరంగా సంస్థకు ఇదే అతిపెద్ద కేంద్రంగా నిలుస్తుంది. వన్‌ప్లస్ టీవీ అభివృద్ధి దశలో ఉంది. కొద్ది రోజుల్లో విడుదల చేస్తాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment