వన్‌ప్లస్ సర్‌ప్రైజ్‌; తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు | OnePlus 8 and 8 Pro India prices and sale announced | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్ సర్ ప్రైజ్, తక్కువ ధరకే లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

Published Mon, Apr 20 2020 3:36 PM | Last Updated on Mon, Apr 20 2020 4:02 PM

OnePlus 8 and 8 Pro India prices and sale announced - Sakshi

సాక్షి, ముంబై: వన్‌ప్లస్  తన లేటెస్ట్  స్టార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. వన్‌ప్లస్ 8 ప్రో,  వన్‌ప్లస్ 8 ప్రోలను ఇటీవల గ్లోబల్ మార్కెట్ల ధరలను ప్రకటించిన  కొద్ది రోజుల తరువాత సోమవారం భారత్ లో వీటిలో ధరలను వెల్లడించిది. వన్ ప్లస్ బుల్లెట్స్ జెడ్ (ఇయర్ ఫోన్స్)ను కూడా కంపెనీ తీసుకొచ్చింది.  వీటి ధరను రూ. 1999గా  వుంచింది. 

వన్‌ప్లస్ 8 సిరీస్ ధరలు రూ. 41,999 నుంచి ప్రారంభమవుతాయి. అలాగే  లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ ప్రో ఫోన్‌ల అమ్మకాలు భారతదేశంలో ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ రెండు ఫోన్‌ల అమ్మకానికి ఇంకా ఖచ్చితమైన తేదీ ప్రకటించకపోయినప్పటికీ, బహుశా కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ ఎత్తివేసాక మే 3 తరువాతనుంచి అమ్మకాలకు అనుమతి లభించనుంది. ఆన్‌లైన్‌లో అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు వన్‌ప్లస్ ఆన్‌లైన్ స్టోర్‌లో లభిస్తాయి.  ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభిస్తాయి. అయితే వన్‌ప్లస్ 8, 6 జీబీ వేరియంట్ ఆన్‌లైన్‌లో అమెజాన్‌లో మాత్రమే లభిస్తుంది.(అద్భుతమైన వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్)

వన్‌ప్లస్ గ్లోబల్ లాంచ్ సందర్భంగా ప్రకటించని వన్‌ప్లస్ 8 స్పెషల్ వేరియంట్‌ (6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్)ను కూడా భారతదేశంలో విక్రయించబోతోంది.  అంతేకాదు భారతదేశంలో వన్‌ప్లస్ 8 ప్రో ధరలు ప్రపంచ ధరలతో పోలిస్తే తక్కువ ధరకే తీసుకురావడం విశేషం.

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్  మోడల్ ధర  రూ .41,999గా వుంటుంది. 
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్  ధర  రూ .44,999
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ రూ .49,999


వన్‌ప్లస్ 8 ప్రో  ధరలు
వన్‌ప్లస్ 8 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  రూ. 54,999 
12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్  ధర రూ .59,999 గా ఉండబోతోంది.

బుల్లెట్స్ జెడ్ (ఇయర్ ఫోన్స్) దరను రూ. 1999గా  వుంచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement