One plus company
-
వన్‌ప్లస్ ఎలక్ట్రిక్ కారు.. రేంజ్, స్పీడ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
OnePlus Warp Car: పెట్రోల్ ధరలు రోజు రోజుకి భారీగా పెరిగి పోతుండటంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోలు వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజల ఆసక్తిని గమనించిన ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు తమ వాహనలను మార్కెట్లోకి తీసుకొని రావడం కోసం పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి మరో దిగ్గజ చైనా మొబైల్ కంపెనీ ప్రవేశించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 'వన్‌ప్లస్ లైఫ్' పేరుతో భారతదేశంలో ఆటోమోటివ్ కేటగిరీలోకి ప్రవేశించడానికి ట్రేడ్ మార్క్ కోసం దాఖలు చేసింది. ఇప్పటికే దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు అన్నీ తమ ఈవీలను తీసుకొనిరావడానికి వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు మొబైల్ దిగ్గజ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం షియోమీ, రియల్ మీ వంటి కంపెనీలు ఈ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే వన్‌ప్లస్ కూడా ఈ రంగంలోకి వచ్చేందుకు సిద్దం అయ్యింది. రష్ లెన్ నివేదించిన ట్రేడ్ మార్క్ ఫైలింగ్ ప్రకారం.. వన్‌ప్లస్ లైఫ్ బ్రాండ్ పేరుతో వన్‌ప్లస్ భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కారును ప్రారంభించాలని చూస్తోంది. గతంలో ఈ ఎలక్ట్రిక్ కారు గురుంచి సంస్థ ఒక విడుదల చేసింది. కానీ, చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోలేదు. స్పోర్ట్స్ కారు కానీ, ఇప్పుడు ట్రేడ్ మార్క్ కోసం దరఖాస్తు చేసుకోవడం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈ కారులో కూడా వన్‌ప్లస్ వర్ప్ టెక్నాలజీ కూడా ఇందులో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 3 సెకన్లలోపు అందుకొనున్నట్లు తెలుస్తుంది. దీనిని ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 467 కిలోమీటర్ల వరకు వెళ్ళగలదని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి కూడా 200 కిమీ అని తెలుస్తుంది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ కారును కేవలం 20 నిమిషాలు చార్జ్ చేస్తే దాదాపు 435 కిమీ వరకు వెళ్లగలదు అని సంస్థ తెలిపింది. ఈ కారు చూడాటానికి స్పోర్ట్స్ తరహా కారు లాగా కనిపిస్తుంది. -
ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వన్‌ప్లస్9 ఫీచర్స్
న్యూఢిల్లీ: భారత్ లో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతుంది. గత నెలలో వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసిందో లేదో అప్పుడే వన్ ప్లస్ నుండి రాబోయే ఫ్లాగ్ షిప్ మొబైలుపై రూమర్లు వ్యాపించాయి. వచ్చే 2021 మార్చిలో వన్ ప్లస్ 9 ఫ్లాగ్ షిప్ తీసుకు వస్తునట్లు ఒక వార్త ఆన్లైన్లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం రాబోయే వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్ కూడా వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ మాదిరిగానే ఉండనుంది.సెల్ఫీ కెమెరా, ప్రధాన కెమెరా వన్ ప్లస్ 8T స్మార్ట్ ఫోన్ మాదిరిగానే వన్ ప్లస్ 9 స్మార్ట్ ఫోన్ లో ఉండనున్నట్లు సమాచారం. అయితే, ఈ మొబైల్ లో కొంచెం పెద్ద 6.55-ఇంచ్ గల ప్యానెల్ కలిగి ఉంటుంది. గత నివేదికలకు విరుద్దంగా, ఈ మొబైల్ లో 144Hz అధిక రిఫ్రెష్ రేట్ తో రాబోతుంది. వన్‌ప్లస్ 9 లోని దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్లో 3 సెన్సార్లు మరియు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటాయి, రెండు సెన్సార్లు మూడవ దాని కంటే పెద్దవిగా ఉంటాయి. ఈ సిరీస్‌లో వన్‌ప్లస్ 9 మరియు వన్‌ప్లస్ 9 ప్రో అనే రెండు మోడళ్లు ఉంటాయి. రాబోయే వన్‌ప్లస్ 9 సిరీస్‌లో క్వాల్కామ్ రాబోయే స్నాప్‌డ్రాగన్ 875 చిప్ మరియు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని సమాచారం. ఈ మొబైల్ యొక్క అవుట్ ఆఫ్ ది బాక్స్ లో ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేసే ఆక్సిజన్ ఓఎస్ 11ను తీసుకొస్తునట్లు సమాచారం. వన్ ప్లస్ సింగిల్ కోర్ స్కోరు 1,122 మరియు మల్టీ కోర్ స్కోరు 2,733 ని సాధించడాన్ని కూడా గీక్ బెంచ్ లిస్టింగ్ హైలైట్ చేసింది. అయితే ఈ మొబైల్ లో వైర్ లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ తీసుకొస్తారా లేదా అనేది ఇంకా సమాచారం లేదు. చివరగా, అన్ని కొత్త వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లు లెమోనేడ్ అనే కోడ్ పేరుతో అభివృద్ధి చేస్తున్నారు. This could be our first look at the upcoming OnePlus 9 https://t.co/lpfFDHCkoJ — XDA (@xdadevelopers) November 16, 2020 -
వన్ ప్లస్ టీవీలు వచ్చేశాయ్
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్ భారత స్మార్ట్‌టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది. క్వాంటమ్ డాట్ ఎల్ఈడీ టెక్నాలజీ (4కే క్యూఎల్ఈడీ డిస్ప్లే)లో రెండు వేరియంట్లలో టీవీని ఇక్కడి మార్కెట్లోకి విడుదలచేసింది. వీటి ధరల శ్రేణి రూ. 69,900 – రూ. 99,900 కాగా, ఈనెల 28 నుంచి అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. హెచ్ఆర్డీ 10ప్లస్ సపోర్ట్, 50వాట్స్ ఎనిమిది–స్పీకర్ల సెటప్, సినిమాటిక్ సౌండ్ కోసం డాల్బీ అట్మోస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ‘7టీ స్మార్ట్‌ఫోన్’ విడుదల పండుగల సీజన్ నేపథ్యంలో అధునాతన స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘7టీ’ పేరిట విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 కాగా, మునుపటి వెర్షన్ 7కి కొనసాగింపుగా దీన్ని విడుదలచేసింది. సెప్టెంబర్ 27 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, పూణే, కోల్‌కతా, బెంగళూరు, ముంబై పాప్–అప్లలో వినియోగదారులకు లభ్యం కానున్నట్లు ప్రకటించింది. -
అద్దాల మేడలు.. అందమైన భవంతులు..
రాయదుర్గం: నగరానికి శివారులో నానక్‌రాంగూడ ఒకప్పుడు రాతి, మట్టిగుట్టలు, పంట పొలాలు ఉండేవి. అయితే ఇపుడు అక్క బహుళ అంతస్తుల అద్దాల మేడలతో రూపురేఖలే మారిపోయాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంస్థలన్నీ నేడు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటయ్యాయి. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ఆమెజాన్ రాకతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరిగింది. సుమారు 313 ఎకరాల విశాల స్థలంలో నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతం రూపుదిద్దుకుంది. ఇందులో ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రేడింగ్, ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఆఫీస్ ఆపరేషన్స్, కమొడిటీస్ ఎక్ఛేంజ్, వెంచర్ క్యాపిటల్, అసెస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో సుమారు రెండున్నర లక్షల మంది ఐటీ, ఇతర కేటగిరీల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగులు షిఫ్ట్‌ల వారీగా పనిచేస్తున్నారు. ఇప్పటికే వెలిసిన కంపెనీలు ఇవే... నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో అనేక కంపెనీలు వెలిశాయి. అందులో తాజాగా 12.3 ఎకరాల విశాల స్థలంలో ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేసినవిషయం తెలిసిందే. ఇందులో 15వేల మందికి ఉపాధి కలుగనున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్, ఐఆర్డీఏ, ఐసీఐసీఐ, ఐఐఆర్ఎం, హనీవెల్, కాంగ్నిజెంట్, హిటాచీ కన్సల్టింగ్, వర్చూషా, యాక్సెంచర్, టీసీఎస్, సైయింట్, క్యాపెజెమినీ, కంప్యూటర్ అసోసియేట్స్, ఓఎన్జీసీ,ప్రాంక్లిన్ టెంపుల్టన్, విజువల్సాఫ్ట్ వంటి అతిపెద్ద సంస్థలు వెలిశాయి. ఇందులో సీఏ సంస్థనే అతిపెద్దగా 20కి పైగా ఎకరాల్లో వెలిసింది. కాగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , వేవ్‌రాక్, విజువల్సాఫ్ట్, క్యాపెజెమిని, కాంగ్నిజెంట్, హనీవెల్, సెయింట్ వంటి సంస్థలు పదిఎకరాలకుపైగా ఏర్పాటయ్యాయి. షెరటాన్, హయ్యత్, ఓక్వుడ్ రెసిడెన్సీ వంటి స్టార్ హోటళ్ళు కూడా వెలిశాయి. క్యూసిటీ, కపిల్ టవర్స్, యాక్సెంచర్ వంటి అతిపెద్ద భవనాలు వెలిశాయి. వైద్యసౌకర్యం కోసం కాంటినెంటల్ ఆస్పత్రి, వాహనాల కోసం వరుణ్‌మోటార్స్ వంటివి కూడా నిర్వహిస్తున్నారు. వీటి చెంతనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో, ఇన్ఫోసిస్, టీఎస్ఐఐసీ సైబరాబాద్జోన్ కార్యాలయం, జలమండలి గచ్చిబౌలి సెక్షన్ కార్యాలయం, శాంతిసరోవర్‌లోని ఇన్నర్‌స్పేస్ భవనం కూడా ఉన్నాయి. నిన్న వన్‌ప్లస్ .....త్వరలో అమెరికన్ కాన్సులేట్, గూగుల్...... ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో మరికొన్ని సంస్థలు రానున్నాయి. వాటిలో సోమవారం రోడ్ నెంబర్–2లో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ సెంటర్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌ను టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించారు. త్వరలో అమెరికన్ కాన్సులేట్, గూగుల్ సంస్థలు రానున్నాయి. వీటిలో అమెరికన్ కాన్సులేట్‌కు 12.17 ఎకరాలు, గూగుల్ సంస్థకు ఏడున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించారు. మరో ఏడాదిన్నరలో అమెరికన్ కాన్సులేట్ భవనాన్ని పూర్తి చేయాలని బావిస్తున్నట్లు తెలిసింది. దీని రాకతో ప్రతి నిత్యం రెండున్నర వేల మందిని వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మరింతగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరుగనుంది. లింకు రోడ్లపై దృష్టి పెట్టిన టీఎస్ఐఐసీ సంస్థ.... నానక్‌రాంగూడ ఐటీకారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతానికి రాకపోకలు నగరం నుంచి చుట్టూరా ఉండే ప్రాంతాల నుంచి సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందు కోసం ఈ రెండు ప్రాంతాల కోసం లింకు రోడ్ల నిర్మాణంపై టీఎస్ఐఐసీ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతం రోజురోజుకూ బిజీగా మారుతోంది. ఇప్పటికే రెండున్నర లక్షల మంది పనిచేస్తుండగా మరో 20వేల మంది దాకా పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో టీఎస్ఐఐసీ పాలకమండలి, ఉన్నతాధికారుల చొరవతో లింకురోడ్ల నిర్మాణం, ఆర్టీసీ బస్సులతోపాటు టీఎస్ఐఐసీ ద్వారా ఆరు ఉచిత బస్సులను ఐటీ ఉద్యోగుల కోసమే నడుపుతున్నాం. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తాం. హరితహరంలో గ్రీనరీని పెంచుతున్నాం. – వినోద్‌కుమార్, జోనల్ మేనేజర్– సైబరాబాద్జోన్ టీఎస్ఐఐసీ -
కేటీఆర్‌పై ఒవైసీ ఆసక్తికర ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొబైల్ సంస్థ వన్‌ప్లస్ సోమవారం హైదరాబాద్‌లో ఆర్ అండ్ డీ సంస్థ ప్రారంభించిన సందర్భంగా ఒవైసీ కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. గత ఏడాది ఒప్పో, మొన్న అమెజాన్, తాజాగా వన్‌ప్లస్ కేంద్రాలు హైదరాబాద్‌లో కొలువు దీరిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రధానంగా లాస్ట్ ఇయర్ ఒప్పో..గతవారం అమెజాన్.. ఇప్పుడు వన్‌ప్లస్‌తో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతోందన్న ఓ జర్నలిస్టు ట్వీట్‌పై అసదుద్దీన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఈ క్రెడిట్ అంతా మాజీ మంత్రి కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతేకాదు కేటీఆర్‌ను మళ్లీ ప్రభుత్వంలో చూసేందుకు వేచిచూస్తున్నానంటూ ట్వీట్ చేయడం విశేషం. ఒవైసీ తాజా ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్ ఒవైసీకి ధన్యవాదాలు తెలిపారు. చదవండి : భారీ పెట్టుబడితో వన్‌ప్లస్ ఆర్ అండ్ డీ కేంద్రం Credit must be given to “ex minister”@KTRTRS ,waiting to see him back in governance https://t.co/ukbi46UIXj — Asaduddin Owaisi (@asadowaisi) August 26, 2019 🙏 Many thanks MP Saab for your very kind words https://t.co/xVM18OUAW8 — KTR (@KTRTRS) August 26, 2019 -
వన్‌ప్లస్ బంపర్ ఆఫర్ : ఈ ఫోన్‌పై రూ.10 వేలు తగ్గింపు
సాక్షి, ముంబై : చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు, ప్రీమియమ్ స్మార్ట్‌ఫోన్ మేకర్‌గా గుర్తింపుతెచ్చుకున్న వన్‌ప్లస్ తన లేటెస్ట్ స్టార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. అమెజాన్ సమ్మర్ సేల్ లో భాగంగా వన్‌ప్లస్ 6టీ 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9వేల తగ్గింపు ధరతో అందిస్తోంది. దీనికి అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై మరో 1500 రూపాయల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. అంటే మొత్తం రూ.10500ల భారీ తగ్గింపు లభిస్తోందన్న మాట. గతంలో అమెజాన్ ఫ్యాబ్ సేల్‌లో రూ.3వేలు తగ్గించిన సంస్థ తాజాగా మరో తగ్గింపును ప్రకటించింది. ప్రస్తుతం వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ రూ.31,499లకు లభిస్తోంది. అద్భుతమైన ఫీచర్లతో గత అక్టోబరులో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. కాగా మే 14న వన్‌ప్లస్ 7 పేరుతో మరో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేయనుంది వన్‌ప్లస్. -
వన్‌ప్లస్ 6టీ టీజర్ వచ్చేసింది...
వన్‌ప్లస్ 6 ఇచ్చిన బూస్టప్‌తో మరింత దూకుడు పెంచిన కంపెనీ వన్‌ప్లస్ '6టీ' వేరియంట్‌ను మరింత గ్రాండ్ లుక్‌లో మార్కెట్లోకి తీసుకురాబోతుంది. తన అప్‌కమింగ్ వన్‌ప్లస్ 6టీ స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. అమెజాన్ ఇండియాలో ఎక్స్‌క్లూజివ్‌గా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ‘నోటిఫై మి’ అనే పేజీతో వన్‌ప్లస్ 6టీ అమెజాన్ ఇండియాలో బుధవారం నుంచి లైవ్‌కు వచ్చింది. అమెజాన్‌లో మాత్రమే కాక, టీవీల్లో, ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లలో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ప్రమోషన్లను ఇస్తోంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా వన్‌ప్లస్ 6టీ ప్రకటనలను అదరగొడుతున్నారు. వన్‌ప్లస్ 6టీ కమింగ్ సూన్ అనేది, అమెజాన్ ఇండియా టీజర్ పేజీలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. వన్‌ప్లస్ 6 లాంచ్ అయిన మూడు నెలల్లోనే దీని టీజర్ వచ్చేసింది. ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో వస్తున్న తొలి వన్‌ప్లస్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇదే ఫీచర్‌ను వివో తన నెక్స్, వీ11 ప్రొ ఫోన్లలో, ఒప్పో ఆర్17 ప్రొలలో అందించాయి. వివో, ఒప్పో, వన్‌ప్లస్ లు సిస్టర్ బ్రాండ్లు. ఎప్పడికప్పుడూ తమ టెక్నాలజీలను ఈ కంపెనీలు షేర్ చేసుకుంటూ ఉంటుంటాయి. అయితే వన్‌ప్లస్ 6టీలో హెడ్‌ఫోన్ జాక్‌ను అందించడం లేదు. వైర్లెస్ ఛార్జింగ్ దీనికి ప్రధానమైన ఫీచర్‌గా వస్తోంది. బ్యాటరీ కూడా చాలా పెద్దదే అని రిపోర్టులు పేర్కొంటున్నాయి. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 ఫై ఆధారిత ఆక్సీజన్ ఓఎస్ ఫీచర్లుగా ఉండబోతున్నాయి. -
ప్రమాదంలో ఆ స్మార్ట్‌ఫోన్ యూజర్లు
వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రమాదంలో పడ్డారు. వన్‌ప్లస్ క్రెడిట్ కార్డు సమాచారం అటాక్‌కు గురైందని, దీంతో దాదాపు 40వేల మంది వరకు స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రమాదంలో పడ్డారని కంపెనీ ప్రకటించింది. కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా జరిపే తమ క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై మోసపూరిత ఛార్జీలను విధిస్తున్నారంటూ చాలామంది వినియోగదారులు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ అటాక్ విషయం వెలుగులోకి వచ్చింది. సైటులోని పేమెంట్ పేజీలోకి హానికరమైన కోడ్‌ను చొప్పించారని, దీంతో ఈ ఘటనలు జరుగుతున్నట్టు చైనీస్ టెక్ దిగ్గజం వన్‌ప్లస్ అధికారుల విచారణ రిపోర్టు వెల్లడించింది. ఈ విషయాన్ని కంపెనీ కూడా అధికారికంగా ప్రకటించేసింది. '' మా సిస్టమ్స్‌లో ఒకటి అటాక్ గురైంది. మా క్రెడిట్ కార్డు సమాచారాన్ని దొంగలించడానికి పేమెంట్ పేజ్ కోడ్‌లోకి హానికరమైన స్క్రిప్ట్‌ను చొప్పించారు. ఈ హానికరమైన స్క్రిప్ట్ యూజర్ల బ్రౌజర్ నుంచి నేరుగా డేటాను వారికి పంపుకుంటోంది. దీన్ని ప్రస్తుతం తొలగించాం'' అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ హానికరమైన స్క్రిప్ట్‌ను బారిన పడిన వినియోగదారులందరికీ హెచ్చరికలు పంపుతున్నామని, అంతేకాక ప్రభావితమైన సర్వర్‌ను నిర్భదించామని కంపెనీ పేర్కొంది. 2017 నవంబర్ మధ్య నుంచి 2018 జనవరి 11 వరకు ఎవరైతే, వన్‌ప్లస్.నెట్లో తమ క్రెడిట్ కార్డు సమాచారాన్ని ఎంటర్ చేశారో ఆ వినియోగదారులు దీని బారిన పడినట్టు కూడా తెలిపింది. వినియోగదారుల క్రెడిట్ కార్డులకు సంబంధించిన కీలక సమాచారం నెంబర్లు, తుది గడువు తేదీలు, సెక్యురిటీ తేదీలను స్కామర్లు పొందినట్టు తాము నమ్ముతున్నట్టు చెప్పింది. అయితే ఈ విషయం వెలుగులోకి వచ్చాక, ఈ కంపెనీ తన వినియోగదారులకు సంబంధించిన డేటాను యాక్సస్ చేసుకోవడానికి చైనీస్ అథారిటీలకు అనుమతి ఇస్తున్నట్టు కూడా వెల్లడైంది. వినియోగదారుల క్రెడిట్ కార్డులపై ఏమైనా అనుమానిత లావాదేవీలు జరిగినట్టు తెలిస్తే, వెంటనే కంపెనీని సంప్రదించమని కూడా వన్‌ప్లస్ ఆదేశిస్తోంది. ప్రస్తుతం తమ క్రెడిట్ కార్డు పేమెంట్ సిస్టమ్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు తమ పేమెంట్ ప్రొవైడర్లు పనిచేస్తున్నారని పేర్కొంది. -
భారత్‌లో మరో చైనా స్మార్ట్‌ఫోన్
వన్‌ప్లస్ నుంచి వన్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.21,999 న్యూఢిల్లీ: భారత మొబైల్ మార్కెట్లోకి మరో చైనా కంపెనీ ప్రవేశించింది. చైనాకు చెందిన వన్‌ప్లస్ కంపెనీ మంగళవారం వన్ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధర రూ.21,999. ఈ ఫోన్‌ను ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా కొనుగోలు చేయవచ్చని వన్‌ప్లస్ ఇండియా జనరల్ మేనేజర్ వికాస్ అగర్వాల్ చెప్పారు. ఈ వన్ మొబైల్ ఫోన్లో 2.5 గిగాహెర్ట్స్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్, 5.5 అంగుళాల డిస్ప్లే, 3 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ,13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా,5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3,100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ ఆధారిత సైనోజెన్‌మోడ్ 11ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుందని వివరించారు. అతిపెద్ద మార్కెట్‌గా భారత్... ప్రస్తుతం తమకు అతి పెద్ద మార్కెట్ చైనా అని, కానీ భవిష్యత్తులో ఈ స్థానానికి చైనాను తోసిరాజని భారత్ దూసుకువస్తుందని వికాస్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ వరకూ ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల డివైస్‌లను విక్రయించామని చెప్పారు. రానున్న నెలల్లో బెంగళూరులో ఒక ఇంజినీరింగ్ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవలే చైనాకు చెందిన షియోమి, ఒప్పొ, జొల్లా కంపెనీలు తమ స్మార్ట్ఫోన్లను భారత్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.