OnePlus Warp Car: పెట్రోల్ ధరలు రోజు రోజుకి భారీగా పెరిగి పోతుండటంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోలు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు తమ వాహనలను మార్కెట్లోకి తీసుకొని రావడం కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి మరో దిగ్గజ చైనా మొబైల్ కంపెనీ ప్రవేశించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 'వన్‌ప్లస్ లైఫ్' పేరుతో భారతదేశంలో ఆటోమోటివ్ కేటగిరీలోకి ప్రవేశించడానికి ట్రేడ్ మార్క్ కోసం దాఖలు చేసింది.
ఇప్పటికే దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు అన్నీ తమ ఈవీలను తీసుకొనిరావడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు మొబైల్ దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం షియోమీ, రియల్ మీ వంటి కంపెనీలు ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే వన్‌ప్లస్ కూడా ఈ రంగంలోకి వచ్చేందుకు సిద్దం అయ్యింది. రష్ లెన్ నివేదించిన ట్రేడ్ మార్క్ ఫైలింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ లైఫ్ బ్రాండ్ పేరుతో వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును ప్రారంభించాలని చూస్తోంది. గతంలో ఈ ఎలక్ట్రిక్ కారు గురుంచి సంస్థ ఒక విడుదల చేసింది. కానీ, చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోలేదు.
స్పోర్ట్స్ కారు
కానీ, ఇప్పుడు ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకోవడం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈ కారులో కూడా వన్‌ప్లస్ వర్ప్ టెక్నాలజీ కూడా ఇందులో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 3 సెకన్లలోపు అందుకొనున్నట్లు తెలుస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 467 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి కూడా 200 కిమీ అని తెలుస్తుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ కారును కేవలం 20 నిమిషాలు చార్జ్ చేస్తే దాదాపు 435 కిమీ వరకు వెళ్లగలదు అని సంస్థ తెలిపింది. ఈ కారు చూడాటానికి స్పోర్ట్స్ తరహా కారు లాగా కనిపిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment