వన్‌ప్లస్‌ 6 టీ: ‘లక్కీస్టార్‌’ ఆఫర్‌ | OnePlus 6T Lucky Star offer From Amazon India offers 600 gifts to one buyer | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ 6 టీ: అమెజాన్‌ ‘లక్కీస్టార్‌’ ఆఫర్‌ వింటే..

Published Fri, Nov 30 2018 1:45 PM | Last Updated on Fri, Nov 30 2018 2:04 PM

OnePlus 6T Lucky Star offer From Amazon India offers 600 gifts to one buyer - Sakshi

సాక్షి, ముంబై: వన్‌ ప్లస్‌ 6టీ కొనుగోలు చేసిన వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌. చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వన్‌ప్లస్‌, ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ కంపెనీలు తమ వ్యాపార భాగస్వామ్యానికి 4వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు భారీ ఆఫర్‌ ప్రకటించాయి. ‘లక్కీ స్టార్‌’ గా ఎంపిక చేసిన వన్‌ప్లస్‌ 6 టీ కొనుగోలుదారుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 600 బహుమతులను ఆఫర్‌ చేస్తోంది.

నవంబర్ 30 -డిసెంబరు 2, 2019 మధ్య అమెజాన్ ఇండియా ద్వారా వన్‌ప్లస్‌ 6టీ  స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు 'లక్కీ స్టార్'గా ఎంపిక కావడానికి అర్హులు. ఈ 600 గిప్ట్స్‌లో అప్లయెన్సెస్‌, ఫ్యాషన్, గృహాలంకరణ వస్తువులు తదితర కేటగిరీల్లో అద్భుతమైన బహుమతులను పొందే అవకాశం ఉందని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ వెల్లడించారు. అయితే ఈ బహుమతిగా అందించే ఈ ఆరు వందల వస్తువుల విలువ ఎంత వుంటుంది అనే స్పష్టత లేదు.

దీనికి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లపై రూ .1,500 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అదనం. అలాగే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్జేంజ్‌ ద్వారా 3వేల ఆఫర్‌ కూడా ఉంది. దీంతోపాటు ఆరునెలల వరకు నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ను అందిస్తోంది.

లక్కీ స్టార్‌ ఎంపిక
డ్రా ద్వారా 'లక్కీ స్టార్' గా ఎంపిక చేసిన కస్టమర్‌ ఇమెయిల్ ద్వారా క్వాలిఫైయింగ్ ప్రశ్నకు సమాధానమివ్వాలి. అనంతరం లక్కీ విన్నర్‌ను ఎంపిక చేసి డిసెంబర్‌ 5న ప్రకటిస్తారు. అయితే ఈ ఆఫర్ తమిళనాడు రాష్ట్రంలో వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది.  వన్‌ప్లస్‌ 6కి కొనసాగింపుగా వన్‌ప్లస్‌ 6టీని భారతదేశంలో గత నెలలో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

వన్‌ప్లస్‌ 6టీ ఫీచర్లు
6.41అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే
2340 x 1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌
క్వాల్కాం స్నాప్‌డ్రాగెన్ 845 సాక్‌
ఆండ్రాయిడ్ 9 పై
6జీఈ/ 8జీబీర్యామ్‌, 128స్టోరేజ్‌/256స్టోరేజ్‌
20+16 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా
16ఎంపీ సెల్ఫీ కెమెరా
3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ
ధరలు:
6జీబీ ర్యామ్/128స్టోరేజ్‌వేరియంట్ రూ.37,999
8 జీబీ ర్యామ్/ 128 జీబి స్టోరేజ్‌ ధర రూ.41,999
256 స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.45,999

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement