
వన్‌ప్లస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ విక్రయానికి వచ్చింది. అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా నేటి(మంగళవారం) నుంచి ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి దీన్ని విక్రయానికి వచ్చింది. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌పై పలు లాంచ్ ఆఫర్లను ప్రకటించాయి. 6జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999 కాగ, 8జీబీ ర్యామ్, 128జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ధర రూ.37,999గా కంపెనీ తెలిపింది. మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్, ఐడియా నుంచి1,008జీబీ 4జీ మొబైల్ డేటా( రూ.357 రీఛార్జ్‌పై 18 నెలల పాటు రోజుకు 2జీబీ డేటా), జోమాటో గోల్డ్ ఏడాది ఉచిత మెంబర్‌షిప్, కిండిల్ స్టోర్‌పై రూ.500 క్రెడిట్, కొత్త అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు రూ.300 అమెజాన్ పే బ్యాలెన్స్, ప్రైమ్ వీడియో యాప్ ద్వారా వీడియో స్ట్రీమ్ చేస్తే రూ.250 అమెజాన్ పే బ్యాలెన్స్ అందుబాటులో ఉన్నాయి. వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌పై వన్‌ప్లస్ 5టీ కొనుగోలు చేసిన కస్టమర్లకు యాక్ససరీస్‌పై రూ.1000 తగ్గింపు లభించనుంది.
వన్‌ప్లస్ 5టీ ఫీచర్లు..
6 అంగుళాల అప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే
ప్రొటెక్షన్ కోసం గొర్రిల్లా గ్లాస్ 5
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆక్సీజెన్‌ఓఎస్ ఆధారిత ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్‌తో రన్నింగ్
రెండు ప్రైమరీ కెమెరాలు, ఒకటి 20మెగాపిక్సెల్ సెన్సార్, రెండోది 16 మెగాపిక్సెల్ మోడ్యూల్
ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా
తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఇమేజ్‌లు తీయడం దీని ప్రత్యేకత
3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
ఫింగర్‌ప్రింట్ స్కానర్
Comments
Please login to add a commentAdd a comment